
అన్ని రకాల దుస్తులమీదికి ఒకే రకమైన బ్రాలను వేసుకోవడం సరికాదు. ఎందుకంటే కొన్ని బ్రాల అంచులు డ్రెస్ పై నుంచి బయటకు కనిపిస్తాయి. అందుకే బ్రా ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఎలాంటి బ్రాలను వేసుకుంటే కంఫర్ట్ గా ఉంటుంది? ఏ డ్రెస్సు మీదికి ఎలాంటి బ్రాలను వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అన్లైన్డ్ బ్రా
ఆన్లైన్డ్ బ్రా అందంగా ఉంటుంది. ఈ బ్రాను చేతితో కత్తిరించిన పూల ఎంబ్రాయిడరీతో తయారుచేస్తారు. ఇది అందంగా మెరుస్తుంది. అంతేకాదు చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది. ఈ బ్రా రోజువారి దుస్తులను వేసుకోవడానికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. డెమి కట్ ఫ్రేమ్ తో ఉన్న ఈ బ్రా మిమ్మల్ని సెక్సీగా చేస్తుంది. అంతేకాదు దీన్ని వేసుకోవడం వల్ల మీ వక్షోజాలు అస్సలు బరువుగా అనిపించవు. అంటే మీరు దీన్ని ఎన్ని గంటలైనా వేసుకోవచ్చు. అయితే దీన్ని ధరించాలంటే మందు nipple pasties ను ఉపయోగించాలి.
స్పోర్ట్స్ బ్రా
స్పోర్ట్స్ బ్రాలను కేవలం జిమ్ కు వెళ్లే సమయంలోనే వేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. నిజానికి ఈ స్పోర్ట్స్ బ్రా లను కంఫర్ట్ గా ఉండటానికి ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఈ బ్రా లను వేసుకోవడం వల్ల మీ నడుము పెద్దగా అందంగా కనిపిస్తుంది. ఈ బ్రాకు ఉండే వెడల్పాటి పట్టీలు బిగ్గరగా ఉండి మిమ్మల్ని మరింత అందంగా కనిపించేలా చేస్తాయి.
స్ట్రాప్లెస్ బ్రా
భుజాల కంటే కిందికి లేదా స్ట్రాప్లెస్ సిల్హౌట్లను వేసుకోవడం ఇష్టం అయితే మీరు ఖచ్చితంగా స్ట్రాప్లెస్ బ్రాను ధరించండి. మీరు ప్లస్ సైజులో ఉంటే వీటిని తప్పనిసరిగా ధరించండి. ఇవి మీ డ్రెస్సును బాగా పట్టిఉంచుతాయి.
బ్రాలెట్
బ్రాలెట్లు ఎన్నో రకాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ బ్రాలు మీ నడుము అందంగా కనిపించేలా చేస్తాయి. వీటిని టాప్స్ లో లేదా టాప్ లేకుండా కూడా వేసుకోవచ్చు. వీటిలో ఉండే కప్పులు మీ రొమ్ములను పూర్తిగా కప్పి ఉంచుతాయి.
లేసీ నాన్ పెడ్
రోజూ ఒకేరకమైన బ్రాను వేసుకుని బోర్ కొట్టినవాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ బ్రాలో మీరు చాలా అందంగా కనిపిస్తారు. అంతేకాదు ఇది మిమ్మల్ని కంఫర్ట్ గా ఉంచుతాయి. ఈ బ్రా మీకు సహజ ఆకృతిని ఇస్తుంది. ఇది మిమ్మల్ని ఎక్కువ గంటలు సౌకర్యవంతంగా ఉంచుతుంది.