నిద్రలో వీర్య స్కలనం.. ప్రమాదమా...?

By ramya neerukondaFirst Published Sep 14, 2018, 2:56 PM IST
Highlights

హస్తప్రయోగం, సెక్స్‌, స్వప్న స్కలనం... ఇలా ఏదో ఒక మార్గంలో బయటకు వెళ్లిపోక తప్పదు. ఇలా వీర్యం నిద్రలో స్కలనమయినంత మాత్రాన మీకు ఒరిగే నష్టమేమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు. 

పురుషులు శృంగారంలో పాల్గొన్నప్పుడు వీర్య స్కలనం జరుగుతుంది ఇది కామన్. అలా కాకుండా నిద్రలో కూడా కొందరికి స్కలనం జరగుతుంటుంది. దీనినే స్వప్న స్కలనం అంటారు. అయితే.. ఇలా జరగడం వలన ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చాలా మంది అపోహ చెందుతుంటారు. అయితే.. అది నిజంగా అపోహే అంటున్నారు నిపుణులు.

నోట్లో ఉమ్మి తయారయినట్టుగానే వృషణాల్లో వీర్యం ఎప్పటికప్పుడు తయారవుతూ ఉంటుంది. ఇది హస్తప్రయోగం, సెక్స్‌, స్వప్న స్కలనం... ఇలా ఏదో ఒక మార్గంలో బయటకు వెళ్లిపోక తప్పదు. ఇలా వీర్యం నిద్రలో స్కలనమయినంత మాత్రాన మీకు ఒరిగే నష్టమేమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు. రక్తం వీర్యంగా మారుతుంది కాబట్టి వీర్యనష్టం జరిగితే నీరసం వస్తుందనేది కూడా అపోహే! 

హస్తప్రయోగం అలవాటు ఉన్నవాళ్లకు ఆ పద్ధతి ద్వారా, పెళ్లైనవాళ్లకు లైంగిక చర్య ద్వారా వీర్యం స్కలనం అయిపోతూ ఉంటుంది. పెళ్లి కాని వారి విషయంలో ఆ మార్గాలు లేవు కాబట్టి మూత్రం ద్వారా లేదా నిద్రపోతున్నప్పుడు కలిగే స్వప్న స్కలనాల ద్వారా వీర్యం బయటకు వెళ్లిపోతుంది. ఇలా జరగడం అత్యంత సహజమని నిపుణులు పేర్కొన్నారు.

click me!