ఇలాంటి అబ్బాయిలే మాకు కావాలంటున్న అమ్మాయిలు

By ramya neerukonda  |  First Published Sep 4, 2018, 4:42 PM IST

ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే అబ్బాయితో ఉంటే బోర్‌ అనేదే ఉండదని ప్రతి క్షణం కొత్తగా ఉంటుందని అమ్మాయిలు అభి ప్రాయపడుతున్నారట.


సాధారణంగా అబ్బాయిలు.. ఎలాంటి అమ్మాయిలు కావాలనుకుంటారు. అటు ఇటుగా అందరూ అబ్బాయిలు అందమైన, మంచి గుణవంతురాలు భార్యగా రావాలని కోరుకుంటారు. మరి అమ్మాయిల విషయం ఏంటి..? వారు ఎలాంటి అబ్బాయిలను కోరుకుంటారు. ఈ విషయంపై ఓ సంస్థ జరిపిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

అమ్మాయిలందరూ ఒకే రకంగా ఆలోచించరు అనే గందరగోళానికి తావు లేకుండా ఒక సర్వే చేసి నివేదిక తయారు చేశారు. ఈ సర్వే ప్రకారం, ఎనిమిది అంశాలలో అమ్మాయిలందరి అభిప్రాయాలు ఒకేవిధంగా ఉన్నాయి. అమ్మాయిల సైకాలజీని పరిశీలిస్తే ఈ విషయాలు నిశితంగా తెలుసుకోవచ్చు.

Latest Videos

డబ్బు, అందం ఉన్న అబ్బాయిలనే అమ్మా యిలు ఇష్టపడతారని అనుకుంటే పొరపాటే అంటు న్నారు సైకాలజిస్టులు. ఛలోక్తులు విసురుతూ హాస్యధోరణిలో ఉండే అబ్బాయిలనే అమ్మాయిలు బాగా ఇష్టపడతారని వారు చెబుతున్నారు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే అబ్బాయితో ఉంటే బోర్‌ అనేదే ఉండదని ప్రతి క్షణం కొత్తగా ఉంటుందని అమ్మాయిలు అభి ప్రాయపడుతున్నారట.

అందరూ చేస్తున్నట్లు ఒకేలా పనిచేయడం కాకుండా విభిన్నంగా, క్రియేటివ్‌గా వర్క్‌ చేయగలగాలి. సృజనాత్మకత ఉన్న అబ్బాయిలైతే ఏపనైనా కొత్తగా చేస్తారని ఎప్పుడూ కొత్తదనాన్ని అందిస్తారని అమ్మాయిల అభిప్రాయం. క్రియేటివిటీ ఉండే అబ్బాయిలు హ్యుమరస్‌గా ఉంటారని వారి అభిప్రాయం. అంతేకాక బాధ్యతగా వ్యవహ రించడం, ఆత్మవిశ్వాసం, పరిశీలనా శక్తి, సమ్మోహనం, నవ్వుతూ నవ్విస్తూ ఉండడం.. ఈ లక్షణాలు అబ్బాయిల్లో ఉంటే అమ్మాయిలు కచ్చితంగా ఇష్టపడ తారని సర్వేలో వెల్లడైంది. 

ఈ లక్షణాలున్న అబ్బాయిలకు అందరితో కలిసిపోయి, ఎలాంటి పరిస్థితులనైనా నెగ్గుకు రాగలతత్వం ఉండటమే కాదు, మంచి పరిశీలనా శక్తి ఉన్న అబ్బాయిలు మూడ్‌కు అనుగుణంగా నడుచుకుంటారని, తమను సరిగ్గా అర్థం చేసుకుంటారని కూడా అమ్మా యిలు సర్వేలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

అమ్మాయిలను ఇంప్రెస్‌ చేయాలనే ఉద్దేశంతో చాలా మంది జిమ్‌కి వెళ్లి సిక్స్‌ ప్యాక్‌, ఎయిట్‌ ప్యాక్‌ అంటూ శరీరాన్ని పెంచుతుంటారు. ఇలా శరీరం పెంచుకునే వారంటే అమ్మాయిలకు అస్సలు ఇష్టం ఉండదు. చూడడానికి కాస్త బాగుండి, మంచి ఆరోగ్యవంతంగా ఉంటే సరిపోతుందట. అబ్బాయిలలో అమ్మాయిలకు నచ్చే మరో అంశం సెన్స్‌ ఆఫ్‌ హ్యుమర్‌. ఆ లక్షణం కలిగిన వ్యక్తులంటే మగువలకు చాలా ఇష్టం.

బాధ్యత గలిగిన అబ్బాయిలు అనుక్షణం కంటికి రెప్పలా కాచుకుంటారని, వారి దగ్గర సేఫ్‌గా ఉండొచ్చనే ఫీలింగ్‌ ఉంటుందని ఎక్కువ మంది అమ్మాయిలు అనుకుంటున్నారు. ఆత్మవిశ్వాసం కలిగిన అబ్బాయిల వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తవని అమ్మాయిల అభిప్రాయం. అనుక్షణం నవ్వుతూ ఉండే అబ్బాయిలను చూస్తే ఎవరైనా ఇంప్రెస్‌ అవుతారని అమ్మాయిలు భావిస్తున్నారు.

click me!