ఫ్రిజ్ ను రకరకాల ఫుడ్స్, డ్రింక్స్ తో నింపుతాం. దీనివల్ల ఫ్రిజ్ మురికిగా మారడమే కాకుండా.. దుర్వాసన వస్తుంది. ఇలాంటప్పుడు ఫ్రిజ్ ను ఎలా క్లీన్ చేస్తే వాసన పోతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఫ్రిజ్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటుండాలి. లేదంటే ఫ్రిజ్ మురికిగా మారి బూజు రావడమే కాకుండా.. అందులోంచి దుర్వాసన కూడా వస్తుంది. మీరెప్పుడైనా గమనించారా? ఫ్రిజ్ లో ఏదైనా పండును పెడితే ఆ పండును తీసిన తర్వాత కూడా ఫ్రిజ్ మొత్తం దానివాసనే వస్తుంది. ఈ వాసన ఇతర వస్తువులపై కూడా పడుతుంది. ఫ్రిజ్ నుంచి వచ్చే వాసనను పోగొట్టడానికి ఫ్రిజ్ ను ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఆపిల్, జామ వంటి పండ్లను ఫ్రిజ్ లో పెడితే.. వాటిని తీసేసిన తర్వాత కూడా ఫ్రిజ్ నుంచి ఆ పండ్ల వాసనే వస్తుంటుది. ఈ రకమైన వాసనను పోగొట్టడానికి బేకింగ్ సోడా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. బేకింగ్ సోడాను నీటిలో కలిపి ఒక సీసాలో నింపి ఫ్రిజ్ లో పెట్టండి. ఇది ఫ్రిజ్ నుంచి వచ్చే వాసనలన్నింటినీ గ్రహిస్తుంది. అలాగే ఫ్రిజ్ నుంచి ఫ్రెష్ వాసన వస్తుంది.
undefined
మీరు ఉపయోగించే ఫ్రిజ్ పాతదైతే ఒక్కోసారి తలుపు అంచున ఉన్న రబ్బరు బూజుపట్టిపోతుంది. ఈ మురికిని శుభ్రం చేయడానికి వెనిగర్ లో బేకింగ్ సోడా మిక్స్ చేసి పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్ ను శుభ్రమైన గుడ్డలో ముంచి ఫ్రిజ్ లో అప్లై చేయండి. ఆ తర్వాత నిమ్మరసంలో గుడ్డను ముంచి శుభ్రం చేసుకుంటే సరి. దీంతో మీ ఫ్రిజ్ మొత్తం తలతల మెరిసిపోతుంది. అలాగే బూజు కూడా మటుమాయం అవుతుంది.
ఒకవేళ మీరు ఫ్రిజ్ ను చాలా రోజులు వాడకూడదనుకుంటే దానిలో చాలా వార్తాపత్రికలను పెట్టండి. దీని వల్ల చెడు వాసన రాదు. అలాగే ఫ్రిజ్ లో తాజా వాసన ఉంటుంది.