అబ్బాయిలేమో రాత్రి.. అమ్మాయిలేమో పగలు

 |  First Published Jul 20, 2018, 3:19 PM IST

తాజా సర్వే భారతీయుల ‘శృంగార జీవితం’ గురించి అనేక ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. దేశ వ్యాప్తంగా సెక్స్‌ టాయ్స్‌ కొంటున్న వారిలో 62 శాతం పురుషులు కాగా.. 38 శాతం మహిళలట!


రాను రాను మనదేశంలోనూ సెక్స్ టాయ్స్ వినియోగించేవారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. ఆడ, మగ అనే తేడా లేకుండా సెక్స్ టాయ్స్ కొనుగోలు చేస్తున్నారు. ఈ కొనుగోళ్లపై సెక్స్‌ ప్రోడక్ట్స్‌ విక్రయించే ఓ ఆన్‌లైన్‌ సంస్థ తాజా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.

సెక్స్ ఉత్పత్తుల కోనుగోళ్లలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా టాప్‌ 5లో మూడు దక్షిణాది రాష్ట్రాలు ఉండడం గమనార్హం. ఇటీవలికాలంలో మనదేశంలో సెక్స్‌ టాయ్స్‌ వాడకం బాగా పెరిగిపోతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. తాజా సర్వే భారతీయుల ‘శృంగార జీవితం’ గురించి అనేక ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. దేశ వ్యాప్తంగా సెక్స్‌ టాయ్స్‌ కొంటున్న వారిలో 62 శాతం పురుషులు కాగా.. 38 శాతం మహిళలట! సర్వేలో భాగంగా గడిచిన నాలుగున్నరేళ్లుగా తమకు వస్తున్న ఆర్డర్లతో పాటు వినియోగదారులతో మాట్లాడిన తర్వాత ఆన్‌లైన్‌ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. తమకు మొత్తం 80 వేల ఆర్డర్లు వచ్చాయని తెలిపింది.

Latest Videos

మగవారిలో 62 శాతం మంది రాత్రి 10 గంటలు దాటిన తర్వాత నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు సెక్స్‌ ప్రోడక్ట్స్‌ కోసం ఆర్డర్లు ఇస్తుండగా.. ఆడవారిలో 38 శాతం మంది ఉదయం 10 నుంచి రాత్రి ఒంటి గంట మధ్యలో చేస్తారట. బరోడ, పుణె, తిరువనంతపురాల్లోని మహిళలు పురుషుల కంటే ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నట్లు తేలింది! ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో గడిచిన ఏడాది కాలంలో ఈ ఉత్పత్తుల అమ్మకాలు 25 శాతానికి పైగా పెరిగాయట.

కొనుగోళ్లలో టాప్‌ రాష్ట్రాలివే..
1. మహారాష్ట్ర 2. కర్ణాటక 3. పశ్చిమబెంగాల్‌ 4. తమిళనాడు 5. ఆంధ్రప్రదేశ్‌ 6. గుజరాత్‌ 7. ఉత్తరప్రదేశ్‌

నగరాల్లో..
1.ఢిల్లీ 2.ముంబై 3. బెంగళూరు 4. చెన్నై 5. కోల్‌కతా 6. హైదరాబాద్‌ 7. పుణె 8. అహ్మదాబాద్‌

click me!