లెమన్ కాఫీని ఇలా తాగితే.. వారంలో 2 కిలోల బరువు తగ్గడం పక్కా

By Shivaleela RajamoniFirst Published Oct 1, 2024, 10:36 AM IST
Highlights

మనలో ప్రతి ఒక్కరికీ టీ లేదా కాఫీ ని తాగే అలవాటు ఖచ్చితంగా ఉంటుంది. అయితే బరువు తగ్గాలనుకునే వారికి మాత్రం లెమన్ కాఫీ ప్రయోజరకరంగా ఉంటుంది. లెమన్ కాఫీని ఒక పద్దతిలో తయారుచేసి తాగితే వారానికి 2 కిలోలు తగ్గుతారట. 

బరువు తగ్గాలనుకుంటున్న వారు అసలు టీ తాగాలా? కాఫీ తాగాలా? అనే డౌట్ కచ్చితంగా ఉంటుంది. నిజానికి టీ, కాఫీలు మీ బరువును మరింత పెంచుతాయి. కానీ ఈ కాఫీ, టీ వంటి పానీయాల్లో ఉండే పోషకాలను సరైన సమయంలో తీసుకుంటే మీరు బరువు పెరిగే అవకాశం తగ్గుతుంది. 

ప్రస్తుత కాలంలో చాలా మంది బరువు తగ్గడానికి రకరకాల డైట్ లను ఫాలో అవుతున్నారు. బరువు తగ్గాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడంతో పాటుగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అయితే వెయిట్ లాస్ అవ్వాలనుకునే కొంతమంది రోజుకు మూడు, నాలుగు కప్పుల పాల టీ లేదా కాఫీ ని తాగుతుంటారు. కానీ ఈ పాలు, పంచదార కలిపిన టీ, కాఫీలు మీ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఇవి మీ బరువును మరింత పెరిగేలా చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఒక వ్యక్తి రోజుకు ఒక కప్పు కాఫీ తాగితే సరిపోతుంది. అయితే లెమన్ కాఫీని ఒక విధంగా తయారుచేసి తాగితే మీరు బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

బరువు తగ్గడానికి లెమన్ కాఫీ:

Latest Videos

నిమ్మకాయలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం లు మెండుగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచి మన శీరరంలోని హానికరమైన టాక్సిన్స్ ను బయటకు పంపడానికి బాగా సహాయపడతాయి. నిమ్మకాయను గనుక మీ రోజువారి డైట్ లో చేర్చుకుంటే మీరు పక్కాగా బరువు తగ్గుతారు. మీకు తెలుసా? మీరు లెమన్ కాఫీని రోజూ తప్పకుండా తాగితే మీ ఆకలి నియంత్రణలో ఉంటుంది. కడుపు కూడా తొందరగా నిండుతుంది. ఇకపోతే లెమన్ కాఫీలో ఉండే కొన్ని పోషకాలు మీ శరీర శక్తిని పెంచుతాయి. అలాగే జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి. 

లెమన్ కాఫీని ఎలా తయారు చేయాలి?

మీరు లెమన్ కాఫీతో బరువు తగ్గాలనుకుంటే మాత్రం దీనిలో పాలను కానీ, పంచదారను అస్సలు కలపకూడదు. టేస్ట్ కోసం మీరు కావాలనుకుంటే ఈ లెమన్ కాఫీలో కొద్దిగా ఉప్పును కలపండి. ఒక కప్పు బ్లాక్ కాఫీలో నిమ్మరసాన్ని కలిపి తాగితే ప్రయోజనకరంగా ఉంటుంది. బరువు తగ్గడానికి కని మీరు ఈ కాఫీని ఒక రోజుకు ఒక కప్పు కంటే ఎక్కువ అసలే తాగకూడదు. 

లెమన్ కాఫీ తయారీకి కావల్సిన పదార్థాలు:

ఒక కప్పు వేడి నీళ్లు
ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్
సగం నిమ్మకాయ

లెమన్ కాఫీని తయారుచేసే విధానం:

లెమన్ కాఫీని తయారుచేయడానికి ముందుగా ఒక కప్పు వేడి నీళ్లు తీసుకోండి. ఇప్పుడు దీంట్లో కాఫీ పొడి, సగం నిమ్మరసం పోసి బాగా కలపండి. అంతే టేస్టీ టేస్టీ లెమన్ కాఫీ తయారైనట్టే. కాఫీ టేస్ట్ గా కావడానికి దీంట్లో మీరు కావాలంటే అర టేబుల్ స్పూన్ తేనెను కలిపి తాగండి. 

లెమన్ కాఫీ ప్రయోజనాలు

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

లెమన్ వాటరే కాదు.. లెమన్ కాఫీ కూడా మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఈ కాఫీని తాగితే విరేచనాలు తగ్గుతాయి. అలాగే ప్రేగు కదలికలు మెరుగుపడతాయి. శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. అలాగే చర్మం హైడ్రేట్ గా ఉండటానికి ఇది సహాయపడుతుంది. లెమన్ కాఫీ మన శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీంతో మీరు ఎన్నో అంటువ్యాధులు, ఇతర రోగాలకు దూరంగా ఉంటారు. 

ఈ లెమన్ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ  మొత్తంలో ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే చర్మ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. తలనొప్పితో బాధపడేవారికి కూడా లెమన్ కాఫీ ప్రయోజకరంగా ఉంటుంది. ఈ కాఫీని తాగితే తలనొప్పి నుంచి తొందరగా ఉపశమనం కలుగుతుంది. అలాగే జీర్ణ సమస్యలు కూడా తొందరగా తగ్గిపోతాయని డాక్టర్లు చెప్తున్నారు. 

రోజూ ఉదయాన్నే బ్లాక్ కాఫీ తాగితే ఏమౌతుంది? 

పాలు, పంచదార లేకుండా తయారుచేసే బ్లాక్  కాఫీ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఈకాఫీని తాగడం వల్ల మీ శరీరంలో నోర్పైన్ఫ్రైన్, డోపామైన్ వంటి ఫీల్-గుడ్ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఇవి మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్ గా, ఉత్సాహంగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే ఈ కాఫీ మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఈ కాఫీలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారిపై ఇది ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపించదు. ఈ కాఫీని తాగితే మీ ఆకలి తగ్గి, జీవక్రియ పెరుగుతుంది. దీంతో మీరు హెల్తీగా బరువు తగ్గొచ్చు. 

డయాబెటిస్ను నియంత్రిస్తుంది

బ్లాక్ కాఫీని తాగితే మీ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే ఇది కాలెయాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. మీరు రోజూ బ్లాక్ కాఫీని తాగితే మీకు లివర్ డిసీజెస్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

మీరు ఉదయాన్నే బ్లాక్ కాఫీని తాగడం వల్ల మీ మెదడుకు నేచురల్ రిలాక్సేషన్ లభిస్తుంది. దీంతో మీ బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది. అలాగే మీకు అల్జీమర్స్, చిత్తవైకల్యం, పార్కిన్సన్ వ్యాధులొచ్చే రిస్క్ కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే వేడి వేడి బ్లాక్ కాఫీని గనుక తాగితే సాఫీగా మూత్రం బయటకు వస్తుంది.  అలాగే ఇది మీ కడుపులోని చెడు బ్యాక్టీరియా, టాక్సిన్స్ ను బయటకు పంపి పొట్టను శుభ్రపరుస్తుంది. 
 

click me!