విడాకులకు దారి తీస్తున్న వీడియో గేమ్స్

By ramya neerukondaFirst Published Sep 19, 2018, 3:45 PM IST
Highlights

టీవీ, పోర్న్, సోషల్ మీడియాల తరువాత కంప్యూటర్, వీడియో గేమ్స్ కారణంగా విడాకులు తీసుకుంటున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. 

వీడియో గేమ్స్ కారణంగా వందల మంది భార్య భర్తలు.. విడాకులు తీసుకుంటున్నారట. మీరు చదివింది నిజమే. కేవలం వీడియో గేమ్స్ కారణంగా కొందరు జంటలు విడిపోయారట. ఇప్పటి వరకు వీడియో గేమ్స్ కారణంగా పిల్లల చదువులు పాడౌతాయి అనే అనుకునే వాళ్లం కానీ.. పెద్దల జీవితాలను కూడా మార్చేస్తాయని తాజా సర్వేలో వెల్లడయ్యింది.

టీవీ, పోర్న్, సోషల్ మీడియాల తరువాత కంప్యూటర్, వీడియో గేమ్స్ కారణంగా విడాకులు తీసుకుంటున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ఒక సర్వేను అనుసరించి ఆ వీడియో గేమ్ కారణంగా ఏడాదిలో 200కుపైగా జంటలు విడాకులు తీసుకుంటున్నాయట. ఈ గేమ్ పేరు ‘ఫార్ట్ నైట్’. ఫైటింగ్ గేమ్ అయిన ఇది కేవలం ఈతరం జనరేషన్‌లోని వ్యక్తులతోపాటు పెద్దవారిని కూడా విపరీతంగా ఆకట్టుకుంటోందట. ఈ గేమ్‌కు ప్రపంచవ్యాప్తంగా 125 మిలియన్ల చందాదారులున్నారు. ఈ గేమ్ విడుదలై ఏడాదే అయ్యింది. అంతకంతకూ ఈ గేమ్‌కు అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నదని తెలుస్తోంది. కాగా పరస్పరం కొట్టుకోవడాన్ని ఈ గేమ్ ప్రోత్సహిస్తున్నదనే ఆరోపణలున్నాయి.

click me!
Last Updated Sep 19, 2018, 3:45 PM IST
click me!