ఆ విషయంలో స్త్రీలపై పురుషులకు ఉండే అపోహలు ఇవే...

By ramya neerukonda  |  First Published Aug 11, 2018, 3:02 PM IST

శృంగారం పట్ల అందరికీ ఆసక్తి ఉంటుంది, అందరూ లైంగిక చర్యల పట్ల అనురక్తి కనబరుస్తూనే


శృంగారం పట్ల అందరికీ ఆసక్తి ఉంటుంది, అందరూ లైంగిక చర్యల పట్ల అనురక్తి కనబరుస్తూనే ఉంటారు. కానీ శృంగారం గురించి బయటకు మాట్లాడటానికి వచ్చేసరికి మాత్రం అంతా ‘ఛీ చ్ఛీ’ అంటుంటారు. మనం పెరిగిన కట్టుబాట్ల వల్ల శృంగారం గురించి చర్చించుకోవడం తప్పు అనే భావన మనలో ఏర్పడిపోయింది. కాబట్టే దీని గురించి చాలా మంది అవగాహన లేదు. సినిమాల్లో, పత్రికల్లో, ఎవరైనా చెప్పడం ద్వారా చాలా మంది దీని గురించి తెలుసుకుంటున్నారు. దీంతో.. స్పష్టమైన అవగాహన ఏర్పడదు. దీంతో శృంగారం విషయంలో చాలా అపోహలు అలానే ఉండిపోతున్నాయి.   ఆ అపోహలు ఏంటో.. నిజమేంటో ఇప్పుడు చూద్దాం..

1. పురుషుల్లో శృంగారం గురించి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వాళ్లు ప్రతి నిమిషం దాని గురించే ఆలోచిస్తుంటారు. అయితే.. చాలా మంది అబ్బాయిలు.. అమ్మాయిలు కూడా  తమలాగే  ఆలోచిస్తారు అని అపోహ పడుతుంటారు. అయితే.. ఇది అబద్ధం. స్త్రీలు వారంలో మూడు సార్లు మాత్రేమే సెక్స్ లో పాల్గొనాలని అనుకుంటారు. అప్పుడు మాత్రమే వారు ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతారు.

2. లైంగిక ఆనందం అనేది పురుషాంగ పరిమాణంపై ఆధారపడి ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. పురుషాంగం చిన్నగా ఉన్నవారు ఈ విషయంలో చాలా కంగారు పడుతుంటారు. అయితే.. ఇందులో  ఏ మాత్రం నిజం లేదు.  పురుషాంగ పరిమాణానికి లైంగిక ఆనందానికి ఎటువంటి సంబంధం లేదు. పురుషాంగం చిన్నగా ఉనప్పటికీ కంగారుపడనవరసరం లేదు.

3. పీరియడ్ సమయంలో సెక్స్ చేయవచ్చా.. లేదా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. అయితే..  చెయ్యకూడదు అనే నియమం మాత్రం ఎక్కడా లేదు. పీరియడ్స్ రావడం అనేది సంతానోత్పత్తికి బాడీని ప్రిపేర్ చేయడమని అర్థం. పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

Latest Videos

4. హస్త ప్రయోగం అనేది పురుషులు మాత్రమే చేస్తారనుకోవడం కూడా ఒక అపోహే. స్త్రీలు కూడా హస్త ప్రయోగం చేసుకుంటారు. నిజానికి దీనివల్ల పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువ ఆనందాన్ని పొందుతారు.

5. ఎలాంటి ప్రికార్షన్స్ తీసుకోకుండా సెక్స్ చేస్తే.. స్త్రీలు వెంటనే గర్భం దాలుస్తారనుకోవడం కూడా పొరపాటే. 8మందిలో ఒకరికి మాత్రమే.. ఒక్కసారి చేసినా ప్రెగ్నెన్సీ వస్తుంది. కాబట్టి పెద్దగా కంగారుపడాల్సిన అవసరం లేదు. మరీ అంతగా డౌట్ ఉంటే.. ప్రెగ్నెన్సీ రాకుండా పిల్స్ వేసుకుంటే సరిపోతుంది.

 

click me!