చలికాలంలో సైజు తగ్గుతోంది.. ప్రమాదమా..?

By ramya NFirst Published Feb 7, 2019, 2:11 PM IST
Highlights

చాలా మంది అబ్బాయిలకు అంగం సైజు విషయంలో చాలా అనుమానాలు ఉంటాయి. అంగం సైజు చిన్నగా ఉంటే.. శృంగారానికి పనికిరామేమో అని భయపడిపోతుంటారు. 

చాలా మంది అబ్బాయిలకు అంగం సైజు విషయంలో చాలా అనుమానాలు ఉంటాయి. అంగం సైజు చిన్నగా ఉంటే.. శృంగారానికి పనికిరామేమో అని భయపడిపోతుంటారు. ఇంకొందరం.. తమ అంగం సైజు చిన్నగా ఉందని తమ పార్ట్ నర్ దూరం పెట్టేస్తోందని అభద్రతా భావానికి గురౌతుంటారు. అయితే.. ఇలాంటి విషయంలో అనవసరంగా లేనిపోని అపోహలు పెట్టుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.

అంతేకాదు..చలికాలంలో చాలా మంది అంగ పరిమాణం తగ్గుతుంది. దానిని పెద్ద సమస్యగా చేసుకొని బాధపడాల్సిన అవసరం లేదనంటున్నారు. నిజానికి చలికాలంలో వాతావరణ మార్పుల వల్ల అంగం కొంత కుంచించుకుపోయినట్టు కనిపించడం సహజం. చల్లని వాతావరణానికి అంగంలోని స్పాంజ్‌ లాంటి కణజాలం కుంచించుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది.

శృంగారానికి సంబంధించిన ఫీలింగ్స్ కలిగినప్పుడు అంగం సైజు పెరుగుతుంది. ఈ కాలంలోనూ ఎప్పటిలాగానే అంగం సైజు పెరిగితే.. మీరు పెద్దగా భయపడాల్సిన పనిలేదు. లైంగిక కోరిక కలిగినప్పుడు అంగం స్తంభిస్తున్నా, స్తంభించిన పురుషాంగం కనీసం మూడున్నర అంగుళాల మేర పెరుగుతున్నా కంగారు పడవలసిన పని లేదు. అంగంతోపాటు, వృషణాలు కూడా చల్లని వాతావరణానికి కుంచించుకుపోవడం అత్యంత సహజం. కాబట్టి ఈ మార్పులకు భయపడకూడదని నిపుణులు చెబుతున్నారు. 

click me!