పెళ్లాం మీద బోర్ కొడుతుందా..?

By sivanagaprasad kodati  |  First Published Jan 30, 2019, 1:21 PM IST

ఇదివరకటి రోజుల్లో మూడు ముళ్లు పడ్డాయంటే ఆ బంధం నిండు నూరేళ్లే కొనసాగేది. కానీ మారుతున్న జీవనశైలి, ఖరీదైన ఉద్యోగాలు పాశ్చాత్య సంస్కృతి కారణంగా బంధాలు మధ్యలోనే తెగిపోతున్నాయి. విడాకులంటే గుండె ఆగినంతగా బాధపడేవారు ఆ రోజుల్లో.. కానీ ప్రస్తుతం బట్టలు మార్చుకున్నంత సేపు పట్టడం లేదు భాగస్వామిని మార్చుకోవడం.


ఇదివరకటి రోజుల్లో మూడు ముళ్లు పడ్డాయంటే ఆ బంధం నిండు నూరేళ్లే కొనసాగేది. కానీ మారుతున్న జీవనశైలి, ఖరీదైన ఉద్యోగాలు పాశ్చాత్య సంస్కృతి కారణంగా బంధాలు మధ్యలోనే తెగిపోతున్నాయి. విడాకులంటే గుండె ఆగినంతగా బాధపడేవారు ఆ రోజుల్లో..

కానీ ప్రస్తుతం బట్టలు మార్చుకున్నంత సేపు పట్టడం లేదు భాగస్వామిని మార్చుకోవడం. ఆలు మగల మధ్య అన్యోన్యత లోపించి పెళ్లయిన కొద్దిరోజులకే విడిపోతున్నారు. అలా కాకుండా భార్య/భర్తల బంధం శాశ్వతంగా ఉండాలంటే 

Latest Videos

undefined

1. ప్రేమను వ్యక్తపరచడం

ప్రారంభంలో ఇద్దరు అనేక విషయాలపై మాట్లాడుకుంటూ ఉంటారు. ఏకాంత సమయాల్లో మనసు తెరను దాటుకుని భాగస్వాములు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కుటుంబ బాధ్యతల మధ్య అంత తీరిక దొరకపోవచ్చు.

కానీ ఒక ప్రేమతో నిండిన ఒక చిరునవ్వు లేదా ఆఫీసుకు వెళ్లాకా చిన్న టెక్స్ట్  మేసేజ్ ఇద్దరి మధ్య ధృడమైన బంధాన్ని నెలకొల్పడానికి. భోజనం చేశారా అని అడిగితే భాగస్వామి మన పట్ల ఎంత కేరింగ్‌గా ఉన్నారో అర్ధమవుతుంది. కనీసం రోజులో ఒక్కసారైనా భాగస్వామికి ‘‘ ఐ లవ్ యూ ’’ అని చెప్పడం మరచిపోవద్దు.

2. సరసాలు-కొంటె పనులు

పెళ్లియిన కొత్తల్లో భార్య ఒంటిరిగా దొరికితే ఆమెను ఏదో విధంగా తాకేందుకు, ముద్దాడేందుకు భర్తలు విశ్వప్రయత్నాలు చేస్తారు. వాటిపై విరక్తితోనే లేదంటే సమయం దొరక్కపోవడం వల్లనో నిత్య జీవితంలో వాటికి తావుండటం లేదు.

వీలుచిక్కినప్పుడల్లా భాగస్వామిని కౌగిలించుకోవడమో, ఆఫీసు పనుల్లో బిజీగా ఉన్నప్పుడు శృంగారపరమైన సందేశాలు పంపడం, ఛలోక్తులు విసరడం చేస్తూ ఉండాలి. భాగస్వామి చేసిన పనుల్ని ప్రశంసించాలి. కనీసం వంట బాగుందని మెచ్చుకుని స్వీట్‌గా ఒక కిస్ ఇచ్చినా చాలు. 

3. సర్‌ప్రైజ్ చేయడం 

ప్రేమలో ఉన్నప్పుడు.. లేదంటే వివాహమైన మొదటి రెండు నెలలు భాగస్వామిని కానుకలు, సర్‌ప్రైజ్‌లతో ముంచేస్తారు. ఆ తర్వాత కూడా వారు అదే వాతావరణాన్ని ఆశీస్తారు. ప్రతిక్షణం భార్యను సర్‌ప్రైజ్ చేయమనడం లేదు. వారంతాల్లో కొత్త ప్రదేశాలకు పిక్‌నిక్‌కు వెళ్లండి. అలాగే వీలు కుదిరినప్పుడల్లా ఆమెకు ఇష్టమైన వంటకాన్ని స్వయంగా వండిపెట్టండి. ఆఫీసు నుంచి ఇంటికి వస్తూ చిన్న బహుమతిని తీసుకురండి, కనీసం మూర మల్లెపూలు.

4. అందాన్ని పట్టించుకోండి

పెళ్లికి ముందు అందంపై అంతులేని శ్రద్ద పెట్టే మహిళలు ఆ తర్వాత శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అతిలోక సౌందర్యవతిని పెళ్లి చేసుకోవాలని భర్త భావిస్తాడు. ఆమెతో అలా ఉండాలి, ఇలా ఉండాలని కలలు కంటారు.

భార్యలు కూడా తమ భర్తలు నవ మన్మధునిలా ఉండాలని కోరుకుంటారు. పెళ్లయిన తర్వాత శరీరం, సౌందర్యంపై నిర్లక్ష్యం చేయడం, బరువు పెరగటం, పొట్ట వంటివి ఇరువురి మధ్య ఆకర్షణను దెబ్బతీస్తోంది. కాబట్టి సంసారంలో శరీరానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం మరచిపోవద్దు.

5. శృంగారం

ఆలుమగల మధ్య బంధాన్ని శాశ్వతం చేయడంలో శృంగారానిది ప్రముఖ పాత్ర. పెళ్లయిన కొత్తల్లో ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వీరి శరీరాలు కలిసిపోతాయి.  ఆ తర్వాత ఇంటి బాధ్యతలు, పని ఒత్తిడి కారణంగా శృంగారానికి దూరంగా ఉంటున్నారు. అయితే కనీసం వారానికి రెండు సార్లైనా కలయిక జరిగేలా చూసుకోండి. 

click me!