పొట్ట కరగడానికి, బరువు తగ్గడానికి ప్రతిరోజూ వ్యాయామం చేసేవారు చాలా మందే ఉన్నారు. కానీ బెల్లీ ఫ్యాట్ మాత్రం తగ్గడం లేదని బాధపడిపోతుంటారు. ఇలాంటి వారు ఉదయాన్నే కొన్ని వాటర్ ను తాగితే పొట్ట పక్కాగా కరుగుతుంది. అవేంటంటే?
పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు అంత ఈజీగా తగ్గదు. కానీ ఈ బెల్లీ ఫ్యాట్ మనల్ని ఎన్నో వ్యాధుల బారిన పడేస్తుంది. అందుకే చాలా మంది దీన్ని తిగ్గించుకోవడానికి రెగ్యులర్ గా వ్యాయామం చేస్తుంటారు. అయినా కొంతమంది పొట్ట మాత్రం తగ్గదు. కానీ ఓ స్పెషల్ వాటర్ ను మీరు ఉదయాన్నే తాగితే.. మీ బెల్లీ ఫ్యాట్ ఫాస్ట్ గా కరగడం మొదలవుతుంది.ఎందుకంటే ఈ వాటర్ మీ నడుకు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించే ప్రక్రియను పెంచుతుంది. దీనికోసం ఏ వాటర్ ను తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నిమ్మకాయ నీళ్లు
నిమ్మకాయ నీళ్లు మన ఇమ్యూనిటీ పవర్ పెంచి రోగాలకు దూరంగా ఉంచుతుంది. ఈ ముచ్చట అందరికీ తెలిసిందే. కానీ ఈ వాటర్ ను తాగితే కూడా మీ బెల్లీ ఫ్యాట్ తొందరగా కరిగిపోతుంది. మీరు ప్రతిరోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగితే.. మీ శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇది మీ కాలెయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పొట్ట కొవ్వు కూడా తగ్గుతుంది.
అల్లం వాటర్
అల్లం వాటర్ ను ఉదయాన్నే తాగితే శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. మెటబాలిజం ఎంత ఎక్కువగా ఉంటే.. మీరు అంత ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి బాగా సహాయపడుతుంది.
కీరదోసకాయ వాటర్
కీరదోసకాయతో కూడా మీరు మీ పొట్టను కరిగించొచ్చు. ఇందుకోసం కీరదోసకాయ ముక్కలను నీళ్లలో రాత్రంతా నానబట్టి ఉదయాన్నే తాగండి. ఈ నీళ్లను తాగితే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. శరీర మంట తగ్గుతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్
ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మీకు ఎక్కువ ఆకలిగా అనిపిస్తే ప్రతిరోజూ ఆపిల్ సైడర్ వెనిగర్ ను నీటిలో కలిపి తాగండి. ఇది పొత్తి కడుపు కొవ్వును తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.
పుదీనా నీరు
పుదీనా వాటర్ మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. ఈ నీళ్లను తాగితే గ్యాస్, కడుపు ఉబ్బరం, అపానవాయువును తగ్గిస్తుంది. వీటి కారణంగా మీకు కడుపు ఉబ్బినట్టైతే ప్రతిరోజూ పుదీనా నీటిని తాగండి. ఇది మీ జీర్ణక్రియను సరిచేయడానికి సహాయపడుతుంది.
కలబంద నీరు
మీరు పొట్టను తగ్గించుకోవడానికి అలొవేరా నీటిని కూడా తాగొచ్చు. ఇందుకోసం అలోవెరా జెల్ ను నీటిలో మిక్స్ చేసి ప్రతిరోజూ ఉదయం తాగండి. ఇది మీ బరువును తగ్గించడంతో పాటుగా జీర్ణక్రియను కూడా సరిచేస్తుంది.