ఏనుగు నరసింహారెడ్డి రాసిన తెలంగాణ రుబాయిలపైన చింతపట్ల సుదర్శన్ రాసిన సమీక్షా వ్యాసం ఇక్కడ చదవండి:
ఎవరికివారు అదే తమ స్వంత పద్ధతిగా, ఏదిరాస్తే అది వచన కవిత్వంగా కవిత్వాన్ని దారితప్పిస్తున్న కారణంగా వచన కవిత్వం వివిధ రకాలుగా Unpoetic గా విస్తరిస్తున్న సమయంలో, responsible గా కవిత్వాన్ని ఒక దారంట నడిపించడం అంతసులువైన విషయంకాదు.
అనేక మంది కవులు కవిత్వాన్ని అనేక మాధ్యమాల్లో పంచిపెట్టడానికి Word order గాను dull prosaic Sermon గాను అత్యంత routine గానూ మార్చేశారు. వాక్యాల మధ్య చిక్కుకున్న కవిత్వాన్ని వెదుక్కోవలసిన పరిస్థితిని కల్పించారు.
వాక్యాలు ఎలాగైనా ఉండనీ ఎలాగైనా పరుగెత్తనీ, క్షణం కట్టి పడేసేవి, మనస్సుకి సూటిగా తగిలేవి, కొంచెం కళ్ళను తడిపేవీ ఆపైన ఆలోచింపచేసేవీ అయితే బేషరతుగా కవిత్వం అని అంగీకరించవచ్చు.
ఈ మధ్య ఇది కవిత్వం అని లేబిల్ అంటించిన ప్రతి దాన్ని doubtless గా చదివే సాహసం చెయ్యలేకపోతున్నాం. అంత మాత్రాన కవిత్యం ఒక ఖచ్చితమైన format లో ఉండాలని నా ఉద్దేశ్యం ఎంత మాత్రమూ కాదు. ఒక క్రమ పద్ధతిలో రాయబడిన దాన్ని కవిత్వం కాదనీ అనలేము.
ఒక system ని follow అవుతూ వాక్యాలనూ ఒక craft గా అనుసంథానిస్తూ, responsible గా disciplined గా రాయబడిన కవిత్వం అద్భుతాలు సృష్టించగలదని బలంగా నమ్మకం కలిగించే కవిత్వం ఇటీవల చదివే అవకాశం కలిగింది. ఈ కవిత్వాన్ని రుబాయిలు అంటారని ఈ నాలుగు పాదాల కవిత్వం పారసీ నుంచి వచ్చిందని, వాటిల్లో రదిఫ్ కాఫియాలుంటాయన్నది పక్కన పెట్టి వీటిని చదవుతూ ఉంటే గలగల పారే సెలయేటి ప్రక్కన ఆకాశంలో ఉదయిస్తున్న బంగారు సూర్యుడు, గూళ్ళు వదిలి పరుగు తీస్తున్న పక్షుల గుంపుల్ని చూస్తున్న feeling కలుగుతుంది. ఇదీకవిత్వం. పేరులోనే enormous entity ఉన్న కవి కవిత్వం.
ఈ కవిత్వాన్ని తెలంగాణ రుబాయిలు అన్నారు. నారాయణ రెడ్డి గారు ‘ప్రపంచపదులు’ రాశారు. కవిత్వానికి ఉన్న Universality ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రుబాయిలు కుడా title కు restrict అయి ఉండే కవిత్వం కాదు. ఎల్లలు దాటే కవిత్వం. తెలంగాణ మాండలికం ఉంటే ఉండవచ్చు - Yes, is it not one the worlds languages ?
536 నాలుగు పాదాల మీద నడిచే కవితలు దాదాపు 300 పేజీలు ఏనుగు నరసింహారెడ్డి రబాయిలు. సాధారణంగా ఒక format లో ఎక్కడ ఉంటుందా అని తటపటాయించే నాకు ఈ కవిత్వంలో ఎక్కడ లేదో వెదకడం సులభం అనిపించింది.
Not that every line is poetic but there is a lot of Poetry everywhere. Octave, Sestet, Couplet లలో బిగించిన Shakespeare Sonnets లో abundant Poetry ఉంది కదా!
ఇంత విస్తృతమైన కవిత్వన్ని అనేక restricted poetic lines గా arrange చెయ్యడం, లోతైన తాత్వికత జోడించడం, మానవ జీవితానికి సంబంధించిన అంశాలన్నీ స్పృశించడం వల్ల ఈ రుబాయిలని ఏనుగు నరసింహా రెడ్డి monumental work అని అనకుండా ఉండలేం. ఎడారిలో ఒయాసిస్సు కనపడితే ఎంత ఆనందిస్తామో! మూస appreciation కి అలవాటు పడ్డ మనం ఈ కవిని కాస్త లోతుగా చదివి కాస్త Serious గా అర్థం చేసుకుని ఇంకాస్త మనస్ఫూర్తిగా, నిజంగా.. నిజంగా appreciate చెయ్యాలి.
