ఆ విషయంలో భార్యలపై భర్తల ఫిర్యాదులు ఇవే..

By ramya neerukonda  |  First Published Aug 15, 2018, 3:54 PM IST

సెక్స్ విషయంలో భార్యభర్తలు లేదా, ప్రేయసీప్రియుల మధ్య ప్రధానంగా ఎక్కడ తేడా కొడుతుందో ట్రేసీ వివరించారు. తన దగ్గరకు వచ్చిన జంటల్లో మగవాళ్లు తమ ఆడవాళ్లపై ప్రధానంగా ఒక కంప్లైంట్ చేశారని ట్రేసీ వివరించింది. ఏమిటా కంప్లైంట్ అంటే.. సెక్స్ విషయంలో తమ లేడీస్ చొరవ చూపరు! అనేది


ఒక మనిషిలో మరొకరు లోపాలు వెతకడం సహజం. అవి  చిన్నవా, పెద్దవా అన్న విషయాన్ని పక్కనపెడితే.. అందరిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. ఈ విషయాన్ని పక్కనపెడితే.. సెక్స్ విషయంలో భార్యలపై ప్రధానంగా భర్తలకు కొన్ని ఫిర్యాదులు ఉన్నాయట. ఈ విషయాన్ని ఓ ప్రముఖ సెకాలజిస్టు తన రిపోర్టులో తెలియజేసింది.

ఈమె ఒక ప్రముఖ యూరోపియన్ సెక్సాలజిస్టు. చాలా సంవత్సరాల అనుభవంతో.. సెక్స్ విషయంలో బోలెడన్ని థియరీలను రాసిందీమె. వాటిల్లో ఒకటి తాజాగా ప్రచురితం అయ్యింది. సెక్స్ విషయంలో భార్యభర్తలు లేదా, ప్రేయసీప్రియుల మధ్య ప్రధానంగా ఎక్కడ తేడా కొడుతుందో ట్రేసీ వివరించారు. తన దగ్గరకు వచ్చిన జంటల్లో మగవాళ్లు తమ ఆడవాళ్లపై ప్రధానంగా ఒక కంప్లైంట్ చేశారని ట్రేసీ వివరించింది. ఏమిటా కంప్లైంట్ అంటే.. సెక్స్ విషయంలో తమ లేడీస్ చొరవ చూపరు! అనేది. 

Latest Videos

ట్రేసీ ప్రధానంగా యూరోపియన్ కల్చర్ వారినే ట్రీట్ చేసింది. ఆ పాశ్చాత్య కల్చర్ లోనే.. ఇలాంటి ఫిర్యాదు ప్రధానంగా వినిపించడం గమనార్హం. దశాబ్దాల పాటు దాంపత్యాన్ని కొనసాగించిన మగవాళ్లు కూడా ఈ ఫిర్యాదు చేశారట. తమ పార్ట్ నర్ దగ్గర ఎప్పుడూ తామే చొరవ తీసుకోవాల్సి వస్తోందని, ఆమె అస్సలు ఇన్షేయేటివ్ గా ఉండదని తన దగ్గరకు వచ్చిన మగవాళ్లు వాపోయారని ట్రేసీ చెప్పింది. 

తమ భార్యలకు తాము సర్వస్వతంత్రాలనూ ఇచ్చినా.. అక్కడ మాత్రం మళ్లీ తామే చొరవ చూపాల్సి వస్తోందని, సెక్స్ అనేది కేవలం తమ ఇంట్రస్ట్ మాత్రమే అనిపిస్తోందని.. మగవాళ్లు చెప్పారట. మీరు ముందుకొచ్చారు కాబట్టి... శృంగారం చేస్తున్నాం లేకపోతే జరిగేది కాదు.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని.. ఇది తమను బాగా నిరాశ పరుస్తోందని, సెక్స్ విషయంలో ఆడవాళ్ల తీరుపై ఇదే తమ ప్రధానమైన కంప్లైట్ అని ఎక్కువ శాతం మగవాళ్లు ట్రేసీకి వివరించి చెప్పారట. ఆడవాళ్లు ఈ తీరును మార్చుకుంటే.. వారి భర్తలు అమితంగా ఆనందిస్తారని ట్రేసీ అన్నారు.

click me!