మనలో చాలా మంది బ్రెడ్ ప్యాకెట్ ను ఫ్రిజ్ లో కూడా పెడుతుంటారు. కానీ ఇలా పెట్టొచ్చా? లేదా? అన్న సంగతి మాత్రం ఎవరికీ తెలియదు. అందుకే ఆరోగ్య నిపుణుల ప్రకారం.. బ్రెడ్ ను ఫ్రిజ్ లో పెట్టొచ్చో? లేదో? ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చాలా మంది బ్రెడ్ ను మార్నింగ్ టీ, కాఫీతో పాటు తింటుంటారు. మరికొంతమంది బ్రెడ్ జామ్ ను కూడా తింటారు. అందుకే ప్రతి ఇంట్లో బ్రెడ్ ప్యాకెట్లు స్టాక్ ఉంటాయి. అయితే చాలా మంది ఈ బ్రెడ్ ప్యాకెట్లు బయట ఉంటే ఎండిపోతాయని లేదా పాడవుతాయని ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. కానీ బ్రెడ్ ను ఫ్రిజ్ లో పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బ్రెడ్ ను ఫ్రిజ్ లో నిల్వ చేస్తే ఏం జరుగుతుంది?
undefined
బ్రెడ్ ను ఫ్రిజ్ లో పెడితే.. బ్రెడ్ ముక్కలు దృఢంగా అవుతాయి. అలాగే ఎండిపోతాయి. బ్రెడ్ ను ఫ్రిజ్ లో నిల్వ చేస్తే చల్లని ఉష్ణోగ్రత ఈ ప్రక్రియను పెంచుతుంది. ఇది బ్రెడ్ బూజు పట్టదు. కానీ బ్రెడ్ ముక్కలు మాత్రం త్వరగా ఎండిపోతాయి.
రుచి పోతుంది
బ్రెడ్ కు ఆ వాసన, రుచి దానిలో ఉండే వివిధ సమ్మేళనాల వల్ల వస్తుంది. కానీ ఈ సమ్మేళనాలు ఫ్రిజ్ నశిస్తాయి. దీనివల్ల బ్రెడ్ వాసన పోతుంది. రుచి కూడా ఉండదు. అలాగే బ్రెడ్ బయటకు తీస్తే తొందరగా పాడవుతుంది.
బ్రెడ్ ను ఎక్కడ నిల్వ చేయాలి?
బ్రెడ్ ను నిల్వ చేయాలంటే గాలి వెల్లని కంటైనర్ లేదా గది ఉష్ణోగ్రత వద్ద ఉంచండి. ఇది బ్రెడ్ తేమను నిలుపుకుంటుంది. అలాగే రుచి కూడా మారదు. అలాగే బ్రెడ్ ఎక్స్పైరీ డేట్ ను ఖచ్చితంగా చెక్ చేయండి. తేదీ ముగిసిపోక ముందే వాటిని తినేయండి.
బ్రెడ్ ను గాలి చొరబడని కంటైనర్లలో ఎందుకు నిల్వ చేయాలి?
బ్రెడ్ ను గాలి చొరబడని కంటైనర్లలో నిల్వ చేయాలి. ఎందుకంటే దీనివల్ల వాటి రుచి పోదు. అలాగే ఎప్పుడూ కూడా సీల్డ్ ప్యాక్ చేసి ఉంచండి. ఫ్రిజ్ లోబ్రెడ్ ను నిల్వ చేస్తున్నట్టైతే దానిని ప్లాస్టిక్ క్లింగ్ ఫిల్మ్ లో చుట్టి, ప్యాకెట్లోకి గాలి లేదా తేమ ప్రవేశించడానికి వీలు లేకుండా చూసుకోండి. బ్రెడ్ ను ఫ్రెష్ గా ఉంచడానికి మరొక మార్గం ఏంటంటే.. బ్రెడ్ ను ప్లాస్టిక్ ర్యాప్ తో బాగా చుట్టి, ఆపై అల్యూమినియం ఫాయిల్ తో కప్పండి. ఇది బ్రెడ్ ను తాజాగా, అలాగే దాని షెల్ఫ్ జీవితాన్ని కూడా కాపాడుతుంది.
బ్రెడ్ ను ఫ్రిజ్ లో మెత్తగా ఉంచడం ఎలా?
బ్రెడ్ ఆరిపోయినా, ఎక్కువ సేపు ఫ్రిజ్ లో పెట్టినా పొడిగా మారుతుంది. ఇలాంటి పరిస్థితిలో.. దానిని మెత్తగా చేయడానికి.. వాటిపై కొన్ని నీళ్ల చుక్కలు జల్లి పాన్ మీద తేలికగా కాల్చండి. ఇది దానిలోని తేమతో బ్రెడ్ ను మృదువుగా చేస్తుంది.
ఏదేమైనా బ్రెడ్ ప్యాకెట్ ను ఫ్రిజ్లో పెట్టకూడదు. దీనివల్ల బ్రెడ్ పొడిగా అవుతుంది. కానీ దీనిని ఎక్కువ కాలం నిల్వ చేయడానికి ఇదొక మార్గం మాత్రమే. మీరు బ్రెడ్ లో ఫ్రిజ్లో ఉంచితే ఓవెన్ తో కొద్దిసేపు వేడి చేసి తినండి.