దీపావళికి ఏ స్వీట్లను తయారు చేయాలో తెలియడం లేదా? ఇదిగో వీటిని చేయడం చాలా తేలిక..

By Mahesh Rajamoni  |  First Published Oct 22, 2022, 12:01 PM IST

ఈ దీపావళికి ఏ స్వీట్లను తయారుచేయాలో తెలియక తికమక పడుతున్నారా? ఈ స్వీట్లను చాలా తక్కువ సమయంలో.. చాలా సులువుగా చేసేయొచ్చు తెలుసా..
 


స్వీట్లు లేకుండా ఏ పండుగా పూర్తి కాదు. అందులోనూ దీపావళికి అయితే రకరకాల స్వీట్లను తయారుచేస్తుంటారు. అయితే  కొంతమందికి స్వీట్లను తయారుచేసే టైం అసలే ఉండదు. అందుకే మార్కెట్ లో ఉండే స్వీట్లను కొని తెస్తారు. కానీ మార్కెట్ లో కొనే స్వీట్లు ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఎందుకంటే వీటిలో షుగర్ కంటెంట్.. ఆరోగ్యాన్ని పాడు చేసే పదార్థాలు కూడా ఉంటాయి. అందుకే స్వీట్లను ఇంట్లోనే తయారుచేసుకుని తినడం మంచిది. ఇంట్లోనే చాలా తక్కువ సమయంలో ఈజీగా చేసే తయారుచేసుకునే స్వీట్లు కూడా ఉన్నాయి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం పదండి. 

నెవ్రి: నెవ్రి ఒక కొంకణి స్వీట్. ఇది ఉత్తరప్రదేశ్ లేదా మహారాష్ట్రకు చెందిన గుజియా మాదిరిగానే ఉంటుంది. దీన్ని తురిమిన కొబ్బరి, బాదంతో నింపుతారు. అంటే అచ్చం కజ్జి కాయల మాదిరిగా.. 

Latest Videos

కాజు కట్లి:  జీడిపప్పుతో తయారుచేసిన బర్ఫీలే కాజు కట్లి. వీటిని దీపావళి ఎక్కువగా తయారుచేస్తుంటారు. వీటిని మార్కెట్ లో కొనుకొచ్చే బదులుగా ఇంట్లో తయారుచేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది. వీటిని తయారుచేయడం చాలా సులువు కూడా. 

రవ్వ ఖీర్: సూజీ, పాలు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, పంచదారతో దీన్ని తయారుచేస్తారు. దీన్ని తయారుచేయడం చాలా తేలిక. ఇంట్లో చేసిన రవ్వ ఖీర్ చాలా టేస్టీగా ఉంటుంది. 

బాదం హల్వా : పాలు, బాదం పప్పులు,నెయ్యి,ఉప్మారవ్వ, కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి,చక్కెర గసగసాలతో టేస్టీ టేస్టీ బాదం హల్వాను తయారుచేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా తొందరగా అవుతుంది. 

షాహీ తుక్డా:  దీన్ని పురాతన కాలం నుంచి తయారుచేస్తూ వస్తున్నారు.  అందరికీ ఇష్టమైన స్వీట్ కూడా. దీన్ని తయారుచేయడం చాలా సులువు. బ్రెడ్ ముక్కలను వేయించి. పాలలో నానబెట్టి గింజలతో అలంకరిస్తే సరి.. షాహీ తుక్డా రెడి అయినట్టే.. 

మొహంతల్: దీన్ని శెనగ  పిండితో తయారుచేస్తారు. ఈ మొహంతల్ ఎక్కువగా రాజస్థాన్, గుజరాత్ లో ఎక్కువ ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ఈ దీపావళి సమయంలో దీన్ని టేస్ట్ చేయకుండా అస్సలు ఉండలేరు తెలుసా.. 

మైసూర్ పాక్:  ఇండియాలో ఫేమస్ అయిన స్వీట్లలో మైసూర్ పాక్ ఒకటి. అయితే దీన్ని మొదటగా మైసూర్ ప్యాలెస్ లోనే తయారుచేసినట్టు తెలుస్తుంది. దేశీ నెయ్యి, శెనగ పిండి, పంచదారతో దీన్ని తయారుచేస్తారు. 

కొబ్బరి లడ్డూలు: కొబ్బరి, ఖర్జూరాలు, నువ్వులతో ఈ లడ్డూలను తయారుచేస్తారు. ఇవి హెల్తీవి కూడా. ఇవి మరీ అంత తియ్యగా ఉండరు. ఎంతో టేస్టీగా ఉంటాయి. వీటిని కొన్ని నిమిషాల్లో తయారుచేయొచ్చు. 

చావల్ కీ ఖీర్: కమ్మని వాసనొచ్చే బాస్మతి బియ్యం, పాలు, పంచదారతో దీన్ని తయారుచేస్తారు. ఈ బియ్యపు పుడ్డింగ్ ను చాలా ఈజీగా ఫాస్ట్ గా తయారుచేయొచ్చు. దీన్ని యాలకులు, బాదం పప్పులు, పిస్తా గింజలతో అందంగా అలంకరించుకుంటే బలే ఉంటుంది. బంధువులు, స్నేహితలతో కలిసి తినడానికి దీనికంటే బెస్ట్ స్వీట్ మరేదీ ఉండదేమో. 
 

click me!