కొంతమందికి కాలాలతో సంబంధం లేకుండా అండర్ ఆర్మ్స్ లో విపరీతంగా చెమటలు పడుతుంటాయి. దీనివల్ల దుస్తులు మొత్తం చెమట వాసన వస్తాయి. కొన్ని సింపుల్ ట్రిక్స్ ను ఫాలో అయితే దుస్తుల నుంచి చెమట వాసనను ఈజీగా పోగొట్టొచ్చు. అదెలాగంటే?
టైట్ దుస్తులు వేసుకుంటే కాలాలతో సంబంధం లేకుండా చెమటలు విపరీతంగా పడతాయి. ముఖ్యంగా అండర్ ఆర్మ్స్ లో. కానీ ఈ వాసన దారుణంగా ఉంటుంది. ఈ వాసన దుస్తులకు అంత సులువుగా వదిలిపోదు. దీనివల్ల నలుగరిలో తిరగాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. అయితే రూపాయి ఖర్చు లేకుండా ఈ చెమట వాసనను పోగొట్టొచ్చు. అది కూడా చాలా సులువుగా. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నిమ్మకాయ: నిమ్మకాయలో ఉండే విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది అన్న ముచ్చట అందరికీ తెలిసిందే. నిమ్మకాయ కేవలం ఆరోగ్యానికే ఉపయోగపడుతుంది అనుకుంటే పొరపాటే. అవును నిమ్మకాయను క్లీనింగ్ కోసం కూడా ఉపయోగించొచ్చు. దుస్తులకు పట్టిన చెమట వాసనను పోగొట్టడానికి నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది. దుస్తుల నుంచి చెమట వాసన పోవాలంటే వాటిని ఉతికే నీటిలో నిమ్మరసం కలపండి. దీనివల్ల చెమట వాసన సులభంగా పోతుంది.
undefined
బేకింగ్ సోడా : బేకింగ్ సోడా మంచి క్లీనర్ గా ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడాను ఉఫయోగించి మీరు దుస్తులకు ఉన్న చెమట వాసనను ఈజీగా పోగొట్టొచ్చు. ఇందుకోసం ఉతికే నీటిలో బేకింగ్ సోడా మిక్స్ చేసి బట్టలను శుభ్రం చేయండి.
ఎండలో బాగా ఆరబెట్టాలి: చాలా మంది దుస్తుల రంగు వెలసిపోతుందని, తొందరగా పాడవుతాయని ఎండలో మొత్తమే ఆరేయరు. కానీ దుస్తులకు ఉన్న చెమట వాసన పోవాలంటే మాత్రం మీరు దుస్తులను ఎండలోనే ఆరబెట్టాలి. ఇది చాలా సులువైన, బెస్ట్ మార్గం.
వెనిగర్: వెనిగర్ తో కూడా మీరు దుస్తుల నుంచి చెమట వాసనను పోగొట్టొచ్చు. ఇందుకోసం ముందుగా ఒక బకెట్ లో వేడినీళ్లు తీసుకోండి. దీనిలో 2 టీస్పూన్ల వెనిగర్ వేసి దుస్తులను నానబెట్టండి. కాసేపటి తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయండి.
నానబెట్టకూడదు: చాలా మంది సర్ఫ్ వేసి దుస్తులను గంటలకు గంటలు నానబెడుతుంటారు. కానీ ఇలా నానబెట్టడం వల్ల దుస్తుల నుంచి దుర్వాసన వస్తుంది. దుస్తులకు చెమట వాసన రాకూడదంటే వాటిని ఎక్కువ సేపు నీటిలో నానబెట్టకూడదు.