14మంది అమ్మాయిలతో ప్రేమాయణం..కథ అడ్డం తిరగడంతో..

By ramya NFirst Published 21, Feb 2019, 10:09 AM IST
Highlights

ఒక కుర్రాడు ప్లేబాయ్ అవతారం ఎత్తి.. దాదాపు 14మంది అమ్మాయిలను ఒకేసారి లైన్లో పెట్టాడు. తీరావాళ్లందరికీ నిజం తెలసేసరికి మనోడు కోమాలోకి వెళ్లిపోయాడు.
 


మిస్టర్ మజ్నూ సినిమా చూశారా..? అందులో హీరో అఖిల్ ఒక కేసులో ఇరుక్కుంటే.. అతని గర్ల్ ఫ్రెండ్స్ అందరూ.. అతన్ని సేవ్ చేయడానికి ఒకేచోటకు వచ్చి చేరుకుంటారు. అక్కడికి వచ్చాక.. వాళ్లంతా అతని గర్ల్ ఫ్రెండ్స్ అని తెలుసుకొని.. ఒకరిని మరొకరు చితకబాదుకుంటారు. సేమ్ అలాంటి  సీనే ఒకటి నిజజీవితంలో చోటుచేసుకుంది. ఒక కుర్రాడు ప్లేబాయ్ అవతారం ఎత్తి.. దాదాపు 14మంది అమ్మాయిలను ఒకేసారి లైన్లో పెట్టాడు. తీరావాళ్లందరికీ నిజం తెలసేసరికి మనోడు కోమాలోకి వెళ్లిపోయాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. 18ఏళ్ల రఖీబ్ అనే యువకుడు ప్రేమలో పట్టాడు. ప్రేమలో పడటం తప్పులేదు కానీ.. ఒకేసారి 14మంది అమ్మాయిలను లైన్లో పెట్టాడు. ఆ అమ్మాయిలంతా.. మనోడి ప్రేమలో పీకల్లోతులో మునిగిపోయారు. కొన్నాళ్లపాటు.. 14మందితో ఎంచక్కా ఎంజాయ్ చేశాడు. ఇటీవల వచ్చిన ఫిబ్రవరి 14(వాలంటైన్స్ డే) అతని జీవితాన్ని మార్చేసింది. ఉదయాన్నే రఖీబ్ లేచి చూసేసరికి అతని గది ముందు 14మంది గర్ల్ ఫ్రెండ్స్ నిల్చొని ఉన్నారు. అంతే.. అది చూసి తట్టుకోలకపోయాడు. వెంటనే కోమాలోకి వెళ్లిపోయాడు.

ఈ ఘటనపై అతని గర్ల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఏమందో తెలుసా..‘‘ ఒక రోజు రిఖబ్ ప్రవర్తన నాకు తేడాగా అనిపించింది. అతనికి తెలీకుండా ఫోన్ చెక్ చేశాను. అందులో బేబీ 1, బేబీ2 అంటూ.. 14మంది అమ్మాయిల నెంబర్లు సేవ్ చేసి ఉన్నాయి. అందరితో ప్రేమగా చాట్ చేసిన దృశ్యాలు కనిపించాయి. నాతోపాటు మరో 13మందిని మోసం చేశాడని తెలుసుకున్నాను. వెంటనే వాళ్లందరికీ ఈ విషయం చెప్పాను. అందరం కలిసి షాక్ ఇద్దామని వాలంటైన్స్ డే రోజు తన దగ్గరికి వస్తే.. అతను కోమాలోకి వెళ్లిపోయాడు. అతను కోలుకున్నాక.. మేమంతా కలిసి తనతో హ్యాపీగా ఉంటాము. తను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పింది. 

Last Updated 21, Feb 2019, 10:09 AM IST