
ఆఫీసు, ఇంటి పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఆడవారు తమ చర్మంపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. దీనివల్ల స్కిన్ నిర్జీవంగా, నీరసంగా మారుతుంది. వీటితో పాటు వాతావరణ కాలుష్యం, మురికి, దుమ్ము, ధూళి నుంచి సూర్యుని హానికరమైన కిరణాల వరకు ఎన్నో కారకాలు చర్మ సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. వీటితో పాటుగా ఎక్కువ సేపు స్క్రీన్ ముందు ఉండటం, అనారోగ్యకరమైన ఆహారం, నిద్రలేమి వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. మీ చర్మాన్ని అందంగా మార్చాలనుకుంటే కొన్ని చర్మ సంరక్షణ చిట్కాలను పాటించాలి.
చర్మం సహజంగా అందంగా మెరవడానికి జాడే రోలర్ బాగా సహాయపడుతుంది. అయితే జాడే రోలర్ ను మనం ఎక్కువగా సోషల్ మీడియాలోనే చూస్తుంటాం. సెలబ్రిటీలు సైతం దీన్ని ఉపయోగించి రీల్స్ ను సోషల్ మీడియాలో పెడుతున్నారు. అసలు ఈ జాడే రోలర్ చర్మానికి ఏవిధంగా ప్రయోజనకరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
జాడే రోలర్ అంటే ఏంటి?
జాడే రోలర్ ఫేషియల్ ను మజాస్ కోసం ఉపయోగిస్తారు. ఇది జాడే అని పిలువబడే ఆర్మాంటల్ ఖనిజంతో తయారుచేస్తారు. దీన్ని చైనాలో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. అక్కడి ప్రజలు దీన్ని వైద్యం కోసం ఉపయోగించారు. ఇది చర్మాన్ని రిలాక్స్ గా ఉంచుతుంది. ఇది చర్మానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది.
చర్మపు మంటను తగ్గించండి
జాజే రోలర్ ను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మంపై నీరు నిల్వ ఉండే అవకాశం ఉండదు. అంతేకాదు ఇది ముఖంపై మంటను తగ్గిస్తుంది. ఈ జాడే రోలర్ చర్మంలో రక్త ప్రసరణను పెంచుతుంది. అలాగే చర్మాన్ని నిర్విషీకరణ చేస్తుంది. అయితే కొంతమందికి ఎప్పుడూ కళ్ల కింద వాపు వస్తుంది. ఇలాంటి వారికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే చర్మంపై దీన్ని మరీ ఎక్కువగా ఉపయోగించకూడదు.
రక్త ప్రసరణను పెంచుతుంది
జాడే రోలర్ వాడకం వల్ల చర్మంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంతేకాదు దీనివల్ల ఆక్సిజన్ చర్మానికి బాగా చేరుతుంది. చర్మం మచ్చలు తగ్గుతాయి. చర్మం ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. అలాగే చర్మ సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది కూడా.
చర్మం పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది
జాడే రోలర్ తో మాయిశ్చరైజర్లు, సీరమ్స్ వంటి మీ రెగ్యులర్ చర్మ సంరక్షణ ఉత్పత్తులను అప్లై చేస్తే అవి చర్మంలోకి సమర్థవంతంగా వెళతాయి. జాడే రోలర్ చర్మ సంరక్షణ ఉత్పత్తులను బాగా అప్లై చేస్తుంది.
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన చర్మానికి నేచురల్ గ్లో ను అందిస్తుంది. ఇది మన చర్మానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. దీనిని చర్మ సంరక్షణ ఉత్పత్తులను ముఖానికి అప్లై చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుది. ఇది ఉత్పత్తిని గ్రహించే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.
జాడే రోలర్ ను ఎలా ఉపయోగించాలి?
ముందుగా మీ చర్మాన్ని బాగా శుభ్రం చేయండి. తర్వాత మీ రెగ్యులర్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అయిన ఆయిల్, సీరమ్, మాయిశ్చరైజర్ వంటి వాటిని ముఖానికి అప్లై చేయండి. తర్వాత జాడే రోలర్ ను పైకి తిప్పి చర్మానికి సున్నితంగా మసాజ్ చేయండి. అయితే దీన్ని చర్మంపై తేలికగా లేదా చాలా గట్టిగా రుద్దకండి. దవడ, చెంపలు, నుదిటి, వెంట్రుకల మీద తిప్పకూడదు.అలాగే కనుబొమ్మలలో, కళ్ళ కింద అస్సలు తిప్పండి.