వర్షాకాలంలో కచ్చితంగా తాగాల్సిన డ్రింక్స్ ఇవి..!

By ramya Sridhar  |  First Published Jul 3, 2024, 4:06 PM IST

రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే... ఏ జబ్బులు అయినా దరి చేరకుండా ఉంటాయి. ఆ ఇమ్యూనిటీ పవర్ మనకు ఈ కింది డ్రింక్స్ తాగడం వల్ల వస్తుందట. మరి ఆ డ్రింక్స్ ఏంటో చూద్దాం..


వర్షాకాలం రావడం  ఎవరికైనా ఉపశమనం కలిగించే విషయమే. నిన్న , మొన్నటిదాకా ఎండల దెబ్బకు అందరూ అల్లాడిపోయారు. ఇప్పుడు వాతావరణం కాస్త హాయిగా ఉంటుంది. కానీ... ఈ కాలంలో పిలవకుండానే వచ్చినట్లు జబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకు స్కూల్లకు వెళ్లగానే.. జులుబు, జ్వరం, దగ్గు లాంటివి వచ్చేస్తాయి. చిన్న పిల్లలే కాదు.. పెద్దవారు కూడా వరసగా జబ్బుల బారినపడుతూ ఉంటారు. అయితే.. ఈ సమస్యలు ఏమీ రాకుండా ఉండాలంటే... మనం మన ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవాలి.

రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే... ఏ జబ్బులు అయినా దరి చేరకుండా ఉంటాయి. ఆ ఇమ్యూనిటీ పవర్ మనకు ఈ కింది డ్రింక్స్ తాగడం వల్ల వస్తుందట. మరి ఆ డ్రింక్స్ ఏంటో చూద్దాం..

Latest Videos

1.పసుపు పాలు..

పసుపుతో తయారు చేసే  ఈ పానీయంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి.  వేడి వేడి పాలల్లో పసుపు వేసుకొని తాగడమే.  ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.  ఈ పసుపు పాలల్లో మనం కావాలంటే..  తేనె, మిరియాల పొడి కూడా కలుపుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

2.తులసి టీ..
చాలా మందికి ఉదయాన్నే వేడి నీరు తాగే అలవాటు ఉంటుంది. అయితే.. నార్మల్ వేడి నీళ్లు కాకుండా.. అందులో తులసి ఆకులు జోడించి తాగడం అలవాటు చేసుకోవాలి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిలో.. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది.

3.దాల్చిన చెక్క నీరు..
చాలా మంది బరువు తగ్గేందుకు దాల్చిన చెక్క వాటర్ తాగుతారు. కానీ ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో దాల్చిన చెక్క పొడితో పాటు తేనె కలుపుకొని తాగాలి. తేనెలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఉంటాయి. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల.. రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు.. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.

4.అల్లం, లెమన్ టీ..
నార్మల్ టీ వానకాలంలో ఎవరైనా తాగుతారు. కానీ.. అల్లం, నిమ్మకాయ టీ తాగి చూడండి. లెమన్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అల్లంలో యాంటీ బయెటిక్స్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఉంటాయి. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.  చాలా రకాల ఇన్ ఫెక్షన్లు కూడా రాకుండా ఉంటాయి

click me!