వీర్యం ఇలా ఉంటే... పిల్లలు పుట్టడం కష్టమే.

By telugu team  |  First Published May 8, 2019, 4:15 PM IST

సాధారణంగా వీర్యం... తెలుపు రంగంలో మందంగా ఓ ద్రవంలాగా ఉంటుంది. అయితే.. కొందరిలో జీన్స్ ని బట్టి... వీర్యం రంగులో కొద్దిపాటి మార్పులు ఉండి ఉండొచ్చు. దానికి పిల్లలకు ఎలాంటి సంబంధం ఉండదు. 


సాధారణంగా వీర్యం... తెలుపు రంగంలో మందంగా ఓ ద్రవంలాగా ఉంటుంది. అయితే.. కొందరిలో జీన్స్ ని బట్టి... వీర్యం రంగులో కొద్దిపాటి మార్పులు ఉండి ఉండొచ్చు. దానికి పిల్లలకు ఎలాంటి సంబంధం ఉండదు. కానీ.. వీర్యం చిక్కగా కాకుండా పలచగా ఉంటే మాత్రం పిల్లలు పుట్టడంలో సమస్య ఉన్నట్లేనని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

వీర్యం పలచగా ఉండటాన్ని వాటరీ సెమెన్ అంటారు. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు వీర్యం ఇలా పలచగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలా అని అసలు పిల్లు పుట్టరు అని చెప్పలేం కానీ.. కాస్త ప్రభావం తగ్గే అవాకశం ఉందని వారి అభిప్రాయం. 

Latest Videos

ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం మిల్లీలీటర్ వీర్యంలో 15 మిలియన్ల కంటే ఎక్కువ శుక్ర కణాలు ఉంటాయి. వాటిలో స్ట్రాంగ్ గా ఒక్క శుక్ర కణం ఉన్నా.. పిల్లలు పుట్టేస్తారు. కాకపోతే... వీర్యం పలచగా ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటానికి కచ్చితమైన కారణాలేవీ లేవు. జన్యు సమస్యలు, క్లినెఫెల్టర్ సిండ్రోమ్ లాంటివి ఇందుకు కారణం అవుతాయి. 
హార్మోన్ల సమస్యలు, ఇన్ఫెక్షన్లు, రేడియేషన్‌కు లోనవడం, ప్రమాదకర రసాయనాల ప్రభావం, డ్రగ్స్ వాడటం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, పొగాకు వాడటం, అధిక బరువు, కొన్ని రకాల మందులు వాడటం, వృషణాల నరాల వాపు లాంటివి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటానికి కారణం అవుతాయి. 

తరచుగా వీర్య స్ఖలనం జరిగినా వీర్యం వాటరీ సెమెన్ సమస్య రావొచ్చు. రోజులో ఎక్కువసార్లు సెక్స్‌లో పాల్గొన్నా, హస్త ప్రయోగం అతిగా చేసుకున్నా.. సరిపడా పరిమాణంలో లేదా నాణ్యమైన వీర్యాన్ని ఉత్పత్తి చేయడం శరీరానికి సాధ్యం కాదు. దీంతో ఈ సమస్య తలెత్తుతుంది. శరీరంలో జింక్ విటమిన్ తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

click me!