ఈ కూరగాయలను కడగకుండా వండారంటే మీ పని అంతే..!

By Shivaleela Rajamoni  |  First Published Jun 30, 2024, 3:09 PM IST

కొంతమంది కూరగాయలను మార్కెట్ నుంచి తెచ్చి అలాగే వండేస్తుంటారు. కానీ ఇది మంచి అలవాటు కాదు. కూరగాయలను కడగకుండా వండితే లేనిపోని సమస్యల బారిన పడాల్సి వస్తుంది. 
 


ఈ మధ్యకాలంలో చాలా మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడుతున్నారు. ఈ ఫుడ్ పాయిజనింగ్ ఒక సాధారణ, తీవ్రమైన సమస్య.  ఇది ఎవ్వరినైనా ప్రభావితం చేస్తుంది. మనం తినే ఆహారం కలుషితమైనప్పుడు లేదా హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు వంటి పరాన్నజీవుల వల్ల ఫుడ్ పాయిజనింగ్ గా మారుతుంది. దీనికి ప్రధాన కారణం మనం వంటకు ఉపయోగించే కూరగాయలను సరిగ్గా కడగకపోవడమేనంటున్నారు నిపుణులు. ఎలాంటి కూరగాయలను సరిగ్గా కడగకపోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఆకుకూరలు:  క్యాబేజీ, పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు పోషకాలకు మంచి వనరు. అయితే ఈ ఆకు కూరల్లో ఇ.కోలి, సాల్మో, మూన్, హిస్టరీ వంటి బ్యాక్టీరియా ఉంటుంది. వీటిని సరిగ్గా కడగకుండా ఉడికించినట్టైతే ఫుడ్ పాయిజనింగ్ కు కారణమువుతంది. 

Latest Videos

చర్మంతో తినగలిగే పండ్లు, కూరగాయలు: ఆపిల్, టమాటాలు,పియర్స్, దోసకాయలు మొదలైన కొన్ని కూరగాయలను, పండ్లను పీల్ తోనే అలాగే తినేస్తుంటాం. అయితే ఈ పీల్ పై బ్యాక్టీరియా ఉంటుంది.  అందుకే పండును కట్ చేసినప్పుడు బ్యాక్టీరియా పండుకు మొత్తం వ్యాపిస్తుంది. అందుకే వీటి తొక్క తీయడానికి ముందే వాటిని సరిగ్గా కడగాలి.

బెర్రీలు: స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు వంటి రకరకాల బెర్రీలకు ఎక్కువ మొత్తంలో పురుగుమందులను పిచికారి చేస్తారు. దీనివల్ల వాటి చర్ంపై పురుగుమందుల బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే వీటిని తినడానికి ముందు బెర్రీలను బాగా కడిగి, రన్నింగ్ వాటర్ లో బాగా కడిగి ఆరబెట్టాలి.

రూట్ వెజిటేబుల్స్: క్యారెట్లు, బంగాళాదుంపలు, ముల్లంగి వంటి రూట్ వెజిటేబుల్స్ మట్టిలో పెరుగుతాయి. అయితే ఇవి పెరిగే కొద్దీ బ్యాక్టీరియా, ధూళి ఎక్కువగా ఉంటాయి. కాబట్ట  వాటిని రన్నింగ్ వాటర్ లో బాగా కడిగి ఉపయోగించాలి. 

పండ్లు: పుచ్చకాయ, పనస, ఖర్బూజ వంటి పండ్లలో బ్యాక్టీరియా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి ఈ పండ్లను కట్ చేసి తినే ముందు రన్నింగ్ నీటిలో బాగా కడగాలి. అలాగే బ్రష్ తో దాని ఉపరితలాన్ని క్లీన్ చేసి తినాలి. 

ముల్లంగి: ముల్లంగిలో ఇ.కోలి, సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని ఉపయోగించే ముందు వీటిని రన్నింగ్ నీటిలో బాగా కడగాలి. ఆ తర్వాతే వంటకోసం ఉపయోగించాలి. 

మూలికలు: కొత్తిమీర, తులసి వంటి మూలికలు మట్టి నుంచి పెరిగే కొద్దీ వాటికి దుమ్ము,  బ్యాక్టీరియా ఎక్కువగా పట్టుకుంటాయి. అందుకే వీటిని ఉపయోగించేటప్పుడు బాగా కడగాలి. తేమను తగ్గించడానికి ఏదైనా కాగితంలో కాసేపు చుట్టి ఆరబెట్టండి. 
 

click me!