సెక్స్ తర్వాత చేయాల్సిన, చేయకూడని పనులు ఇవే..

First Published 30, Jul 2018, 3:30 PM IST
Highlights

ఆ ప్రాంతంలో కాస్త ఇన్ ఫెక్షన్స్ వస్తుంటాయి. సెక్స్ పూర్తయ్యాక పురుషుల వీర్యం  ఒక్కోసారి మహిళలపై పడుతుంటుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. చిన్నగా మొదలై అవే పెద్ద సమస్య తెస్తాయి.

సెక్స్ తర్వాత ఏం చేయాలనే విషయాలపై చాలామంది అమ్మాయిలకు అవగాహన ఉండదు. దీంతో ఆ ప్రాంతంలో కాస్త ఇన్ ఫెక్షన్స్ వస్తుంటాయి. సెక్స్ పూర్తయ్యాక పురుషుల వీర్యం  ఒక్కోసారి మహిళలపై పడుతుంటుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. చిన్నగా మొదలై అవే పెద్ద సమస్య తెస్తాయి. అలాగే సెక్స్ చేసేటప్పుడు కొందరు ఆ పార్ట్స్ దగ్గర చేతులు తగిలిస్తూ ఉంటారు. దీంతో చేతులపైకి వైరస్ చేరుకుంటుంది. అందువల్ల తర్వాత చేతులను కడుక్కోవాలి. లేదంటే ఆ వైరస్ నోటిలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అందుకే సెక్స్ పూర్తయ్యాక వెంటనే మహిళలు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయాలపై అవగాహన చాలా అవసరం. లేదంటే కొత్త సమస్యలు వస్తాయి. ఇదేమి తప్పు కాదు. మన ఆరోగ్యం విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తల్లో ఇవీ కొన్ని. అందుకే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏమిటో మీరూ చదవండి.

వాష్ రూమ్ కు వెళ్లండి

సెక్స్ తర్వాత వెంటనే ఆడవాళ్లు వాష్ రూమ్ కు వెళ్లాలి. ఎందుకంటే స్మెర్మ్ ద్వారా గానీ లేదా ఏదైనా కారణాల వల్ల ఆడవారి ఆ అవయంలోకి బ్యాక్టీరియా ఎంటరయ్యే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల వారు దాన్ని క్లీన్ చేసుకుంటే ఎలాంటి ఇన్ ఫెక్షన్ రాదు. మీ పార్టనర్ తో సెక్స్ లో పాల్గొన్న వెంటనే మీరు ఈ పని చేయండి.

నీరు తాగడం సెక్స్ పూర్తయిన తర్వాత వెంటనే మంచి నీరు తాగడం చాలా మంచిది. దీని వల్ల మీ బాడీ హైడ్రేట్ అవుతుంది. బ్యాక్టీరియాను అరికట్టడానికి కూడా ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. శృంగారం తర్వాత డీ హైడ్రేషన్ కు గురికాంకుండా ఉండేందుకు, నీరసంగా ఉండకుండా ఉండేందుకు నీటిని తాగాలి.

వెట్ వైప్స్ ఉపయోగించకండి

 కొన్ని రకాల ప్యాడ్స్ ను ఆడవారు యూజ్ చేస్తూ ఉంటారు. వీటిలోని రసాయనాలు మీ సున్నితమైన జననేంద్రియాలపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. ముక్యంగా సెక్స్ తర్వాత మీరు ఆ ప్రాంతాన్ని వెంటనే వెనిగర్ తో శుభ్రం చేసుకోవడం చాలా మంచిది. సెక్స్ తర్వాత ఆడవాళ్లు చేయాల్సిన ముఖ్యమైన పని ఇదేనని గుర్తించుకోవాలి.

సబ్బులను ఉపయోగించకండి

సెక్స్ పూర్తయిన తర్వాత ఆడవారు వారి జననాంగాలను సబ్బుతో క్లీన్ చేసుకోకూడదు. సెక్స్ తర్వాత గానీ లేదా ఎప్పుడైనా సరే ఆ ప్రాంతాన్ని సబ్బుతో క్లీన్ చేయడం అనేది చాలా తప్పు. ఇలా చేస్తే ఎలాంటి వ్యాధులు రావని యోని క్లీన్ గా అవుతుందని చాలామంది అపోహపడుతుంటారు. కానీ దీని వల్ల చాలా సమస్యలు తలెత్తుతాయి. సబ్బులు అక్కడ ఉండే సున్నితమైన చర్మంపై ప్రభావం చూపుతాయి. చర్మం పొడిగా మారుతుంది. అందువల్ల సబ్బులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు.హాట్ వాటర్ షవర్ కింద స్నానం చేయకండి

ఇక మీరు అందులో పాల్గొన్న తర్వాత వెంటనే హాట్ వాటర్ తో స్నానం చేయకండి. ఎందుకంటే ఆ సమయంలో యోని కొంచెం ఎక్కువగా ఓపెన్ అయి ఉంటుంది. అందువల్ల సెక్స్ లో పాల్గొన్న వెంటనే ఆడవాళ్లు షవర్ కింద వేడి నీళ్లతో స్నానం చేయకూడదు. హాట్ వాటర్ యోనిలోకి వెళ్లడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇన్ ఫెక్షన్ కు గురవుతారు. సెక్స్ తర్వాత చేయకూడని పనుల్లో ఇది చాలా ముఖ్యమైనది.

Last Updated 30, Jul 2018, 3:30 PM IST