కేవలం మునగ మాత్రమే కాదు.. మెంతులు కూడా పురుషుల్లో లైంగిక ఆసక్తి పెంచడానికి బాగా పనిచేస్తాయి.
శృంగారంపై ఆసక్తి పెంచుకోవడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల పురుషుల్లో కోరికలు పెరుగుతాయనే నమ్మకం కూడా చాలా మందిలో ఉంటుంది. ఇందుకోసం చాలా మంది మునగకాయలను ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. కేవలం మునగ మాత్రమే కాదు.. మెంతులు కూడా పురుషుల్లో లైంగిక ఆసక్తి పెంచడానికి బాగా పనిచేస్తాయి.
తాజా సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. మెంతులు శృంగారంపై ఆసక్తి పెంచేలా చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పురుషులు తరచూ మెంతులు తీసుకుంటే.. వారిలో చాలా మార్పు వచ్చిందని పరిశోధనలో వెల్లడయ్యింది.
ఆరువారాల పాటు కొందరు పురుషులకు మెంతుల సారాన్ని ఇచ్చి మరీ పరిశీలించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా.. ఆరువారాల తర్వాత వారిలో శృంగారాసక్తి బాగా పెరిగినట్లు గుర్తించారు. మెంతుల్లో సాపోనిన్స్ అనే వృక్ష రసాయనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి టెస్టోస్టీరాన్ వంటి సెక్స్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి. అందుకే పురుషులు తరచూ మెంతులు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.