కేవలం ఆ సెంటర్లకు వెళ్లినంత మాత్రాన మీకు పట్టిన మత్తు వదలదు. వాటితోపాటు కొన్ని రకాల ఫుడ్స్ కూడా తీసుకోవాలి. వాటితో సులభంగా ఈ బానిసత్వానికి విముక్తి లభిస్తుంది. అంతేకాదు.. ఇప్పటివరకు శరీరంలో జరిగిన డ్యామేజ్ ని కూడా రికవర్ చేస్తాయట.
ఈ మధ్యకాలంలో అమ్మాయిలు.. అబ్బాయిలు అనే తేడా లేకుండా ఆల్కహాల్ సేవిస్తున్నారు. అది ఇచ్చే మత్తును ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ మెంట్ కోసం అప్పుడప్పుడు డ్రింక్ చేయడం తప్పేం కాదు. కానీ అదే అలవాటుగా మారితే.. మద్యానికి బానిసలైపోతారు. ఒక్కసారి బానిసలుగా మారితే.. దాని నుంచి బయటపడటం చాలా కష్టం.
ఆ మత్తును వదిలించుకునేందుకు చాలా మంది డీటాక్సేషన్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అందుకు రూ.వేలు, రూ.లక్షలు ఫీజులు చెల్లిస్తూ ఉంటారు. కేవలం ఆ సెంటర్లకు వెళ్లినంత మాత్రాన మీకు పట్టిన మత్తు వదలదు. వాటితోపాటు కొన్ని రకాల ఫుడ్స్ కూడా తీసుకోవాలి. వాటితో సులభంగా ఈ బానిసత్వానికి విముక్తి లభిస్తుంది. అంతేకాదు.. ఇప్పటివరకు శరీరంలో జరిగిన డ్యామేజ్ ని కూడా రికవర్ చేస్తాయట. మరి అవేంటో ఒకసారి చూసేద్దామా..
పండ్లు, కూరగాయలు..
మద్యానికి బానిసలైనవారు.. దాని నుంచి విముక్తి పొందాలంటే.. ముందుగా చేయాల్సిన పని.. పండ్లు, కూరగాయలు తినడం ప్రారంభించాలి. వీటిలో మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మద్యం నుంచి విముక్తి పొందాలనుకునేవారు.. డీటాక్సినేషన్ ట్రీట్ మెంట్ తీసుకునేవారు ఎక్కువగా స్వీట్లు తీసుకోవడానికి ఇష్టపడతారు. అప్పుడు నాచురల్ పద్దతిలో పండ్లు తీసుకోవడం లాంటివి చేయాలి. ముఖ్యంగా రాజ్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ లాంటివి తీసుకోవడం ఉత్తమం. వీటిలో ఉండే సీ విటమిన్ ఎంతో ఉపయోగపడుతుంది. రెగ్యులర్ గా వీటిని తీసుకోవడం వల్ల.. మందు ద్యాస నుంచి బయటపడొచ్చు.
కొవ్వు తక్కువగా ఉండే ఆహారం..
కొవ్వు తక్కువగా.. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా అవసరం. డాటాక్సినేషన్ మొదలుపెట్టిన తొలి రోజుల్లో వారికి ఆకలి చాలా తక్కువగా వేస్తుంది. కాబట్టి ఆ సమయంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండే మాంసకృతులను తీసుకుంటే మంచిదంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల క్రమంగా జీర్ణాశయం మెరుగుపడుతుంది. ముఖ్యంగా చేపలు, స్కిన్ లెస్ చికెన్, ఎగ్స్ తీసుకోవడం ఉత్తమం
పప్పుధాన్యాలు..
పపు ధాన్యాలు, ఓట్స్, బటానీలు, బ్రౌన్ రైస్ వంటి ఆహారం కూడా తీసుకోవాలి. వీటిలో ఫైబర్(పీచు పదార్థం) ఎక్కువగా ఉంటుంది. ఇవి కూడా చాలా హెల్ప్ అవుతాయి. వీటిలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. జీర్ణాశయం మెరుగుపడుతుంది.
జ్యూసులు..
పైన చెప్పిన ఆహారంతోపాటు.. నీరు ఎక్కువగా తీసుకోవాలి. శరీరంలో నీటి నిల్వ తగ్గినా.. ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందులోనూ మద్యపాన బానిసత్వం నుంచి బయటపడటానికి కూడా ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. కేవలం మంచినీరే కాకుండా.. నీటి క్వాంటిటీ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. జ్యూసులు కూడా ఎక్కువగా తీసుకోవాలి.
ఈ ఫుడ్స్ ని రెగ్యులర్ గా తీసుకుంటే.. ఆల్కహాల్ శరీరానికి చేసిన హాని నుంచి బయటపడొచ్చు. అదేవిధంగా ఆ మత్తుని కూడా వదిలించుకోవచ్చు.