శృంగార వాంఛను పెంచే ఉత్ప్రేరకం కాదు. ఇది పురుషాంగానికి రక్త సరఫరాను పెంచే మందు మాత్రమే. యువకులకు ఈ మందు అవసరం ఏ మాత్రమూ లేదు.
చాలా మంది తమకేదో లైంగిక లోపం ఉందనే అపోహతో వయాగ్రాను ఉపయోగిస్తూ ఉంటారు. నిజానికి ఎవరిలోనైనా లైంగిక సమస్యలు ఉంటే.. వాటిలో 80శాతం మానసికమైనవే. వారిలో వారే ఎక్కువగా ఆలోచించుకొని ఈ సమస్యలకు కారణం అవుతారు. ఈ మానసిక సమస్యను వయాగ్రా ఏమాత్రం తగ్గించదు.
ఒకవేళ శారీరక సమస్యలే కారణమైతే వాటికి వైద్య చికిత్సలేవో అవసరమవుతాయే తప్ప వయాగ్రా కాదు. అకారణంగా వాడే వయాగ్రా వల్ల వచ్చే అనర్థాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. నిజానికి లైంగికంగా ఏ లోపమూ లేని పాతికేళ్ళ లోపు యువకులే నేడు వయాగ్రాను అధికంగా వాడుతున్నారు.
ఇది వారనుకున్నట్లుగా శృంగార వాంఛను పెంచే ఉత్ప్రేరకం కాదు. ఇది పురుషాంగానికి రక్త సరఫరాను పెంచే మందు మాత్రమే. యువకులకు ఈ మందు అవసరం ఏ మాత్రమూ లేదు. యవ్వనంలో అంగస్తంభన లోపం లాంటి సమస్యలు వారిలో ఉండవు. వారిలో ఉండేవి మానసిక ఆందోళనలే. ఇవే అప్పుడప్పుడూ అంగస్తంభన లోపాలకు, శీఘ్ర స్ఖలనాలకూ దారి తీస్తుంటాయి. దాన్ని వారు శారీరక సమస్యగా అనుకుంటారు.
అంగస్తంభన లోపాలు గానీ, మరే ఇతర వ్యాధులు కానీ లేని వారికి ఏ ఉత్ప్రేరకమూ అవసరం లేదు. ఆరోగ్యకరమైన, భయం లేని ఆత్మవిశ్వాసం తన లైంగిక సామర్థ్యం మీద నమ్మకం ఉండే పాజిటివ్ మనసే గొప్ప లైంగిక ఉత్ప్రేరకాలని తెలుసుకోవాలి.
ఆ సమస్యకు ఇతరేతర వ్యాధులు కారణం: మధుమేహం, అధిక రక్తపోటు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, ఆస్తమా, వెరికోసీల్, హైడ్రోసీల్, నాడీ సంబంధ వ్యాధులు, మూర్చ అధిక కొలెస్ట్రాల్ ఇలాంటివి ఏవైనా ఉంటే అంగస్తంభన సమస్య వస్తుంది. ఈ వ్యాధులకు వాడే మందుల వల్ల కూడా ఇది వస్తుంది. మానసిక వ్యాధులు తగ్గడానికి వాడే యాంటీ డిప్రెసివ్, యాంటీ సైకోటిక్ డ్రగ్స్ కూడా దీనికి మరో కారణం. మారిజునా, గంజాయి కూడా కారణమే. ఇవన్నీ పక్కనపెడితే.. వయాగ్రా కారణంగా కళ్లకు తీవ్ర నష్టం కలుగుతుందని, వర్ణ దృష్టిపై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.