అసలు కోపం ఎందుకొస్తుంది? అది తగ్గాలంటే ఏం చేయాలి?

By Shivaleela Rajamoni  |  First Published Aug 24, 2024, 11:56 AM IST

కొంతమందికి ఏదైన బలమైన కారణం ఉంటేనే కోపం వస్తుంది. మరికొంతమందికి ఎప్పుడూ ముక్కుమీదే కోపముంటుంది. అసలు కోపం ఎందుకు వస్తుందో మీకు తెలుసా?
 


కోపం ఎవ్వరికైనా వస్తుంది. ఇది చాలా సహజం. కానీ కోపం మనచేత ఎన్నో తప్పులను చేయిస్తుంది. కోపం వల్ల సంబంధాలు తెగిపోతాయి కూడా. అయితే కొంతమందికి పెద్ద కారణం వల్లే కోపం వస్తే.. మరికొంతమందికి మాత్రం చిన్న చిన్న కారణాల వల్ల కూడా కోపం వస్తుంది. కోపంలో ఎదుటివారిని ఏమంటున్నామో కూడా తెలియదు. దీనివల్లే సంబంధాలు దెబ్బతింటాయి. గొడవలు అవుతాయి. అయితే ఈ కోపానికి అసలు కారణాలు.. దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

కోపానికి కారణాలు

Latest Videos

పదేపదే పనికి ఎవరో ఒకరు ఆటంకం కలిగించడం
గట్టి గట్టిగా మాట్లాడటం
పనిలో అవాంతరాలు ఎదురవడం
భావోద్వేగాలను అర్థం చేసుకోకపోవడం
తప్పుడు పదాలను ఉపయోగించడం
ఎగతాళి చేస్తూ మాట్లాడటం
టీజింగ్ మొదలైన వాటి వల్ల కోపం వస్తుంటుంది

కోపాన్ని నియంత్రించడం ఎలా? 

కోపం ఎన్నో అనార్థాలకు దారితీస్తుంది. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం. ఏదైనా ఒక విషయం వల్ల ఎక్కువ కాలం బాధించబడినప్పుడు కోపం రావడం చాలా సహజం. కానీ కోపంతో ఉండటం మీ మనస్సుకు, శరీర ఆరోగ్యానికి మంచిది కాదు. కోపం మీ మనస్సు సానుకూలతను తగ్గిస్తుంది. అలాగే దీంతో మీరు యాంగ్జైటీలో ఉంటారు. దీని వల్ల మీ మెదడు సరిగ్గా పని చేయలేకపోతుంది. అలాగే చిరాకు ఎక్కువగా పడతారు. 

లోతైన శ్వాస తీసుకోండి : మీకు దేనివల్లనైనా కోపం వస్తే.. వెంటనే కళ్లు మూసుకుని లోతైన శ్వాస తీసుకోండి. లోతైన శ్వాస తీసుకోవడం వల్ల మీ కోపం తగ్గడం ప్రారంభమవుతుంది. 

మనసులో అనుకోండి: మీరు మిమ్మల్ని  సంతోషంగా ఉంచుకోవాలనుకున్నా, కోపాన్ని తొలగించాలనుకున్నా.. రోజూ ధ్యానం చేయండి. ధ్యానం ఎన్నో సమస్యలను పరిష్కరిస్తుంది. ధ్యానంతో మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. 

మాట్లాడే ముందు ఆలోచించండి: కోపంగా ఉన్న వ్యక్తికి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. కానీ దీనివల్ల అవతలి వారు బాధపడతారు. ఇది సంబంధాలను దెబ్బతీస్తుంది. అందుకే ఏది ఏమైనా ఆలోచించే మాట్లాడండి. 

వ్యాయామం: కోపం తగ్గి సంతోషంగా, ప్రశాంతంగా పనులను చేసుకోవాలనుకుంటే ప్రతిరోజూ ఖచ్చితంగా వ్యాయామాలు చేయండి. వ్యాయామాలు మీ కోపాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. ఎక్సర్ సైజు లు శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా, ఎనర్జిటిక్ గా మారుస్తాయి.

మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి:  పనుల్లో పడి బిజీగా ఉంటే మీకు ఎలాంటి కోపం రాదు. పనులు మీ మనస్సులోకి ప్రతికూలత ఆలోచనలు రాకుండా చూస్తాయి. కాబట్టి పనిలో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. మీకు నచ్చిన వాటిపై దృష్టి పెట్టండి.
 

click me!