ఈ 5 మసాలా దినుసులను తింటే బరువు తగ్గుతారా?

By Shivaleela RajamoniFirst Published Jul 14, 2024, 11:57 AM IST
Highlights

 మసాలా దినుసులు ఫుడ్ రుచిని పెంచడంతో పాటుగా  మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఐదు రకాల మసాలా దినుసులు బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవేంటంటే?

విసెరల్ కొవ్వు పేరుకుపోవడం వల్లే నడుము సైజు పెరుగుతుంది. నిజానికి నడుము సైజు పెరగడం మంచిది కానే కాదు. ఇది ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. ఈ బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి సరైన ఆహారం తీసుకోవాలి. అలాగే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. అయితే  కొన్ని మసాలా దినుసులు కూడా పొట్టకు పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి కూడా సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.  అవేంటంటే?

పసుపు: పసుపులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని ఉపయోగించి మనం ఎన్నో వ్యాధుల నుంచి బయటపడొచ్చు. పసుపులో యాంటీఆక్సిడెంట్ అయిన కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కాలేయం నుంచి విష పదార్థాలను తొలగించడానికి బాగా సహాయపడుతుంది. అలాగే ఇది కొవ్వును తగ్గించడానికి కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. పసుపులో  యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్,  బలమైన యాంటీవైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. మన శరీరంలో మంటను తగ్గించడానికి కర్కుమిన్ బాగా ఉపయోగపడుతుంది. ఇది ఊబకాయాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. రోజూ పరగడుపున పసుపు నీళ్లు తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

Latest Videos

నల్లమిరియాలు:  నల్ల మిరియాలను ఒక్క ఫుడ్ లో తప్పా దేనికీ ఉపయోగించరు. కానీ నల్ల మిరియాలను మీరు ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఉఫయోగించొచ్చు. నిపుణుల ప్రకారం.. నల్ల మిరియాలు కూడా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. దీనిలో ఉండే పైపెరిన్ కొత్త కొవ్వు కణాల పెరుగుదలను నివారిస్తుంది. నల్ల మిరియాలు కొవ్వు చేరకుండా నిరోదించడం వల్ల మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. 

వెల్లుల్లి: వెల్లుల్లిని తింటే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వెల్లుల్లి మీ బరువును తగ్గించడంలో కూడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. వీటిని తింటే ఆకలి చాలా వరకు తగ్గుతుంది. వెల్లుల్లిలో విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్, కాల్షియం  ఉంటాయి. రోజూ రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను నమలడం వల్ల బరువు తగ్గొచ్చు.

దాల్చిన చెక్క: దాల్చిన చెక్కలో యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, థర్మోజెనిసిస్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. దాల్చిన చెక్కలను తింటే కూడా మీ బెల్లీ ఫ్యాట్ సులువుగా తగ్గుతుంది. బరువు, బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ప్రతిరోజూ ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తాగడం అలవాటు చేసుకోండి. దాల్చినచెక్కలో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె, రక్త నాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి  సహాయపడతాయి. దాల్చిన చెక్క రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. అలాగే గుండెపోటు, అధిక రక్తపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

అల్లం: బరువు తగ్గాలనుకునేవారికి అల్లం కూడా బాగా ఉపయోగపడుతుంది. అల్లం నీటిని రోజూ తాగడం వల్ల మీ జీవక్రియ పెరుగుతుంది. కేలరీలను బర్న్ చేయడానికి, బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి అల్లం వాటర్ ను రోజూ తాగండి. 

click me!