ఆలోచనల్ని streamline చెయ్యడం అల్పవాక్యాల్లో అనల్పమైన కవిత్వాన్ని ఆవిష్కరించడం ప్రతినాలుగవ పాదానికి పుత్యేకమైన Identity ని కల్పించడం, ప్రతి fragment లోనూ వైవిధ్యాన్ని ప్రదర్శించడం ఇవన్నీ great poetic achievement అయితే, నరసింహా రెడ్డి రుబాయిల్లో ఖచ్చితంగా ఇవి కనిపిస్తాయి.
ప్రాపంచిక అంశాలన్నిటినీ తనలో చేర్చుకున్న రుబాయిల diverse topics లో నేను బాగా connect అయిన, excite అయిన అంశం ‘తాత్వికత'. ఇదే ఈ కవిత్యంలో సింహభాగం అక్రమిస్తుంది 'వలయంలోపల వలయం’ లో spiritual intensity ఉన్న కొన్ని four faced gems ని ప్రస్తావించాలి.
ఏనుగు నరసింహా రెడ్డి Self-realization లోని తాత్విక కోణం 4వ, రుబాయిలోనే అర్థమవుతుంది. ఇది ఒక చేదు నిజం. మనకు పుడమితో ఋణ మున్నది కొంతకాలమే అన్న సత్యాన్ని తెల్సుకున్నాడు కనుక చేయాల్సిన పనులు ఏవో గుర్తుపట్టు ఏనుగు అని తనని తాను హెచ్చరించుకుంటాడు. ‘కొద్ది కలలకే నిద్దుర అందనున్నది మనకు’ అనే striking వాక్యం We are such stuff as dreams are made on and out little life is rounded with a sleep అన్న Shakespeare వాక్యాల్ని కళ్ళ ఎదుట నిలబెడ్తుంది. చిత్రంగా 8వ రుబాయి కూడా Shakespeare All The world is a stage’ను స్పురింప చేస్తుంది. నటన బాగా చేయవోయీ పాత్రధారి! ఎప్పుడు వేదిక ఎటువదిగుదుమొ' అనే వాక్యాల్లో కనిపిస్తుంది measured words measured thinking!!
రుబాయిలలో 4,8,29,54,65,68,96,110, 202, 211, 215, 236, 239, 242, 243, 248 లలో ప్రత్యేకంగా లోతైన జీవిత సత్యాల్ని, కవితాత్విక అంతరంగాన్ని చూసి ‘అప్రతిభులమవుతాము’. వీటిలో కొన్నింటిని ప్రత్యేకంగా ఉదహరించాలి.
Know Thyself అన్న Philosophic proclamation ధ్వనిస్తుంది 65వ రుబాయి. ఈ రుబాయిలో వాడు తెలుసంటాను వీడు తెలుసంటాను’ అంటూ hypocracy ని ఖండించడంతో పాటు ‘నేనెవడనొ ఇప్పటికీ నాకు తెలియదు’ అన్న ప్రశ్న తరతరాల నుంచి జ్ఞాన తృష్ణ కలిగిన ఆత్మను వేధించినదే. ఇది ఆది శంకరులనుంచి వర్తమాన అధ్యాత్మక తత్వవేత్తలందరూ ఎదుర్కొన్న ప్రశ్న!
జనన మరణాల చక్రాన్ని వ్యక్తీకరిస్తుంది 68వ రుబాయి. ఈ రుబాయి ‘పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరేశయనం’ అన్న సత్యానికి ఎంతో సరళంగా అక్షర రూపం కల్పించింది. ‘జననాలు ఎన్నెన్నో ఎత్తాలిగాదే, మరణాలు ఎన్నెన్నో పొందాలిగాదే’ తాత్వికతను ఇంత కంటే సులభంగా చెప్పడం కాదు కదా!
