కొత్త ఏడాదిలో హోలీ, రాఖీ, నవరాత్రి, దీపావళి వంటి పండుగలు ఏయే తేదీన వస్తున్నాయంటే?

By Shivaleela Rajamoni  |  First Published Jan 4, 2024, 9:59 AM IST

రాడిక్స్ ప్రకారం.. ఈ ఏడాది చాలా శుభప్రదంగా ఉండబోతోంది. శుక్రుడు సంతోషానికి ప్రతీక. ఆయన అనుగ్రహం వల్ల జాతకుని జీవితంలో అన్ని రకాల సుఖాలు కలుగుతాయి. అలాగే ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో మకర సంక్రాంతి పండుగను జరుపుకోనున్నాం. ఈ రోజున సూర్యభగవానుడు ఉత్తరాయణుడు అవుతాడు. 


ఇంగ్లిష్ న్యూ ఇయర్ ప్రారంభమైంది. రాడిక్స్ ప్రకారం.. ఈ సంవత్సరం ఎంతో శుభప్రదంగా ఉండనుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో మనం మకర సంక్రాంతి పండుగను జరుపుకోనున్నాం. ఈ రోజున సూర్యభగవానుడు ఉత్తరాయణుడు అవుతాడు. ఆ తర్వాత వసంత పంచమి, మహాశివరాత్రి, హోలీ, చైత్ర నవరాత్రులు, శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయి. అలాగే ఏడాది మధ్యలో శ్రావణ సోమవారం, రాఖీ పండుగ, కృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి పండుగలను జరుపుకుంటాము. ఏడాది చివర్లో నవరాత్రి నుంచి ఛత్ పూజ వరకు నిర్వహిస్తారు. వీటితో పాటు మరెన్నో పెద్ద, చిన్న పండుగలను జరుపుకోనున్నాం. మరి ఈ ఏడాది పండుగల  తేదీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

2024 జనవరిలో వచ్చే పండుగలు

Latest Videos

undefined

జనవరి 14 - లోహ్రీ పండుగ, జనవరి 15 - మకర సంక్రాంతి, జనవరి 15 - పొంగల్,  జనవరి 26 - గణతంత్ర దినోత్సవం

2024 ఫిబ్రవరిలో వచ్చే పండుగలు

06 ఫిబ్రవరి - షటిల ఏకాదశి, 09 ఫిబ్రవరి - మాఘ అమావాస్య,  ఫిబ్రవరి 9 - సంకష్టి చతుర్థి, ఫిబ్రవరి 13 - కుంభ సంక్రాంతి, ఫిబ్రవరి 14 - వసంత పంచమి,  ఫిబ్రవరి 24 - మాఘ పూర్ణిమ వ్రతం,

2024 మార్చిలో వచ్చే పండుగలు

మార్చి 08 - మహాశివరాత్రి, మార్చి 10  - ఫాల్గుణ అమావాస్య, మార్చి 24 - హోళికా దహన్, ఫాల్గుణ పూర్ణిమ వ్రతం,  మార్చి 25 - హోలీ,

2024 ఏప్రిల్ లో వచ్చే  పండుగలు

ఏప్రిల్ 08 - చైత్ర అమావాస్య, ఏప్రిల్ 9 - చైత్ర నవరాత్రులు, ఏప్రిల్ 14 - బైసాఖీ, ఏప్రిల్ 17 - శ్రీరామనవమి, ఏప్రిల్ 23 - చైత్ర పౌర్ణమి

2024 మే నెలలో వచ్చే పండుగలు

మే 04 - వరూథిని ఏకాదశి, మే 08 - వైశాఖ అమావాస్య,  మే 19 - మోహినీ ఏకాదశి,  మే 23 - వైశాఖ పౌర్ణమి

2024 జూన్ లో వచ్చే పండుగలు

జూన్ 02 - వైష్ణవ అపర ఏకాదశి,  జూన్ 04 - ప్రదోష వ్రతం, జూన్ 4 - మాస శివరాత్రి,  జూన్ 5 - ప్రపంచ పర్యావరణ దినోత్సవం, జూన్ 06 - వట సావిత్రి వ్రతం, రోహిణి వ్రతం, జూన్ 7 - ఆషాడ, కృష్ణ అమావాస్య,  జూన్ 09 - మహారాణా ప్రతాప్ జయంతి,  జూన్ 11 - స్కంద షష్టి, జూన్ 14 - ధూమావతి జయంతి, మాసిక దుర్గాష్టమి, జూన్ 15 - మహేష్ నవమి, మిథున్ సంక్రాంతి,  జూన్ 16 - గంగా దసరా, ఆదివారం ఫాదర్స్ డే, జూన్ 17 - గాయత్రి జయంతి, జూన్ 18 - నిర్జల ఏకాదశి,  జూన్ 19 - ప్రదోష వ్రతం,  జూన్ 21 - వట పూర్ణిమ వ్రతం, అంతర్జాతీయ యోగా దినోత్సవం,  జూన్ 22 - కబీర్ దాస్ జయంతి, జ్యేష్ఠ పూర్ణిమ,  జూన్ 25 - కృష్ణలింగల్ సంకష్టి చతుర్థి, జూన్ 28 -  కాలాష్టమి

