సినీ తారల బ్యూటీ సీక్రెట్... పురుషుల వీర్యంతో ఫేషియల్

By telugu team  |  First Published May 9, 2019, 2:57 PM IST

సాధారణంగా బ్యూటీ పార్లర్ లో అమ్మాయిలు అందం కోసం ఫేషియల్స్ లాంటివి చేయించుకుంటారు. ఇది మనకు తెలిసిన విషయమే.  కానీ... ఎంత ఫేషియల్స్ చేయించుకున్నా.. సినీ తారలకు వచ్చిన అందం సాధారణ అమ్మాయిలకు రాదు. 


సాధారణంగా బ్యూటీ పార్లర్ లో అమ్మాయిలు అందం కోసం ఫేషియల్స్ లాంటివి చేయించుకుంటారు. ఇది మనకు తెలిసిన విషయమే.  కానీ... ఎంత ఫేషియల్స్ చేయించుకున్నా.. సినీ తారలకు వచ్చిన అందం సాధారణ అమ్మాయిలకు రాదు. ఇప్పుడు వాళ్ల బ్యూటీ సీక్రెట్  ఒకటి బయటపడింది. అదేంటో తెలుసా..? పురుషుల వీర్యం. మీరు చదివింది నిజమే.. పురుషుల వీర్యంతో ఫేషియల్ చేయించుకుంటే అందం రెట్టింపు అవుతుందట. ఈ విషయాన్ని ఓ బ్యూటీషియన్ అధికారికంగా ప్రకటించింది.

కొద్ది రోజులు క్రితం నటి, మోడల్ షెర్లీన్ చోప్రా దీనిపై కామెంట్ కూడా చేసింది. తన బాయ్ ఫ్రెండ్ వీర్యంతో తాను రోజూ ఫేషియల్ చేయించుకుంటానని చెప్పింది. ఆమె చెప్పిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం కూడా రేపాయి. 

Latest Videos

కాగా.. అది నిజమేనని హాలీవుడ్ సెలబ్రిటీలకు ఫేషియలిస్ట్‌గా పనిచేస్తున్న చెల్సీ లూయిస్ కూడా తేల్చి చెప్పింది.  వీర్యాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని పేర్కొంది. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోడానికి ఇది మంచి చిట్కా అని పేర్కొంది. 

వీర్యంలో ‘స్పెర్మైన్’ అనే యాంటిఆక్సిడెంట్ కాంపౌండ్ ఉంటుందని, ఇది చర్మంపై ముడతలను అరికట్టి వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వదని లూయిస్ తెలిపింది. ‘‘మీ పార్టనర్ స్పెర్మ్‌ను ఫేస్ మాస్క్‌గా వాడినట్లయితే.. మీకు మొటిమలు, పగుళ్లు వంటి సమస్యలు రావు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీ ముఖం ఎంతో స్మూత్‌గా మెరుస్తుంది’’ అని లూయిస్ తెలిపింది. 

click me!