అక్కడ వెనకపడ్డారా..? కొబ్బరిపాలు తీసుకోండి

First Published Jul 5, 2018, 1:01 PM IST
Highlights

వీర్యకణాల సంఖ్య పెంచుకునేందుకు మందులు కూడా వాడేస్తున్నారు. అయితే.. ఇవేమీ లేకుండా కేవలం కొబ్బరిపాలతో ఈ సమస్య నుంచి పరిష్కారం పొందవచ్చని అంటున్నారు నిపుణులు.

ప్రస్తుత కాలంలో వర్క్ టెన్షన్స్, కాలుష్యం, నిద్రలేమి తదితర కారణాల వల్ల పురుషుల్లో వీర్యకణాల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. ఈ రకమైన టెన్షన్ ప్రస్తుత కాలంలో చాలా మంది అబ్బాయిలను వెంటాడుతోంది. అందుకే 30ఏళ్లు దాటితే చాలు.. హాస్పటల్స్ చుట్టూ తిరిగే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది..

వీర్యకణాల సంఖ్య పెంచుకునేందుకు మందులు కూడా వాడేస్తున్నారు. అయితే.. ఇవేమీ లేకుండా కేవలం కొబ్బరిపాలతో ఈ సమస్య నుంచి పరిష్కారం పొందవచ్చని అంటున్నారు నిపుణులు.కేవలం ఆ ఒక్క సమస్యే కాదు.. చాలా సమస్యలకు కొబ్బరి చక్కని పరిష్కారమని చెబుతున్నారు. మరి అవేంతో ఓ సారి చూసేద్దామా..

కొబ్బరికి సంబంధించిన వివిధ భాగాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా....

కొబ్బరి పువ్వు లోపలి భాగాన్ని (కల్కం) చిన్న కరక్కాయ పరిమాణంలో రెండు పూటలా పెరుగుతో కలిపి సేవిస్తే, మూత్రాశయంలోని రాళ్లు కరిగిపోతాయి.
ఐదారు చెంచాల కొబ్బరి పెంకు చూర్ణాన్ని నీటిలో వేసి మరిగించి ఆ కషాయాన్ని రోజుకు రెండు సార్లు సేవిస్తే, తరుచూ మూత్రం వచ్చే దీర్ఘకాలిక ప్రవాహిక సమస్య తగ్గిపోతుంది.
కాస్తంత కొబ్బరి పెంకు చూర్ణాన్ని కొంచెం వాముతో కలిపి నూరి సేవిస్తే కడుపులోని పాములు విసర్జన ద్వారా పడిపోతాయి.
కొబ్బరి నీరు తొందరగా శక్తినివ్వడంతో పాటు ర క్తాన్ని శుద్ది చేస్తుంది. నేత్ర రోగాలను నయం చేస్తుంది.
కొబ్బరి పెంకు నుంచి తీసిన తైలంతో మర్థన చేస్తే పలు రకాల చర్మ వ్యాధులు తగ్గుతాయి. కొబ్బరి కోరు, కొబ్బరి పాలు వీర్యవృద్ధిని కలిగిస్తాయి.

click me!