తనను తాను తెల్సుకోవడమనే తపన మనిషిలో ఏదో ఒక సమయంలో ఆరంభమవుతుంది. తాను ఎవరో తెల్సుకోవడానికి తన ఆత్మజ్ఞానం తప్ప మరొకటి అక్కరకు రాదు. 96వ రుబాయిలో ఇది అక్షరీకరించబడింది. ఆత్మతో సంభాషించడానికి మనిషికి ఎలాంటి అవరోధాలు ఉండకూడదు. ఎలాంటి అరమరికా హద్దూ ఉండ కూడదు. స్వార్థపూరితమైన బంధాలు సంకెళ్ళుగా మారవద్దు. ఈ రుబాయి మనిషి ఓ తాపసిలా ఉండాలని, బంధాలు లేకుండా, మరొకరి ప్రమేయం లేకుండా, పక్షిలా స్వేఛ్ఛగా విహరిస్తూ ఒంటరిగా తనను తాను తెల్సుకోవాలనే తత్వాన్ని బోధిస్తుంది. ‘ఆత్మ గుసగుసలను అవధరించుట కొరకు’ ఇదే అసలైన పద్ధతి. ఆత్మతో సంభాషించేటప్పుడు సృష్టిలోని చరాచర వస్తువుల్లో ప్రతిదీ చిత్రంగానే కనపడుతుంది. 'ప్రతిరాయీ ఒక చిత్రమే, ప్రతి చెట్టూ ఒక చిత్రమే, ఎవరు చేసిరో తెలుసుకో ప్రతి జీవీ ఒక చిత్రమే’. ఈ సృష్టి సమస్తము మనకు అర్థం కాని ఒక చిత్రమైన విషయమే. ఈ 110వ రుబాయికి మూడవ పాదం నూక్లియస్ లాంటిది
ఈ సమస్త విచిత్రాలలో కొన్ని సృజించిన వారెవరో తెలుసుకోవాలన్న ఆరాటమే తాత్వికతకు మూలమైన అంశం.
ఈ రుబాయికి చాలా దగ్గరగా ఉండే రుబాయి 202. ఇంత చిత్రమైన లోకాన్ని చూడ్డంతో పాటు ‘ఇంతలా శోకాన్ని చూస్తిమి, ఎట్లాంటి దుఃఖాన్ని చూస్తిమి’ అనే వాక్యాలు రెండింటిలోనూ దు:ఖమే ఉన్నప్పటికీ అర్ధంలో తేడా కనిపిస్తుంది. ఒకశోకం దుఃఖ భారానికి సంబంధించినదయితే మరొకటి వివిధ రకాల దుఃఖానికి సంబంధించినది. ఈ వాక్యాలను ‘అయినా వదలదేమి ఆశ' అన్నది epigrammatic గా సంపూర్ణం చేస్తుంది. ఈ ఆశే ఎటువంటి దఃఖానికైనా కారణమని ధ్వనిస్తుంది.
‘దునియాభి అజబ్ సరాయెఫానీ దేఖీ
యహాంకొ హర్ చీజ్ ఆనీజానీదేఖీ
జొ జాకే న ఆయే ఒ బుడాపాదేఖా
జొ ఆకే న జాయే ఒ జవానీదేఖీ’
అంటాడు ఉర్దూ కవి మీర్ అనిస్. ఈ భావాన్నే వ్యక్తం చేస్తుంది 211వ రుబాయి . అనంతంగా సాగిపోతున్న ఈలోకంలో మనం ఎవరం? మనస్థానం ఏమిటి అన్న పరిశీలన ఇక్కడ కనిపిస్తుంది. ఈ లోకంలో నువ్వు ‘మనమంతా వచ్చిపోవు బాటసారులమే’. మనం ఉన్నా లేకపోయినా లోకం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎంతో తాత్విక వివేచన ఉన్నవారికే అర్థం అయ్యే విషయం ఇది.
మనమంతా వచ్చిపోయే బాటసారులం అనడంతో పాటు ఇక్కడికి రావడానికి ముందు ఎక్కడి వారమో అన్న మీమాంస కూడా కనిపిస్తుంది రుబాయి 215లో
'ఇక్కడ రాకముందు ఏక్కడి వారము
అక్కడ లేకముందు ఎక్కడి వారము
మనకే తెలియని తుది మొదలు జాడ మనది
యాడనూ లేనప్పుడు మన మేడి వారము’
మనిషి జీవన ప్రయాణం వర్తమానానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. ఏ ప్రయాణం ఎక్కడ ఆరంభమయిందో తెలియదు. గతం వర్తమానం భవిష్యత్తు అన్నీ కల్సిన human existence inevitable అని తెలియచేస్తుంది. Every existing thing is born without reason, Prolongs itself out of weakness and dies by chance అన్నాడు Jean-Paul Sartre, నిజమే మనకే తెలియదు మన ప్రయాణం ఎక్కడ మొదలైందో ఎక్కడి దాకా కొనసాగుతుందో!
