ఈ అవకాడో పండు మీ సెక్సువల్ లైఫ్ కి బాగా సహాయపడుతుంది. అంతేకాదు ఈ పండు రెగ్యులర్ గా తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇందులో అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగానూ, సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగానూ ఉంటాయి. దీంతో ఇవి తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. రక్త సరఫరా కూడా సరిగా జరుగుతుంది.
undefined
బాదంపప్పు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే.. ఇది సెక్స్ కి కూడా ఉపయోగపడుతుంది. ఇందులో మినరల్స్, ప్రోటీన్ల శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఇందులో జింక్, విటమిన్ ఈ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా సెక్సువల్ స్ట్రెంత్ పెరగడానికి దోహదం చేస్తాయి.
undefined
ఎరుపు రంగుకి ఆకర్షణ చాలా ఎక్కువ. ఆడవాళ్లు ఎరుపు రంగు ధరిస్తే.. మగవాళ్లు త్వరగా ఆకర్షితులౌతారట. అలాగే స్ట్రాబెర్రీస్ కూడా ఎరుపు రంగులోనే ఉండి ఆకర్షిస్తుంటాయి. వీటిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. మగవారిలో వీర్యకణాల పెరగడానికి స్ట్రాబెర్రీస్ ఉపయోగపడతాయని ఓ సర్వేలో వెల్లడైంది.
undefined
జలచర జీవులు అదేనండి.. చేపలు,రొయ్యలు, పీతలు లాంటివి కూడా సెక్యువల్ లైఫ్ లీడ్ చేయడానికి సహాయపడతాయి. ముఖ్యంగా నత్త గుల్లలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ జలచరాల్లో జింక్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
undefined
నిమ్మజాతి పండ్లు నిమ్మకాయ, బత్తాయి, నారింజ లాంటివన్నింటినీ నిమ్మజాతి పండ్లు అంటారు. వీటిలో విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పురుషల్లో రీప్రొడక్టివిటీ హెల్త్ పెరుగుదలకు సహాయం చేస్తాయి.
undefined