బాదం తినేప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.? కిడ్నీల్లో రాళ్లు వస్తాయి జాగ్రత్త..

By Narender Vaitla  |  First Published Jan 4, 2025, 11:54 AM IST

కిడ్నీల్లో రాళ్లు.. వినడానికి చిన్న సమస్యగానే అనిపించినా దీని బారిన పడిన వారు అనుభవించే బాధ ఓ రేంజ్‌లో ఉంటుంది. విపరీతమైన నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. అయితే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక కారణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


బాదం పప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాదంలో ఉండే పోషకాలు, ఆరగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్స్‌, విటమిన్లు, మినరల్స్‌ సమృద్ధిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా రాత్రంతా నీటిలో నానబెట్టిన బాదంను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతుంటారు. 

లాభాలు.. 

Latest Videos

నానబెట్టిన బాదంను తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని విటమిన్‌ ఇ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ బాదం ఉపయోగపడుతుంది. ఇవి గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ధమనులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. బరువ తగ్గాలనుకునే వారికి కూడా బాదం ఉపయోగపడుతుంది. 

ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. దీంతో త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. షుగర్‌ పేషెంట్స్‌కి కూడా బాదం ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్‌, ప్రోటీన్స్‌ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. 

రాళ్ల సమస్య.. 

అయితే ఆరోగ్యానికి మంచి చేసే బాదంను ఎక్కువగా తీసుకుంటే ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బాదం ఎక్కువగా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. బాదం తప్పును తీసుకునేప్పుడు కొన్ని తప్పులు చేయకూడదని చెబుతున్నారు. ముఖ్యంగా కిడ్నీ సంబంధిత సమస్యలున్న వారు బాదంను ఎక్కువగా తీసుకోకూడదు. 

కారణం ఏంటంటే.. 

బాదంను ఎక్కువగా తీసుకోవడం వల్ల రాళ్లు రావడానికి అసలు కారణం ఏంటంటే. బాదంలో ఆక్సలేట్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది కాల్షియంలో కలిసి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి దారి తీస్తాయి. అందుకే వీటిని ఎక్కువగా తీసుకుంటే.. కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. ముఖ్యంగా హైపెరాక్సలూరియా సమస్య ఉన్నవారిలో, అంటే మూత్రంలో ఆక్సలేట్లు అధికంగా ఉన్న వారిలో ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

ఎంత తీసుకోవాలి.? 

పెద్దలు ప్రతీరోజూ 7 నుంచి 8 వరకు నానబెట్టిన బాదంను తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. చిన్నారులకు అయితే 2 నుంచి 3 వరకు ఇవ్వొచ్చు. అయితే కిడ్నీల్లో రాళ్ల సమస్యలున్న వారు మాత్రం బాదం తీసుకునే విషయంలో వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమమని అంటున్నారు. 

ఇవి కూడా కారణం.. 

కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడానికి మరికొన్ని కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి సోయా ఉత్పత్తులు, రెడ్ కిడ్నీ బీన్స్, నేవీ బీన్స్, ఫావా బీన్స్, దుంపలు, బచ్చలికూర, కాలే, టమోటాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల రాళ్లలో కిడ్నీలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కూల్‌ డ్రింక్స్, సోడా వంటి పానియాలను ఎక్కువగా తీసుకున్న వారిలో కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

రాళ్లను తగ్గించే మార్గాలు.. 

రోజూ కనీసం 2.5 లీటర్ల నీటిని తాగాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే తీసుకునే ఆహారంలో వీలైనంత వరకు ఉప్పును తగ్గించాలి. ఇక తీసుకునే ఆహారంలో పాలకూర, టమాటో, క్యాబెజ్, కాలీఫ్లవర్, మటన్, చికెన్ వంటి ఎక్కువగా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

click me!