సెక్స్ కి బానిసలుగా మారారా..? ఇది కూడా ఓ రోగమేనా..?

First Published Jul 9, 2018, 2:46 PM IST
Highlights

2014లో ఓ అధ్యయనం నిర్వహించగా.. పోర్న్ వీడియోలు చూస్తున్నపుడు, డ్రగ్స్ తీసుకుంటున్నపుడూ మెదడులో ఒకే తరహా చర్యలు జరిగాయని గుర్తించారు

మద్యం, స్మోకింగ్, డ్రగ్స్ కి బానిసలు అయిన వారు మనకు తరచూ ఎదురుపడుతూనే ఉంటారు. వాటికి బానిసలు కావడం వల్ల కలిగే నష్టాలు కూడా మనకు తెలుసు. కానీ.. సెక్స్ కి బానిసగా మారడం కూడా ప్రమాదమేనా..? అవుననే అంటున్నారు పరిశోధకులు.

సెక్స్ ఆరోగ్యానికి మంచిది అన్న విషయం తెలిసిందే. అయితే.. అదే శృంగారం శృతి మించితే మాత్రం ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఎక్కువగా సెక్స్ చేస్తేనే బానిసలుగా మారినట్లు కాదు. గంటల తరబడి పోర్న్ చిత్రాలు చూడటం. సెక్స్ కోరికలు ఎక్కువగా కలిగి ఉండటం.. తరచూ సెక్స్ చేయాలని అనిపించడం కూడా దీని కిందకే వస్తుందని అంటున్నారు.

2013 నుంచి ఇప్పటి వరకూ బ్రిటన్‌కు చెందిన 21,000 మంది ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు  ప్రయత్నిస్తున్నారట. వీరిలో 91 శాతం మంది పురుషులు. కాగా.. బాధితుల్లో కేవలం 10 శాతం మంది మాత్రమే వైద్యుల వద్దకు వెళ్లారు. 2013లో సెక్స్ ఎడిక్షన్‌ను మానసిక రుగ్మతల జాబితాలో చేర్చాలని అమెరికా, బ్రిటన్‌లు భావించాయి.

అయితే సెక్స్‌ను ఓ వ్యసనంగా గుర్తించేందుకు సరైన ఆధారం లేకపోవడంతో దీన్ని రుగ్మతల జాబితాలో చేర్చలేదు.కానీ.. ‘‘కంపల్సివ్ సెక్సువల్ బిహేవియర్’’ను ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించే అంతర్జాతీయ రోగాల వర్గీకరణలో చేర్చాలని ప్రతిపాదనలు వచ్చాయి. గతంలో జూదాన్ని, అదే పనిగా తినడాన్ని కూడా కంపల్సివ్ బిహేవియర్స్‌లో చేర్చారు. అలాగే ఇప్పుడు సెక్స్ ఎడిక్షన్ కూడా అందులో చేరుతుందని కొందరు నిపుణులు భావిస్తున్నారు.

2014లో ఓ అధ్యయనం నిర్వహించగా.. పోర్న్ వీడియోలు చూస్తున్నపుడు, డ్రగ్స్ తీసుకుంటున్నపుడూ మెదడులో ఒకే తరహా చర్యలు జరిగాయని గుర్తించారు. అయితే దీని ఆధారంగా సెక్స్‌ను ఒక వ్యసనంగా పరిగణించలేమని ఈ అధ్యయానికి నేతృత్వం వహించిన పరిశోధకుడు డాక్టర్ వెలరే వూన్ తెలిపారు.

కొందరు మాత్రం ఈ వాదనను తప్పుపడుతున్నారు. సెక్స్ లేదా హస్త ప్రయోగాన్ని ఆల్కహాల్, ఇతర డ్రగ్స్‌తో పోల్చడం హాస్యాస్పదమని మరికొందరు పేర్కొనడం విశేషం.

click me!