టాయిలెట్‌ ఫ్లష్‌పై రెండు బటన్స్‌ ఎందుకు ఉంటాయి.. వీటి ఉపయోగం ఏంటో తెలుసా?

By Narender Vaitla  |  First Published Jan 5, 2025, 12:27 PM IST

మన రోజువారి జీవితంలో ఉపయోగించే ఎన్నో వస్తువుల గురించి మనకు తెలిసి ఉండదు. కానీ వాటిని ఉపయోగించేస్తుంటాం. నిజానికి వాటితో ప్రత్యేకమైన ఉపయోగాలు ఉంటాయి. అలాంటి వాటిలో వెస్ట్రన్ టాయిలెట్‌ ఫ్లష్‌పై ఉండే బటన్స్‌ ఒకటి. ఇంతకీ ఈ బటన్స్ ఉపయోగం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.? 
 


వెస్ట్రన్‌ టాయిలెట్స్‌.. ఒకప్పుడు వీటి గురించి చాలా తక్కువ మందికే తెలిసేవి. కేవలం పట్టణాల్లో జీవించే వారే వీటిని ఉపయోగిస్తారని చాలా మంది భావించే వాళ్లు. ఒక 15 ఏళ్ల క్రితం వరకు పరిస్థితితుల ఇలాగే ఉండాయి. ఏదైనా పెద్ద హోటల్‌కు వెళితేనో, సినిమా హాల్‌కు వెళితేనే ఇలాంటివి కనిపించేవి. కానీ ప్రస్తుతం కాలం మారింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇలాంటి టాయిలెట్స్‌ వినియోగం భారీగా పెరిగింది. 

కొత్తగా ఇంటి నిర్మాణం చేపడుతోన్న ప్రతీ ఒక్కరూ ఇంట్లో వెస్ట్రన్‌ టాయిలెట్‌ నిర్మాణం చేపడుతున్నారు. ఒకప్పుడు ఇండియన్‌ స్టైల్‌ టాయిలెట్స్‌ ఉపయోగించిన వారు కూడా ఇప్పుడు వెస్ట్రన్‌ స్టైల్‌ను యూజ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా మోకాళ్ల నొప్పులు పెరగడం, వయసు రీత్యా ఇబ్బందులు తలెత్తుతుండడంతో చాలా మంది వీటికి మొగ్గు చూపుతున్నారు. వైద్యులు సైతం వయసు మళ్లి వారికి వెస్ట్రన్‌ టాయిలెట్స్‌ను ఉపయోగించమని సూచిస్తున్నారు. అందుకే ఇంట్లో సాధారణ టాయిలెట్‌ ఉన్నా, ఒక వెస్ట్రన్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. 

Latest Videos

ఇదిలా ఉంటే వెస్ట్రన్‌ టాయిలెట్‌ నిర్మాణ శైలి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. టాయిలెట్‌ను ఉపయోగించుకున్న తర్వాత నీటిని పోసేందుకు వెస్ట్రన్‌ టాయిల్స్‌లో సులువైన విధానం అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం వాటర్‌ ట్యాంక్‌ను ఏర్పాటు చేస్తారు. అయితే ఈ వాటర్‌ ట్యాంక్‌పై రెండు రకాల బటన్స్‌ గమనించే ఉంటారు. అయితే మనలో చాలా మందికి అసలు ఇలా రెండు బటన్స్‌ ఎందుకు ఇచ్చారన్న దాని గురించి క్లారిటీ ఉండదు. మీక్కూడా ఈ విషయం తెలియదా? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.. 

రెండు ఎందుకు ఉంటాయి.?

ఇలా రెండు బటన్స్‌ను ఏర్పాటు చేయడం వెనకాల చిన్న లాజిక్‌ ఉంది. సాధారణంగా రెండు బటన్స్‌ ఉండే టాయిలెట్‌ ఫ్లెష్‌ను డబుల్‌ ఫ్లెస్‌ ట్యాంక్‌లుగా చెబుతుంటారు. వీటిలో రెండు రకాల నీటి నిల్వలు ఉంటాయి. ఒక భాగంలో నీరు ఎక్కువగా స్టోర్ అయితే, మరో భాగంలో తక్కువ నీరు స్టోర్‌ అవుతుంది. చిన్న బటన్‌ను నొక్కితే తక్కువ నీరు వస్తుంది. అలాగే పెద్ద బటన్‌ను నొక్కితే ఎక్కువ మొత్తంలో నీరు బయటకు వస్తుంది. 

ఉద్దేశం ఏంటంటే.. 

రెండు బటన్స్‌ ఏర్పాటు చేయడం వెనకాల ఉన్న అసలు ఉద్దేశం నీటిని ఆదా చేయడమే. సాధారణంగా మూత్ర విసర్జకు తక్కువ నీరు సరిపోతుతుంది. అలాంటి సమయంలో చిన్న బటన్‌ను నొక్కితే చాలన్నమాట. అదే మల విసర్జనకు ఎక్కువ నీరు పోయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో పెద్ద బటన్‌ను ఉపయోగించాలి. అయితే మనలో చాలా మంది ఈ విషయం తెలియక రెండు బటన్స్‌ను నొక్కేస్తుంటాం. ఓ అంచనా ప్రకారం ఇలా రెండు బటన్స్‌ ఉన్న ట్యాంకుల వల్ల ఏడాదికి 20,000 లీటర్ల నీటిని ఆదా చేయొచ్చని చెబుతున్నారు. ఇదండీ టాయిలెట్‌ ఫ్లష్‌పై ఉండే రెండు బటన్స్‌ వెనకాల ఉన్న అసలు కథ. 

click me!