వేడి వేడి కాఫీని ఉదయ ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అసలు కాఫీని రోజూ తాగొచ్చా? అసలు ఈ అలవాటు మంచిదా? కాదా? ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పొద్దు పొద్దునే చాలా మందికి టీ లేదా కాఫీని తాగే అలవాటు ఉంటుంది. కాఫీని తాగే అలవాటు ఉన్నవారు టీ అస్సలు తాగరు. ఎందుకంటే కాఫీ టేస్ట్ అలా ఉంటుంది మరి. ఉదయాన్నే పరిగడుపున కాఫీ తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుందని, అలసట, నిద్రమబ్బు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. టేస్ట్ లో పడి కాఫీ చేసే ప్రయోజనాలు, నష్టాలు చాలా మందికి తెలియవు. అసలు రోజూ కాఫీని తాగితే మన శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు, నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కాఫీ మంచిదా? చెడ్డదా?
కాఫీలో కెఫిన్ కంటెంట్ ఉంటుంది. ఇది తాగడం వల్ల మన శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అలాగని దీనివల్ల ఎలాంటి నష్టాలు కలవని చెప్పలేం. కాఫీని మోతాదుకు మంచి తాగితే మీరు లేనిపోని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
బరువు తగ్గుతారు: పాలు, పంచదార కలిపిన కాఫీ కంటే.. బ్లాక్ కాఫీ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అవును బ్లాక్ కాఫీని తాగితే మీరు బరువు కూడా తగ్గుతారు. బ్లాక్ కాఫీని తాగడం వల్ల ఆకలి చాలా వరకు తగ్గుతుంది. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఒత్తిడి తగ్గుతుంది: ప్రస్తుత కాలంలో చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడి ఒక మానసిక సమస్యే అయినా.. శారీరక సమస్యలకు దారితీస్తుంది. అయితే కాఫీ మీ ఒత్తిడిని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. కాఫీ తాగితే మీ మూడ్ సెట్ అవుతుంది. అలాగే ఇది అలసటను తగ్గించడానికి కూడా పనిచేస్తుంది.
కాఫీని ఎప్పుడు తాగకూడదు: మీకు కడుపునకు సంబంధించిన సమస్యలు ఉంటే మాత్రం మీరు కాఫీని తాగకూడదు. ఎందుకంటే ఇది మీ సమస్యలను మరింత ఎక్కువ చేస్తుంది. ఒకవేళ తాగాలనుకుంటే మాత్రం లిమిట్ లోనే తాగాలి.
ఖాళీ కడుపుతో తాగకూడదు: చాలా మంది కాఫీని పరిగడుపున తాగుతుంటారు. కానీ కాఫీని ఎప్పుడూ కూడా పరిగడుపున తాగకూడదు. ఇలా తాగితే గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఇది కడుపును చికాకుపెడుతుంది.
కాఫీని ఎప్పుడు తాగాలి: ఉదయం అల్పాహారం తర్వాత, మధ్యాహ్న భోజనానికి ముందు కాఫీని తాగొచ్చని చెప్తారు. కాఫీని తాగడానికి ఇది మంచి సమయం అంటారు నిపఉణులు. ఇది మీ శరీరంలో ఎనర్జీని పెంచుతుంది.