పదో తరగతిలోనే సెక్స్ అనుభవం.. తాజా సర్వే

By ramya neerukondaFirst Published Dec 2, 2018, 3:54 PM IST
Highlights

దశాబ్దం క్రితం ఆ కోరికలు ముద్దులు, కౌగిలింతలవరకే పరిమితమయ్యేవి. శారీరకంగా దగ్గరవ్వటానికి పెళ్లి వరకూ ఆగాల్సిందే అన్న అభిప్రాయం నాటి యువతలో ఉండేది.

నేటి యువత పదోతరగతిలోనే సెక్స్ అనుభవాన్ని పొందుతున్నారని ఓ తాజా సర్వేలో వెల్లడయ్యింది. ప్రేమలో పడ్డప్పుడు లైంగికంగా దగ్గరవ్వాలనే కోరిక కలగటం సహజం. కానీ దశాబ్దం క్రితం ఆ కోరికలు ముద్దులు, కౌగిలింతలవరకే పరిమితమయ్యేవి. శారీరకంగా దగ్గరవ్వటానికి పెళ్లి వరకూ ఆగాల్సిందే అన్న అభిప్రాయం నాటి యువతలో ఉండేది.

కానీ నేటి తరం యువతలో అంత సహనం ఉండటం లేదట. ప్రేమ పేరిట సెక్స్ అనుభవాన్ని పొందుతున్నారు. సెక్స్‌ అనుభవం పొందిన టీనేజర్లందరూ అవతలి వ్యక్తితో ప్రేమలో ఉన్నాం కాబట్టే శారీరకంగా దగ్గరయ్యాం అని చెప్పడం విశేషం. కన్యత్వానికి విలువిచ్చే ఐదు శాతం మంది మాత్రమే ఆ అనుభవానికి దూరంగా ఉంటున్నారు. కేవలం 6 మంది తాము సెక్స్‌ అనుభవాన్ని పొందకపోవడానికి కారణం తమకు తగిన జోడి దొరకక పోవడమేనని చెప్పారు.

ప్రతి పది శాతం మంది పదో తరగతి విద్యార్థుల్లో ముగ్గురు సెక్స్ అనుభవాన్ని పొందుతున్నారట. వీళ్లలో 46 శాతం  మంది స్కూలు, కాలేజీ ప్రాంగణంలో కండోమ్‌ ప్యాక్స్‌ చూసినట్టు చెప్పారు. 25 శాతం  మంది తమ తోటి విద్యార్థులు గర్భం దాల్చినట్టు చెప్పారు. 2008లో ఇలాంటి సర్వే చేపట్టినప్పుడు ఈ నిష్పత్తి 10:1 ఉంటే 2016కి 10:3 స్థాయికి పెరిగింది. 

2004లో చేపట్టిన మరో సర్వేలో తొలి సెక్స్‌ అనుభవాన్ని పొందిన వయసు 18 - 26 ఏళ్లుంటే 2016లో ఈ వయోపరిమితి 15 - 16కి పడిపోయింది. వీళ్లంతా ఇలా తయారవడానికి అందులో బాటులో సెల్ ఫోన్స్, ఇంటర్నెట్ సౌలభ్యం ఉండటమేనని నిపుణులు చెబుతున్నారు. 

click me!