కండోమ్ ఎందుకు ఫెయిల్ అవుతోంది..?

By ramya neerukonda  |  First Published Jan 19, 2019, 4:28 PM IST

కండోమ్ ఫెయిల్ అవ్వడం వల్ల అవాంఛిత గర్భం, ఇతర సుఖ వ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంది. 


సురక్షితమైన శృంగారానికి కండోమ్ ఉపయోగించండి అంటూ ప్రభుత్వాలే స్వయంగా ప్రకటనలు ఇస్తున్నాయి. అయితే.. కొన్ని కొన్ని సార్లు కండోమ్ వాడినా కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. కండోమ్ ఫెయిల్ అవ్వడం వల్ల అవాంఛిత గర్భం, ఇతర సుఖ వ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంది. అసలు ఈ కండోమ్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి..? నాణ్యత లోపమా..? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..

సాధారణంగా కండోమ్‌ తయారీదారులు... లోపాల్లేని ఉత్పత్తుల్ని అందించడానికే ప్రయత్నిస్తారు. అత్యాధునిక పరికరాలతో అణువణువూ తనిఖీ చేస్తారు. అయినా కొన్నిసార్లు చిల్లుల కండోమ్స్‌ మార్కెట్‌లోకి వచ్చేస్తుంటాయి. ఆ రంధ్రాల్లోంచి వీర్యం బయటికి రావచ్చు. అది గర్భానికీ దారి తీయవచ్చు. 

Latest Videos

కండోమ్‌ చివరలో ఓ చిన్న సంచి లాంటి బుడిపె ఉంటుంది. స్ఖలనం తర్వాత వీర్యం అక్కడే పోగవుతుంది. కండోమ్‌ను తొడుక్కునే సమయంలో ఆ సంచిలాంటి చోట గాలిపోగైపోయే (ఎయిర్‌లాక్‌) ఆస్కారం లేకపోలేదు. స్ఖలన సమయంలో... తీవ్ర ఒత్తిడి ఏర్పడి ఆ బుడిపె ఠప్పున పగిలిపోయే అవకాశం ఉంది.

 గంటకు నలభై కిలోమీటర్ల నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో వీర్య స్ఖలనం జరుగుతుంది. ఆ వేగాన్ని తట్టుకోవాలంటే కండోమ్‌కు చాలా శక్తి కావాలి. తయారీదారులు ఆ మేరకు జాగ్రత్తలు తీసుకున్నా... ‘ఎయిర్‌లాక్‌’ కారణంగా... అప్పటికే గాలితో నిండిపోయిన బుడిపె మీద ఇంకాస్త ఒత్తిడి పడుతుంది. దీంతో కండోమ్ ఫెయిల్యూర్స్ జరగుతూ ఉంటాయి. 

click me!