శృంగారానికి టైమింగ్ మారిందోచ్..

By ramya neerukonda  |  First Published Jan 4, 2019, 2:31 PM IST

ప్రతి పదిమందిలోనూ ఎనిమిదిమంది వారాంతంలో ఒకే సెక్స్‌ టైమింగ్స్‌ పాటిస్తున్నట్లు చెప్పారు. వాటినే బెస్ట్‌ టైమింగ్స్‌గా నిపుణులు పరిగణిస్తున్నారు. 


మనిషికి కచ్చితంగా కావాల్సింది ఏంటి అనగానే.. అందరూ చెప్పే సమాధానం. కూడు, గూడు, గుడ్డ. వీటి  తర్వాత మనిషి అంత్యంత ప్రాధాన్యమిచ్చేది  నిద్ర, సెక్స్‌కే.  అయితే..ప్రస్తుతకాలంలో ఈ రెండింటికీ పర్టిక్యులర్ గా ఒక టైమ్ అంటూ లేకుండా పోయిందంటున్నారు నిపుణులు. గతంలో ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు.. అన్నీ సమయానికి జరిగిపోయేవని.. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయిందన్నారు.

 ప్రస్తుత అలవాట్లకు అనుగుణంగా సెక్స్‌ టైమింగ్స్‌ విషయంపై బ్రిటన్‌లో రెండువేలమందిని ఎంపికచేసి అధ్యయనం చేశారు. వారి వారి అవకాశాన్నిబట్టి సెక్స్‌లో పాల్గొనే టైమింగ్స్‌ పరిశీలించారు. వీరిలో ప్రతి పదిమందిలోనూ ఎనిమిదిమంది వారాంతంలో ఒకే సెక్స్‌ టైమింగ్స్‌ పాటిస్తున్నట్లు చెప్పారు. వాటినే బెస్ట్‌ టైమింగ్స్‌గా నిపుణులు పరిగణిస్తున్నారు. 
 
ఉద్యోగులకు కూసంత సమయం దొరికేది వీకెంట్స్ లోనే. అందుకే శనివారం, ఆదివారాల్లో వీరు ఎక్కువ సెక్స్‌లో పాల్గొంటున్నారు. సెక్స్‌లో పాల్గొనేందుకు ఆదివారం ఉదయం తొమ్మిదిగంటల సమయం సెక్స్‌ సంబంధాలకు అత్యంత అనుకూలమైనదని ఎక్కువమంది ఆ సమయాన్నే ఎంచుకున్నారని తాజా సర్వేలో తేలింది.

Latest Videos

 మంగళవారం రాత్రి తొమ్మిదిగంటల సమయం కూడా సెక్స్‌కి వీలుగా ఉంటుందని ఈ సర్వేలో పాల్గొన్న కొన్ని జంటలు తెలిపాయి.  అయితే ఆదివారంకంటే శనివారం ఉదయం 10.30, 11.30, శనివారం రాత్రి 9.30, 11.15, 11.30 ఆదివారం రాత్రి 9.30 సమయాలు టాప్‌ స్లాట్స్‌గా పేర్కొంటున్నారు. ఇక చాలా మంది వేసవికాలంతో పోలిస్తే.. చలికాలంలో రొమాన్స్ కి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. 

click me!