మీ పిల్లలపై ఐటెం సాంగ్స్ ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసా? 

By Arun Kumar P  |  First Published Oct 2, 2024, 1:53 PM IST

ఏది తప్పు ఏది ఒప్పో తెలియని వయసులో చిన్నారులను అనేక అంశాలు ప్రభావితం చేస్తారు. వారి భవిష్యత్ పై ఎదుగుదల దశలో ఎదురయిన అంశాలు చాలా ప్రభావితం చేస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.


సినిమాల ప్రభావం నేటి సమాజంపై చాలా వుంటోంది... మరీముఖ్యంగా యువతీ యువకులు, చిన్నారులపై అధికంగా వుంటోంది.  సెల్ ఫోన్ల రాకతో ఈ సినిమాల ప్రభావం మరింత పెరిగింది. ఎంతలా అంటే తెలిసీ తెలియని వయసులో యువత చెడు మార్గాలు పట్టడంలో సినిమాల పాత్ర చాలా ఎక్కువగా వుంటోంది. చివరకు చిన్నపిల్లలు సైతం ఈ సినిమాల్లో చూపించే అసభ్యకర సన్నివేశాలు, ఐటం సాంగ్స్, సెక్సువల్ సీన్స్ కు చాలా ప్రభావితం అవుతున్నారని ... వాటి గురించి అవగాహన లేకపోయినా అనుకరిస్తున్నారని మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి   పిల్లల పెంపకంలో పేరెంట్స్ జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు. 

పిల్లలపై ఐటం సాంగ్స్ ప్రభావం ఎలా వుంటుందో తెలుసా? 

నేటి తరం చిన్నారులు వయసుకు మించిన పనులు చేస్తుంటే పెద్దవాళ్లు ఆనందిస్తున్నారు. మరీముఖ్యంగా సినిమా పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం చూసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. అంతేకాదు తమ పిల్లలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని భావిస్తుంటారు... కానీ ఇది నిజం కాదని మానసిక నిపుణులు చెబుతున్నారు.  

Latest Videos

సినిమాల్లో ఐటెం సాంగ్స్, అసభ్యకరమైన ఆల్బమ్ సాంగ్స్ పిల్లలపై దుర్ప్రభావం చూపుతాయని చైల్డ్ సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇళ్లలో, పార్టీల్లో వినిపించే సంగీతం పిల్లలను ఎంతగానో ఆకట్టుకుంటుంది... కాబట్టి వాటిని వారు అనుకరిస్తారు. ఆ పాటలు అర్థం కాకపోయినా అందులోని అసభ్యకరమైన పదాలను వారు గుర్తుంచుకోవడం లేదంటే అలాగే అసభ్యకరంగా డ్యాన్స్ చేసే ప్రమాదం వుందని హెచ్చరిస్తున్నారు. 

'గతంలో తాను ఓ డ్యాన్స్ రియాలిటీ షో ఆడిషన్స్ కు వెళ్లాను. ఈ సమయంలో ఒక ఏడేళ్ల చిన్నారి చాలా విచిత్రంగా ప్రవర్తించడం గమనించాను. ఆ చిన్నారి రెండు పేపర్ బాల్స్ ను రెడీ చేసుకుని తన డ్రెస్ లో పెట్టుకోవడం గమరించాను. ఇంత చిన్న వయసులో ఆ బాలిక అలా చేయడంచూసి  షాక్ కు గురయ్యాను'' అని ముంబైకి చెందిన చైల్డ్ సైకాలజిస్ట్, పేరెంటింగ్ కౌన్సిలర్ ఒకరు వెల్లడించారు.

చిన్నారుల తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త : 

కొన్ని రకాల సినిమా పాటలు, మ్యూజిక్ వినసొంపుగా వుంటుంది... కానీ ఆ లిరిక్స్ చాలా దారుణంగా వుంటాయి. అంతేకాదు మితిమీరిన వైలెన్స్, డ్రగ్స్, సెక్స్, అసభ్యకర సన్నివేషాలు పిల్లలకు అర్థం కాకపోవచ్చు. కానీ వాటి గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఆ పాటలోని పదాల అర్థం లేదంటే ఆ సీన్స్ లో ఎందుకలా చేసారో చెప్పమని తల్లిదండ్రులను అడుగుతుంటారు. 

