ఎన్ని క్యాలరీల ఆహారం తీసుకోవాలి?

By telugu teamFirst Published Jul 9, 2019, 4:42 PM IST
Highlights

మన శరీరానికి శక్తి అవసరం. క్యాలరీలు కావాలంటే.. మనం ఆహారం తీసుకోవాలి. ఈ విషయం మనకు తెలిసిందే. 

మన శరీరానికి శక్తి అవసరం. క్యాలరీలు కావాలంటే.. మనం ఆహారం తీసుకోవాలి. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే...  అసలు మానవ శరీరానికి ఎన్ని క్యాలరీలు అవసరం అనేదానిపై చాలామందికి స్పష్టత ఉండదు. నిజం చెప్పాలంటే.. బరువు తక్కువగా ఉన్నవారు ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోవాలి. ఎక్కువ బరువు ఉన్నవారు తక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తినాలని నిపుణులు చెబుతున్నారు.

పెరిగే వయసు వారికి, పాలిచ్చే తల్లులకు, గర్భవతులకు పోషకాలు అధికంగా అవసరం కాబట్టి వారి ఆహారంలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారికి క్యాలరీలు సరిగ్గా సరిపడా ఇవ్వాలి. టీబీ ఉన్నవారు అత్యధిక క్యాలరీలు తీసుకోవాలి. ఇలా క్యాలరీల అవసరం మారుతుంటుంది. అంతేకాదు మన రోజువారి పనిని బట్టి కూడా క్యాలరీల లెక్కింపు ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి 2200 క్యాలరీలు తీసుకోవచ్చు.
 
అయితే ఇప్పటి జీవన విధానానికి 1600 నుంచి 1800 క్యాలరీల ఆహారం తీసుకుంటే బరువు పెరగకుండా ఉంటారు. మెయింటనెన్స్‌ సరిగ్గా ఉంటుంది. అందుకే డాక్టర్లు క్యాలరీలు తగ్గించండి అంటుంటారు. ఇక క్యాలరీలు ఎలా తగ్గించుకోవాలంటే.. చాలా సింపుల్‌...ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తగ్గించాలి లేదా మానెయ్యాలి. అధిక క్యాలరీలు ఇచ్చే ఆహార పదార్థాలు ఏమిటంటే... కొవ్వు పదార్థాలు, పంచదార, స్వీట్లు, ఫ్రై ఫుడ్‌, కూల్‌డ్రింక్స్‌, బిస్కెట్లు, కేకులు, ఐస్‌క్రీమ్‌లు, పిజ్జా, బర్గర్‌, ఆల్కహాల్‌ మొదలైనవి. వీటిని నియంత్రించుకుంటే అధిక క్యాలరీలు మన శరీరంలో ఉండవు.

click me!