దీపావళి స్పెషల్ సాంప్రదాయ స్వీట్లు ఇవే..!

By Mahesh Rajamoni  |  First Published Oct 21, 2022, 7:45 AM IST

దీపావళి 2022: దీపావళికి స్వేట్లే చాలా చాలా స్పెషల్. అందుకే ఆ రోజున అందరి ఇంట్లో నోరూరించే స్వీట్లు ఉంటాయి. అందులో సాంప్రదాయ స్వీట్లైతే బలే టేస్టీగా ఉంటాయి.. 
 


ఇండియాలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునే అతి పెద్ద పండుగల్లో దీపావళి ఒకటి. ఇళ్లు, వీధులు, మార్కెట్లు, షాపులు అంటూ ప్రతి ఒక్కటి దీపాల కాంతుల్లో దగదగా వెళిగిపోతుంటాయి. అంతేకాదు ఇంటి ముంగిట రంగు రుంగల ముగ్గులు కూడా కట్టిపడేస్తాయి. ఇకపోతే అన్ని పండుగల మాదిరిగానే ఈ పండుగలో ముఖ్యమైన వాటిలో ఫుడ్ ఒకటి. ఈ పండుగకు సాంప్రదాయ స్వీట్లను ఎక్కువగా తయారుచేస్తాయి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి..  అవేంటో మీరు ఓలుక్కేయండి.. 

కాజు కట్లి: కాజు కట్లి ని ఇష్టపడని వారుండరు. అందులో కాజు కట్లి తినకుంటే అసలు దీపావళి పండుగ లాగే అనిపించదు. జీడిపప్పు, పంచదార, యాలకుల పొడి, పాలతో దీన్ని తయారుచేస్తారు. ఈ కాజు కట్లిని ఇంట్లోనే చాలా సులువుగా తయారుచేసుకోవచ్చు.

Latest Videos

రస్మలై: కార్న్ ఫ్లోర్, యాలకులు, కుంకుమపువ్వుతో రస్మలైని తయారుచేస్తారు. నోట్లో అలా వేసుకోగానే ఇలా కరిగిపోయేంత తియ్యగా ఉండే ఈ స్వీట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. 

మోహంతల్  : ఈ స్వీట్ గుజరాత్, రాజస్థాన్ లో చాలా ఫేమస్. దీన్ని గ్రామ్ పిండితో తయారుచేస్తారు. దీన్ని ఇంట్లో చాలా సులువుగా తయారుచేయొచ్చు. ఈ పండుగకు పర్ఫెక్ట్ రెసిపీ ఇది.. 

మైసూర్ పాక్: ఇది ఎప్పుటి నుంచో మంచి పేరున్న స్వీట్ ఐటమ్. ఈ స్వీట్ మొదట మైసూర్ ప్యాలెస్ లోనే పుట్టుకొచ్చింది. అందుకే దీనికి మైసూర్ అనే పేరు వచ్చింది. ఈ స్వీట్ బయట షాపుల్లో దొరుకుతుంది. 

చావల్ కీ ఖీర్: దీన్ని ప్రతి పండుగకు లేదా ప్రతి శుభాకార్యానికి తప్పకుండా తయారుచేస్తారు. చక్కెర, పాలు, సువాసన గల బాస్మతి బియ్యం, జీడిపప్పు, కుంకుమ పువ్వు, బాదం పలుకులు వంటి పదార్థాలతో చావల్ కీ ఖీర్ ను తయారుచేస్తారు. అసలు దీన్ని ఎవరూ కదా కాదనలేరు. 

గులాబ్ జామున్: ఏ స్వీట్ ఉన్నా .. లేకున్నా.. గులాబ్ జామున్ మాత్రం ప్రతి పండుగకు పక్కగా ఉండాల్సిందేనంటారు చాలా మంది. తియ్యని చక్కెర పాకంలో ముంచిన గులాబ్ జామున్ బలే టేస్టీగా ఉంటుంది. అన్ని స్వీట్లలో ఎక్కువ మందికి నచ్చి ఇష్టంగా తినే వాటిలో  ఇదీ ఒకటి. దీన్ని తయారుచేయడం చాలా ఈజీ కూడా..

రాగి కొబ్బరి లడ్డూ:  శీతాకాలంలో ఈ రాగి కొబ్బరి లడ్డును తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది శరీరంలో వేడిని పెంచుతుంది. కొబ్బరి లడ్డూలో తురిమిన కొబ్బరి, రాగి పండి, వేరుశెనగ, బెల్లం, టేస్టీ క్రంచ్ లు వంటి పదార్థాలు ఉంటాయి. 

డ్రై ఫ్రూట్స్ సందేశ్: బెంగాలీ స్పెషల్ వంటకం డ్రై ఫ్రూట్స్ సందేశ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని డ్రై ఫ్రూట్స్, పాల తో తయారుచేస్తారు. ఈ స్వీట్ వంటకాన్ని లంచ్ లేదా డిన్నర్ తర్వాత వచ్చిన అతిథులకు సర్వ్ చేయొచ్చు.

click me!