కట్టుకున్న వాడే రోజూ అత్యారం చేస్తే...

By ramya N  |  First Published Feb 4, 2019, 3:48 PM IST

తాము నిత్యం తమ భర్తల చేత అత్యాచారానికి గురౌతున్నామని చెప్పడం గమనార్హం. ఇలా ఎందుకు జరుగుతోంది అంటే.. సెక్స్ వద్దని వారించినా.. భర్తలు వినిపించుకోకపోవడమే కారణమట.


మహిళకు ఇష్టం లేకుండా ఎవరైనా శృంగారం చేస్తే.. దానిని మనం అత్యాచారంగా పరిగణిస్తాం. అదే శృంగారం కట్టుకున్న భర్త చేస్తే సంసారం అంటారు. అయితే.. పెళ్లి అయినా.. భార్యకి ఇష్టం లేకుండా భర్త బలవంతపెడితే.. అది కూడా రేప్ కిందకే వస్తుంది. దానిని మ్యారిటల్ రేప్ అంటారు. దీనిని చాలా మంది తేలికగా తీసుకోవచ్చు. కానీ..ఈ సమస్యతో సతమతమౌతూ.. బయటకు చెప్పుకోలేని మహిళలు ఎంతో మంది ఉన్నారన్నది సత్యం.

ఇటీవల ఓ సంస్థ 900మంది మహిళలపై మ్యాటరిటల్ రేప్ విషయంపై సర్వే చేయగా.. 47శాతం మంది.. తాము నిత్యం తమ భర్తల చేత అత్యాచారానికి గురౌతున్నామని చెప్పడం గమనార్హం. ఇలా ఎందుకు జరుగుతోంది అంటే.. సెక్స్ వద్దని వారించినా.. భర్తలు వినిపించుకోకపోవడమే కారణమట.

Latest Videos

దీని గురించి నిపుణులు మాట్లాడుతూ.. స్త్రీలు.. సెక్స్ కాదు అనడానికి అనేక కారణాలు ఉంటాయని చెబుతున్నారు. బాల్యంలో ఆమె.. ఏ దగ్గరి బంధువుల కారణంగానో లైంగిక దోపిడీకి గురై ఉండొచ్చని లేదంటే.. కన్నతల్లో.. తోబుట్టువులో సంసార జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఉండొచ్చు. అవి.. వారిపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. దాని కారణంగానే.. సెక్స్ అంటే భయపడిపోతుంటారు. 

భర్తకి దగ్గరవ్వడానికి భయపడి...ఆ విషయంలో దూరంపెడుతూ ఉంటారు. అప్పుడు అర్థం చేసుకోవాల్సిన భర్త.. అహం దెబ్బతిని.. మృగంలా ప్రవర్తించి వారిపై దాడికి పాల్పడుతున్నారు. నా భార్య నా ఇష్టం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. అయితే.. అలాకాకుండా.. వారిని మంచి సెక్స్ నిపుణులకు చూపించి.. దారికి తెచ్చుకుంటే.. ఈ రకం సమస్యల నుంచి మహిళలకు విముక్తి లభిస్తుంది. వారి సంసార జీవితాలు కూడా బాగుపడతాయనేది నిపుణుల సూచన.

click me!