2024 జులైలో  వచ్చే పండుగలు

జూలై 02 - యోగిని ఏకాదశి, జూలై 03 - రోహిణి వ్రతం, ప్రదోష వ్రతం, జూలై 04 - శివరాత్రి, జూలై 5 -ఆషాడ అమావాస్య,  జూలై 6 -ఆషాఢ నవరాత్రులు,  జూలై 07 - జగన్నాథ రథయాత్ర, జూలై 11 - స్కంద షష్టి,  జూలై 14 - మాస దుర్గాష్టమి, జూలై 16 - కర్కా సంక్రాంతి, జూలై 17 - దేవశాయని ఏకాదశి, జూలై 18 - వాసుదేవ ద్వాదశి, జూలై 18 - ప్రదోష వ్రతం, జూలై 19న జయ పార్వతి దీక్ష ప్రారంభం, జూలై 20 - కోకిల వ్రతం, జూలై 20 - ఆషాడ శుక్ల పౌర్ణమి, జూలై 21 - గురుపూర్ణిమ, గౌరీ వ్రతం ముగింపు, జులై 22 సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం, జూలై 22 - మొదటి శ్రావణ సోమవారం ఉపవాసం, జూలై 24 - గజానన్ సంకష్టి చతుర్థి, జూలై 27 - కాలాష్టమి,  జూలై 27 - మాస కృష్ణ జన్మాష్టమి, జూలై 29 - శ్రావణ సోమవారం వ్రతం, మాసిక్ కార్తీకమాసం, జూలై 30 - మంగళ గౌరీ వ్రతం, జూలై 31 - రోహిణి వ్రతం, కామికా ఏకాదశి.

2024 ఆగస్టులో వచ్చే పండుగలు

ఆగస్టు 1 - ప్రదోష వ్రతం, ఆగస్టు 02 - శ్రావణ మాస శివరాత్రి, ఆగష్టు 04 - హరియాలి అమావాస్య, దర్శ అమావాస్య, ఆగస్టు 05 - మూడో శ్రావణ సోమవారం వ్రతం, ఆగస్టు 7 - హరియాలి తీజ్, ఆగష్టు 8 - వినాయక చవితి,  ఆగష్టు 09 -  నాగ పంచమి, ఆగష్టు 10 - కల్కి జయంతి,  ఆగష్టు 10 - స్కంద షష్టి, ఆగష్టు 11 - భాను సప్తమి, తులసీదాస్ జయంతి, ఆగష్టు 12, నాల్గో శ్రావణ సోమవారం వ్రతం, ఆగష్టు 13 - మాస దుర్గాష్టమి,
ఆగష్టు 15 - స్వాతంత్ర్య దినోత్సవం, ఆగష్టు 16 - వరలక్ష్మీ వ్రతం, ఆగష్టు 16 - శ్రావణ పుత్ర ఏకాదశి, ఆగష్టు 17 - శని త్రయోదశి,  ఆగష్టు 17 - ప్రదోష వ్రతం,  ఆగష్టు 19 - రక్షా బంధన్, గాయత్రి జయంతి, పూర్ణిమ, హయగ్రీవ జయంతి, సంస్కృత దినోత్సవం, ఆగష్టు 20 - భాద్రపదం ప్రారంభం, ఆగష్టు 22 - కజరి తీజ్, హెరాంబ్ సంకష్టి చతుర్థి, ఆగష్టు 24 - బలరామ జయంతి, ఆగష్టు 25 - భాను సప్తమి, ఆగష్టు 26 - కృష్ణ జన్మాష్టమి, కాలాష్టమి, ఆగష్టు 27 - దహీ హండీ, రోహిణి వ్రతం, ఆగష్టు 29 - అజ ఏకాదశి, ఆగష్టు 31 - శని త్రయోదశి, ప్రదోష వ్రతం

2024 సెప్టెంబర్ లో వచ్చే పండుగలు

సెప్టెంబర్ 1 - మాస శివరాత్రి,  సెప్టెంబర్ 02 - భాద్రపద అమావాస్య,  సెప్టెంబర్ 5 -ఉపాధ్యాయ దినోత్సవం, సెప్టెంబర్ 06 - వరాహ జయంతి, హర్తాలికా తీజ్,  సెప్టెంబర్ 07 - వినాయక చవితి,  సెప్టెంబర్ 08 - ఋషి పంచమి, సెప్టెంబర్ 9 - స్కంద షష్టి,  సెప్టెంబర్ 10 - లలిత సప్తమి,  సెప్టెంబర్ 11 - రాధా అష్టమి,  సెప్టెంబర్ 11-  మహాలక్ష్మి వ్రతం ప్రారంభం, సెప్టెంబర్ 11 - దుర్వాష్టమి, జ్యేష్ఠ గౌరీ పూజ, మాసిక దుర్గాష్టమి,  సెప్టెంబర్ 14 - హిందీ దినోత్సవం, పరివర్తిని ఏకాదశి, సెప్టెంబర్ 15 - వామన జయంతి, విశ్వేశ్వరయ్య జయంతి, భువనేశ్వరి జయంతి, కల్కి ద్వాదశి, ప్రదోష వ్రతం,  సెప్టెంబర్ 16, విశ్వకర్మ పూజ, కన్యా సంక్రాంతి,  సెప్టెంబర్ 17 -  గణేష్ నిమజ్జనం, అనంత చతుర్దశి,  సెప్టెంబర్ 17 - పౌర్ణమి,  సెప్టెంబర్ 18 - పితృపక్షం ప్రారంభం, అశ్విని, కృష్ణ ప్రతిపాద చంద్రగ్రహణం,  సెప్టెంబర్ 21 - విఘ్నరాజ సంకష్టి చతుర్థి, సెప్టెంబర్ 23 - రోహిణి వ్రతం,  సెప్టెంబర్ 24 - కాలాష్టమి, మాస కృష్ణ జన్మాష్టమి,  సెప్టెంబర్ 28 - ఇందిరా ఏకాదశి,  సెప్టెంబర్ 29 - ప్రదోష వ్రతం, సెప్టెంబర్ 30 - మాస శివరాత్రి. 

click me!