అయితే ఇలా పిల్లలు అడిగిన విషయాలు ఇబ్బందికరంగా వుండటంతో తల్లిదండ్రులు సరైన సమాధానం చెప్పకుండా దాటవేస్తుంటారు. దీంతో వాటిగురించి తెలుసుకోవాలన్న ఆసక్తి మరింత పెరుగుతుంది. వారు స్నేహితులను లేదంటే తెలిసినవారిని వీటిగురించి అడిగే ప్రమాదం వుంటుంది. ఇది అనార్ధాలకు దారితీయవచ్చిన చైల్ట్ సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. 

తమ పిల్లలు నేటి పోటీ ప్రపంచానికి అనుగుణంగా వుండాలని తల్లిదండ్రులు కోరుకోవడం సహజమే. కానీ ఇందుకోసం పిల్లలు సినిమాల్లో ఐటం సాంగ్స్ ను అనుకరిస్తూ డ్యాన్సులు చేసినా ఎలాంటి అభ్యంతరం తెలపరు.  కానీ ఇది పిల్లల మానసిక స్థితిని మార్చేస్తుందని ... ఇలా చేయడం తప్పు కాదనే భావన వారిలో ఏర్పడుతుంది. ఇదే అలవాటైపోయి భవిష్యత్ లో కూడా ఇలాగే వ్యవహరిస్తుంటారు ... కానీ అప్పుడు తల్లిదండ్రులకు వీరు చేసేది తప్పుగా కనిపిస్తుంది. కాబట్టి చిన్నప్పుడు పిల్లలను అలా చేయకుండా ఆపితే భవిష్యత్ లో బాధపడే పరిస్థితి రాదని చైల్డ్ సైకాలజిస్టులు సూచిస్తున్నారు. 

పిల్లల పెంపకాన్ని పేరెంట్స్ ఈజీగా తీసుకోవద్దు 

పిల్లలు ఎదిగే దశను అంత ఈజీగా తీసుకోవద్దని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు నిపుణులు. ఈ సమయంలోనే పిల్లలో సృజనాత్మకత, శక్తిసామర్థ్యాలు బయటపడతాయి. ఈ సమయంలో వారికి సరైన మార్గనిర్దేశం అవసరం అవుతుంది. వారు ఏ మార్గంలో నడిస్తే మంచిదో తల్లిదండ్రులే సూచించాలి. 

ప్రస్తుతం ఈ ఆన్ లైన్ జమానాలో పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ చాలా అవసరం. వారు ఫోన్లు, టివిలో ఎలాంటి కంటెంట్ చూస్తున్నారో గమనిస్తూ వుండాలి.  ఒకవేళ పిల్లలు ఏదయినా చెడు కంటెంట్ పై ఆసక్తి చూపిస్తుంటే వారిని గైడ్ చేయాలి. ఏది మంచి, ఏది చెడు అనేది అర్థం అయ్యేలా వివరించాలి. తద్వారా వారు మరోసారి పిల్లలు చెడుకు ఆకర్షితులు కాకుండా వుంటారు. 

ఇక పిల్లలు మొబైల్ కు అలవాటు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే. తమను విసిగించకుండా వుంటారని చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు సెల్ ఫోన్ ఇస్తుంటారు. కానీ ఇది భవిష్యత్ లో చాలా చెడు ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి పిల్లలతో గడిపేందుకు తల్లిదండ్రులు సమయం కేటాయించాలి...వారితో ఆడుకోవడం, చదివించడం వంటివి చేస్తుంటే సెల్ ఫోన్ మాయ నుండి బయటపడేయవచ్చిని చైల్డ్ సైకాలజిస్టులు సూచిస్తున్నారు. 


 

click me!