మనం ఏ భాష మాట్లాడినా.. మన మెదడు, శరీరంలోని నూరాన్లు యాక్టివేట్ అవ్వడం వరకు నిజం. కానీ... ఇన్ని వేల నూరాన్లు యాక్టివేట్ అవుతాయి అనడంలో మాత్రం సందేహాలు వ్యక్తమౌతున్నాయి.
తెలుగు భాష మాట్లాడటం వల్ల ఒక మనిషి శరీరంలో 72000 న్యూరాన్లు యాక్టివేట్ అవుతాయి. అంటూ.. ఓ స్టేట్మెంట్ జారీ చేశారు. ఇది ఎంత వరకు నిజం..? ఒక భాష మాట్లాడితే.. ఇలా ఇన్ని న్యూరాన్లు యాక్టివేట్ అవుతాయా..? సాధారణంగా.. మనం ఏ భాష మాట్లాడినా.. మన మెదడు, శరీరంలోని నూరాన్లు యాక్టివేట్ అవ్వడం వరకు నిజం. కానీ... ఇన్ని వేల నూరాన్లు యాక్టివేట్ అవుతాయి అనడంలో మాత్రం సందేహాలు వ్యక్తమౌతున్నాయి.
తెలుగు భాష మాట్లాడటం వల్ల శరీరంలో దాదాపు 72,000 న్యూరాన్లు యాక్టివేట్ అవుతాయని, ప్రపంచంలోని ఏ భాషకైనా అది అత్యున్నతమైనదనే వాదనకు ఎలాంటి విశ్వసనీయమైన శాస్త్రీయ అధ్యయనం లేదా పరిశోధన మద్దతు లేదు. ఈ ప్రకటన అపోహ లేదా తప్పుడు సమాచారం కావడం గమనార్హం.
undefined
న్యూరోసైంటిఫిక్ అధ్యయనాలు, అంటే మెదడు ఎలా పనిచేస్తుందో పరిశీలించే శాస్త్రం, భాషలు మెదడులోని ఏ ఏ భాగాలను యాక్టివేట్ చేస్తాయో తెలుసుకోవడంపై ఎక్కువగా దృష్టి పెడతాయి. ఉదాహరణకు, భాషకు సంబంధించిన విషయాల్లో బ్రోకా ఏరియా, వెర్నికె ఏరియా అనే మెదడు భాగాలు ముఖ్యంగా పని చేస్తాయి. అయితే, భాషల మధ్య న్యూరాన్‌ల సంఖ్యను లెక్కించడం అనేది సాధారణంగా జరగదు, ఎందుకంటే ఇది చాలా క్లిష్టమైన పని.
అందుకే, మీరు ఇలాంటి సమాచారాన్ని చూసినప్పుడు, అది నిజమేనా, విశ్వసనీయమా అనే విషయాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.