
mahashivratri 2023: ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 18 మహా శివరాత్రి వేడుకలు జరగనున్నాయి. పురాణాల ప్రకారం.. శని మహాదేవుడి అంతిమ భక్తుడిగా పేర్కొన్నారు. అందుకే మహాశివరాత్రి రోజున శివలింగానికి కొన్ని ప్రత్యేకమైన వస్తువులను సమర్పిస్తే శనిదేవుడి చెడు ప్రభావం తగ్గుతుంది. ప్రస్తుతం శని ధనస్సు, మకరం, కుంభరాశులపై సంచరిస్తున్నారు. తుల, వృశ్చిక రాశి నీడలో ఉంటారు. అందుకే ఈ రాశుల వారు శివరాత్రి రోజున కొన్ని ప్రత్యేక నియమాలను పాటించాలి.
గంగాజలం: మహాశివరాత్రి రోజున శివలింగానికి గంగాజలాన్ని సమర్పించడం వల్ల శని చెడు ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. ఇందుకోసం ఒక రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో కొద్దిగా గంగాజలం పోసి శివలింగానికి సమర్పించండి.
పాలు: శివుడి మెడలో వసుకి అనే పాము ఉంటుంది. ఆ పాముకి పాలు అంటే ఎంతో ఇష్టమట. కాబట్టి మహాశివరాత్రి రోజున శని ప్రభవాన్ని తగ్గించడానికి పాలను కూడా సమర్పించండి.
పెరుగు: శనిదేవుడి ప్రభావం వల్ల మీరు ఇబ్బందులు పడుతుంటే.. మహాశివరాత్రి రాజున శివలింగానికి పెరుగును సమర్పించండి. ఇది మీ సమస్యలను చాలా వరకు తగ్గిస్తుంది.
నెయ్యి: శని చెడు ప్రభావం పడితే.. వారి జీవితం కష్ట, నష్టాలతో నిండిపోతుంది. ఆనందం కరువవుతుంది. అయితే మహాశివరాత్రి రోజూ శివలింగానికి దేశీ నెయ్యిని సమర్పించండి.
తేనె: శని ప్రభావాన్ని నివారించడానికి మహాశివరాత్రినాడు శివలింగానికి తేనెను సమర్పిస్తే అంతా మంచే జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మహాశివరాత్రి నాడు శివలింగానికి గన్నేరు, కమలం, శంఖ పుష్పం, మల్లెపూలు, గరిక, బిల్వపత్ర, అవిసె పువ్వులు, ధాతురాపువ్వు ను సమర్పించాలి.ఈ పూలను శివలింగానికి సమర్పించడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మోక్షాన్ని పొందుతారు.