అందులో ఫెయిల్యూర్.. కారణం పురుషులే..

By ramya neerukondaFirst Published Jan 15, 2019, 10:27 AM IST
Highlights

వయోజనులైన పురుషుల్లో మిల్లీలీటర్‌కు 6 కోట్లుగా ఉన్న స్పెర్మ్ కౌంట్ (వీర్య కణాల సంఖ్య) ప్రస్తుతం 2 కోట్లకు క్షీణించిందని పరిశోధనలో తేలింది.

సంతానలేమితో బాధపడుతున్న దంపతుల సంఖ్య ప్రస్తుత కాలంలో రోజురోజుకీ పెరిగిపోతుంది. సంవత్సరాలు గడుస్తున్నా.. పిల్లలు కలగకపోవడంతో.. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నవారు లక్షల్లో ఉన్నారనడంలో ఆశ్చర్యం లేదు. అయితే..అయితే ఈ సమస్యకు దాదాపు 50 శాతం పురుషులే కారణమని, వారిలో పునరుత్పాదక శక్తి లోపించడం వల్లనే ఇలా జరుగుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తన నివేదికలో స్పష్టం చేసింది. 

మన దేశంలో ఏటా 1.2 కోట్ల నుంచి 1.8 కోట్ల మంది దంపతుల్లో సంతానలేమి సమస్యలు నిర్ధారణ అవుతున్నట్టు ఎయిమ్స్ (ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) వైద్యులు వెల్లడించారు. మూడు దశాబ్దాల క్రితం మన దేశంలోని వయోజనులైన పురుషుల్లో మిల్లీలీటర్‌కు 6 కోట్లుగా ఉన్న స్పెర్మ్ కౌంట్ (వీర్య కణాల సంఖ్య) ప్రస్తుతం 2 కోట్లకు క్షీణించిందని, అనారోగ్యకరమైన జీవన విధానం, మానసిక వత్తిడితో కూడిన ఉద్యోగాలు, కాలుష్యం, పౌష్ఠికాహార లోపం, మద్యపానం, ధూమపానం లాంటి దురలవాట్లు ఇందుకు కారణమని వివరించారు. 

పొగాకు వినియోగం వల్ల వీర్య ఉత్పత్తి క్షీణిస్తుందని వారు తెలిపారు. భారత మహిళలు, ప్రత్యేకించి 29 నుంచి 35 ఏండ్లలోపు మహిళలు గర్భం దాల్చలేకపోవడానికి పురుషుల్లో సంతానోత్పత్తి లోపమే ప్రధాన కారణమని, వారిలో వీర్య కణాల సంఖ్య చాలా తక్కువగా ఉండటం, వీర్య కణాల చలనశీలత పేలవంగా లేదా వాటి నిర్మాణం సరిగా లేకపోడం వల్లనే ఇలా జరుగుతున్నదని సంతాన సాఫల్య నిపుణులు

click me!