ఇక చాలా మంది ఈ స్వయంతృప్తి మహిళలకు మంచిదా కాదా అనే అనుమానాలు కూడా ఉంటాయి. దానిపై కూడా నిపుణులు క్లారిటీ ఇచ్చారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..స్వయంతృప్తి వల్ల ఎటువంటి దుష్ప్రభావాలూ లేకపోగా, ఎలాంటి సుఖవ్యాధులూ దరి చేరకుండా ఉంటాయి.
జీవిత భాగస్వామితో తృప్తికరమైన లైంగిక జీవితాన్ని తృప్తిగా పొందలేని చాలా మంది స్వయం తృప్తిని అలవాటు చేసుకుంటూ ఉంటారు. అంతెందుకు పెళ్లికాని చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు స్వయం తృప్తి ద్వారా ఆనందిస్తుంటారు. అయితే.. ఈ స్వయంతృప్తి అనేది చాలా మంది మాన్యువల్ ( హస్త ప్రయోగం)గానూ, మరికొందరు సెక్స్ టాయ్స్ సహాయంతోనై తృప్తి పొందుతుంటారు.
దీనిపై ఇటీవల ఓ సంస్థ చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. హస్తప్రయోగం కన్నా కూడా.. సెక్స్ టాయ్స్ వినియోగించడం ద్వారా స్త్రీలు ఎక్కువ తృప్తి పొందుతున్నారట. హస్త ప్రయోగంతో పోలిస్తే..17శాతం ఎక్కువ తృప్తి లభిస్తుందని సర్వేలో తేల్చారు. 18నుంచి 50 ఏళ్ల వయసులోపల మహిళలపై చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడైనట్లు వారు తెలిపారు.
ఇక చాలా మంది ఈ స్వయంతృప్తి మహిళలకు మంచిదా కాదా అనే అనుమానాలు కూడా ఉంటాయి. దానిపై కూడా నిపుణులు క్లారిటీ ఇచ్చారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..స్వయంతృప్తి వల్ల ఎటువంటి దుష్ప్రభావాలూ లేకపోగా, ఎలాంటి సుఖవ్యాధులూ దరి చేరకుండా ఉంటాయి.
పైగా స్వయంతృప్తి వల్ల గర్భం దాల్చే వీలూ ఉండదు. స్వయంతృప్తి వల్ల శరీరంలో ఫీల్‌గుడ్ ఎండార్ఫిన్లు విడుదలై ఒత్తిడి తొలగి, కండరాలు సాంత్వన పొందుతాయి. నెలసరి నొప్పులు కూడా తగ్గుముఖం పడతాయి. కాబట్టి మహిళలు స్వయంతృప్తి పొందడం అన్ని విధాలుగా సురక్షితం. ఇటీవలే జరిపిన ఒక అధ్యయనంలో స్వయంతృప్తి వల్ల ‘రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్’ తగ్గుతుందనీ, గుండెకు తగిన వ్యాయామం కూడా అందుతుందనీ వెల్లడైంది.
అంతేకాదు... సెక్స్ టాయ్స్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. లైంగిక భాగస్వాములు లేనివారు మాత్రమే, సెక్స్ టాయ్స్‌ని ఆశ్రయిస్తా రనుకుంటే పొరపాటే. ‘సెక్స్ ఇన్ అమెరికా’ అధ్యయనం ప్రకారం... పరిపూర్ణ ఆరోగ్యవంతులైన దంపతులు కూడా శృంగారానుభూతిని రెట్టింపు చేసుకోడానికి పడకగదిలో బొమ్మల కొలువు పెట్టుకుంటారు.
లైంగిక అవసరాల్ని బట్టి, పడకగది అభిరుచుల్ని బట్టి ... రకరకాల పరిమాణాల్లో, రకరకాల రూపాల్లో బొమ్మలు అందుబాటులోకి వచ్చాయి. స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను తలపించే నిర్మాణాలతో సహా... రాకుమారినో, గ్రీకువీరుడినో గుర్తుకుతెచ్చే నమూనాల్ని కూడా విక్రయిస్తున్నారు. కాస్త యంత్రశక్తిని జోడించిన ‘వైబ్రేటర్స్’కు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. వీటి వల్ల ఎలాంటి ప్రమాదం, నష్టం ఉండదని నిపుణులు చెబుతున్నారు.