బస్ కండెక్టర్ దగ్గర ఛేంజ్ తీసుకోవడం మర్చిపోయారా? ఇలా చేస్తే డబ్బులు వచ్చేస్తాయి

By Naga Surya Phani KumarFirst Published Sep 28, 2024, 3:18 PM IST
Highlights

బస్ జర్నీ చేసేటప్పుడు చాలా మంది చేసే పొరపాటు ఇది. బస్సు ఎక్కుతాం. టిక్కెట్ కొంటాం. కండెక్టర్ ఛేంజ్ తర్వాత ఇస్తానంటే తీసుకోవడం మర్చిపోయి కంగారుగా బస్సు దిగిపోతాం. తర్వాత గుర్తొచ్చి బాధ పడతాం. ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైతే డబ్బులు తిరిగి ఎలా పొందాలో మీకు తెలుసా? ఈ అంశానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ అధికారులు గొప్ప అవకాశం ఇచ్చారు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 
 

మనం బస్సు ఎక్కిన తర్వాత ముందుగా మనకు కొన్ని వాక్యాలు కనిపిస్తాయి. ‘స్త్రీలను గౌరవించాలి. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం.’ ఇలాంటివి మరికొన్ని కనిపిస్తాయి. వీటితో పాటు ‘టిక్కెట్ కు సరిపడా చిల్లర ఇవ్వాలని కూడా రాసి ఉంటుంది.’ అయితే మనం వెళ్లాల్సిన ఊరికి ఎంత టిక్కెట్ ధర ఉంటుందో తెలియక చాలా మంది చిల్లర తెచ్చుకోరు. అందరూ రూ.100, రూ.200, రూ.500 లాంటి పెద్ద నోట్లు ఇస్తారు. దీంతో అందరికీ చిల్లర ఇవ్వడానికి కండెక్టర్స్ కి కూడా ఇబ్బందిగా ఉంటుంది. 

టిక్కెట్ల వెనుకాల బ్యాలెన్స్ రాయడం

బస్సు ఎక్కిన ప్యాసింజర్లు అందరూ పెద్ద నోట్లు ఇవ్వడం వల్ల కండెక్టర్లు పడే బాధలు వర్ణనాతీతంగా ఉంటాయి. అందరికీ సరిపడా డబ్బులు ఇవ్వలేక చాలా మంది కండెక్టర్లు ప్రయాణికులకు టిక్కెట్ల వెనకాల ఇవ్వాల్సిన బ్యాలెన్స్ డబ్బులు రాసి ఇస్తారు. బస్సు దిగేటప్పుడు అడిగితే ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తానని చెబుతారు. అయితే చాలా మంది ప్యాసింజర్లు డబ్బులు తీసుకోవడం మర్చిపోతారు. రూ.1, రూ.2 అయితే పోన్లే కదా అని వదిలేయచ్చు. రూ.100, రూ.200, రూ.500 నోట్లు ఇచ్చినప్పుడు భారీగానే ఛేంజ్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి టైంలో కూడా ఛేంజ్ తీసుకోవడం మర్చిపోతే మామూలు బాధ ఉండదు. ఆ అమౌంట్ ఎలా తిరిగి తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటాం. 

బస్సులో నిద్రపోవడం మరో కారణం

Latest Videos

సాధారణంగా దూర ప్రయాణాలు చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. టిక్కెట్ సుమారు రూ.150, రూ.200 అలా ఉన్నప్పుడు చాలా మంది రూ.500 నోట్లు ఇస్తారు. అందరికీ వెంటనే చిల్లర ఇవ్వలేక కండెక్టర్ టిక్కెట్ వెనకాల తాను ఇవ్వాల్సిన బ్యాలెన్స్ వివరాలు రాసి ఇస్తారు. అయితే దూర ప్రయాణం వల్ల మనం నిద్రలోకి జారుకుంటాం. దిగాల్సిన స్టేజ్ దగ్గరకు వచ్చినప్పుడు హాడావుడిగా నిద్ర లేచి, బస్సు దిగిపోతాం. తర్వాత చిల్లర విషయం గుర్తొచ్చి టెన్షన్ పడతాం. 

ఆర్టీసీ అధికారులు ఏం చెప్పారంటే..

ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ అధికారులు సింపుల్ సొల్యూషన్ తీసుకొచ్చారు. APSRTC, TSRTC రెండు ఫోన్ నంబర్లను ప్రకటించారు. అవి

APSRTC: 0866 2570005/149
TSRTC: 040 69440000

ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సమస్యను చెప్పాలి. బస్సు ఎక్కడ ఎక్కారు. ఎక్కడి వరకు టిక్కెట్ తీసుకున్నారు. ఎక్కడ దిగారు. ఇలాంటి వివరాలు అన్నీ వారికి చెప్పాలి. 

టిక్కెట్ పై ఉన్న COND కోడ్ చెప్పాలి

మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారైతే ఆ రాష్ట్రానికి చెందిన నంబరుకు ఫోన్ చేస్తే సరిపోతుంది. అలా చేసినప్పుడు అక్కడ ఉన్న అధికారులు కొన్ని వివరాలు అడుగుతారు. వాటిలో మీ పేరు, అడ్రస్సు, మొదలైన పర్సనల్ వివరాలు అడుగుతారు. వాటితో పాటు మీరు తీసుకున్నటిక్కెట్ పై ఉన్న కొన్ని వివరాలు అడుగుతారు. వాటిలో ముఖ్యమైనది COND కోడ్. ఈ కోడ్ వివరాలు మీకు తప్పకుండా చెప్పాలి.

కండక్టరే UPI ద్వారా డబ్బులు రీపేమెంట్ చేస్తారు

ఈ COND కోడ్ చెప్పగానే అధికారులకు బస్ కండెక్టర్ ఎవరు? ఆయన ఫోన్ నంబర్ ఏమిటి? ఏ రూట్లో ప్రయాణించారు. ఏ టైమ్ లో వెళ్లారు. ఇలాంటి వివరాలన్నీ అధికారులకు తెలుస్తాయి. వెంటనే అధికారులు ఆ కండక్టర్ ఫోన్ నంబర్ మీకు ఇస్తారు. దీంతో మీరు ఆయనకు ఫోన్ చేసి జరిగిన విషయం చెబితే ఆయనే మీకు డబ్బులు రిటర్న్ చేస్తారు. అది కూడా UPI ద్వారా చేస్తారు. దీంతో మీరు ఎక్కడికీ వెళ్లక్కరలేకుండానే డబ్బులు తిరిగి పొందొచ్చు. 

click me!