వంటింట్లోకి ఎర్ర చీమలు రాకూడదంటే ఏం చేయాలి?

By Shivaleela Rajamoni  |  First Published Jul 7, 2024, 3:29 PM IST

వర్షాకాలంలో ఇంట్లోకి.. ముఖ్యంగా వంటగదిలోకి ఎర్ర చీమలు విపరీతంగా వస్తుంటాయి. ఈ చీమలన్నీ ఇంట్లో ఉన్న చక్కెర, బెల్లం, బిస్కెట్లు వంటి ఆహారాలను మొత్తం తినేస్తాయి. అందుకే ఈ చీమలు ఇంట్లోకి రాకుండా ఉండటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


వర్షాకాలంలో ఇంట్లోకి దోమలు, ఈగలు, కీటకాలతో పాటుగా చీమలు కూడా వస్తాయి. ముఖ్యంగా ఎర్ర చీమలు. ఇవి ఇంట్లో ఉన్న మూలలను నివాసాలుగా చేసుకుని ఆహార పదార్థాలపైన దాడి చేస్తాయి. వంటింట్లో ఎర్ర చీమలు ఉంటే మాత్రం వంటింట్లో ఉన్న  ఆహార పదార్థాలన్నింటినీ ఖాళీ చేస్తాయి. ఈ చీమలు పోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా..ఏదో ఒక మూల నుంచి వస్తూనే ఉంటాయి. ఈ చీమలు పోయేది ఎలారా దేవుడా అని ఆడవాళ్లు తల పట్టుకుంటారు. కానీ రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోకి ఒక్క చీమ కూడా లేకుండా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నల్ల మిరియాలు మరియు పసుపు


నల్లమిరియాలు: మీరు నల్ల మిరియాలతో కూడా ఇంట్లోకి చీమలు రాకుండా చేయొచ్చు. ఇందుకోసం నల్ల మిరియాలు, పసుపు పొడిని నీటిలో వేసి మరిగించాలి. ఈ వాటర్ స్ప్రే బాటిల్ లో పోసి వంటగది మూలల్లో, ఆహార పదార్థాలను ఉంచే ప్రదేశాల్లో స్ప్రే చేయండి. ఇక్కడికి ఒక్క చీమ కూడా రాదు. ఎందుకంటే ఈ స్ప్రే వాసన చీమలకు అస్సలు నచ్చదు. 

Latest Videos

ఉప్పు, వెనిగర్ తో: వైట్ వెనిగర్ వాసన చీమలకు అస్సలు నచ్చదు. కాబట్టి నీళ్లలో ఉప్పు, వెనిగర్ వేసి అందులో ఒక గుడ్డను ముంచి కిచెన్ టైల్స్, ఫ్లోర్, సింక్ చుట్టుపక్కల ప్రాంతాన్ని బాగా శుభ్రం చేయండి.  స్టవ్ పై కూడా తుడవండి. దీంతో ఇక్కడికి చీమలు ఒక్క అడుకు కూడా పెట్టలేరు. 

లక్ష్మణ రేఖ: లక్ష్మణ రేఖ కూడా చీమలను తరిమికొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. చీమలను తరిమికొట్టడానికి మార్కెట్లో ఎన్నో రకాల స్ప్రేలు అందుబాటులో ఉంటాయి. కానీ వీటిలో లక్ష్మణరేఖ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. లక్ష్మణ రేఖను గీస్తే ఒక్క చీమ, బొద్దింక కూడా వంటింట్లోకి రాదు. 

మిరియాలు: మిరియాల ఘాటైన వాసన చీమలకు అస్సలు నచ్చదు. కాబట్టి ఎర్ర చీమలు ఉండే ప్రదేశాల్లో మిరియాలను చిక్కటి పేస్ట్ లా చేసి అక్కడ అప్లై చేయండి. లేదా వీటిని నీటిలో మరిగించి స్ప్రే తయారు చేసి చల్లాలి. మిరియాలను నీటిలో కలిపి శుభ్రం చేయడం వల్ల ఇంట్లోకి చీమలు రావు.
 

click me!