243 రుబాయి ఈ భావానికి కొనసాగింపు
‘కాలం ఎడతెగనిది
జీవం తెగిపోనినది
రూపాంతరమే కాని
పదం వట్టిపోనిది’
ఇక్కడ existence ని వివిధ రూపాలలో చూస్తాడు కవి. ఏదో ఒకరూపంలో existence అనేది మాత్రం ఖచ్చితమైన విషయం. అలాగే మొదలూ తుది లేనిది కాలం. మనిషికి కూడా అంతం అనేది లేదు. వేరు వేరు రూపాల్లో మళ్ళీ మళ్ళీ వస్తూనే వుంటాడు.
న జాయతే మ్రియతే వా కదాచిత్
నాయం భూత్వా భవితా వాన భూయ్య
అజో నిత్య: శాశ్వతోయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే
భగవద్గీత 2వ అధ్యాయం, 20వ శ్లోకం లో చెప్పబడ్డ the soul is neither born, nor does it ever die, the soul is eternal ummortal and age less అనే సత్యాన్ని నదీ ప్రవాహంతో పోల్చడం personification of human soul and enistence. ఆత్మ ప్రయాణాన్ని ఒక నదీ ప్రవాహంగా చెప్పడం రుబాయి విశేషం.
మనిషి జీవితపు ఆశాశ్వత తత్వాన్ని విడమరుస్తుంది 248వ రుబాయి. ఈ జగన్నాటకంలో మనిషి ఒక పాత్ర ధారి మాత్రమే. ఆ సూత్రధారి ఆజ్ఞలను పాటించటమే మనిషి చేయగలిగేది. తనపాత్ర ఎక్కడో అక్కడ ముగిసి పోతుందని ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడు ఈ జీవిత నాటక రంగం నుంచి ‘exit’ అవ్వాలని మనిషికి తెల్సు. అయితే ఇదంతా సూత్రధారి విలాసమనే జ్ఞానం చాలా మందికి అర్థం కాదు. సూత్రధారి పిలుపు కొత్తదేమీ కాదు. ఇదివరకు ఎన్నిసార్లు రంగస్థలం నుంచి నిష్క్రమించాం. ఎన్నిసార్లు మళ్ళీ రంగస్థలం మీద మరో పాత్రను నిర్వహించడానికి వచ్చాం అన్న వివేచనము కల్పిస్తుంది ఈ రుబాయి. ‘తెలియందల్లా సూత్రధారి విలాస మొక్కటే’ అన్నది వ్యక్తుల జ్ఞాన సంబంధమైన విషయం.
‘I don't fear death. I had been dead for billions of years before I was born and had not suffered the slightest inconvenience from it’ అన్నాడు ప్రఖ్యాత అమెరికన్ రచయిత Mark Twain.
ఒక కళాఖండాన్ని చూసినప్పుడు అది వివిధ వ్యక్తులకు వివిధ రాకలుగా కనిపించవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో అంశం విశిష్టమైనది అనిపించవచ్చు. ఇది ఆయా వ్యక్తుల ‘perception’ కు సంబంధించిన విషయం. అలాగే ఒక కవితా రూపాన్ని పరిశీలించేటప్పుడు వివిధ వ్యక్తుల స్పందన వేరుగా ఉండవచ్చు. ఈ రుబాయిల్లో కొందరికి structure పట్ల, కొందరికి పదాల కూర్పు పట్ల కొందరికి వైవిధ్యం ఉన్న అంశాల పట్ల కలుగవచ్చు. నేను ఏనుగు నరసింహా రెడ్డి రుబాయిలను artistic embellishment కోసమో enchanting కవిత్వం కోసమో చదవ లేదు. Self-realization శాశ్వత సత్యాలు, సరళమైన పద్ధతిలో అర్థమయ్యే తాత్వికత నన్ను ఈ రుబాయిల్లొని philosophical expression ని అధ్యయనం చెయ్యడానికి motivate చేశాయి. Spirituality is a brave search for the truth about existence, fearlessly peering into the mysterious nature of life అన్న రచయిత్రి Elizabeth lesser వాక్యాలకు సరిపోయే ఏనుగు నరసింహారెడ్డి రుబాయిలు ఆయన సాహిత్య సృజనలో ‘leading light’ గా నిలిచిపోతాయి. కవులు వ్రాసిన వాటిలో ఏవో కొన్ని మాత్రమే సార్వకాలికంగా నిలిచిపోతవి. అలా నిలిచి పోయేవే తెలంగాణ రుబాయిలు. ఇది ఏనుగు నరసింహా రెడ్డి తెలుగు సాహిత్యాన్ని ‘enrich’ చెయ్యడానికి అందించిన ‘major contribution’.