దీపావళికి ప్రతి ఇళ్లూ దీపాల కాంతులతో వెలిగిపోతుంది. అలాగే రకరకాల స్వీట్ల సువానతో నోరూరిస్తుంది కూడా. అయితే మార్కెట్లో దొరికే స్వీట్లు ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఎందుకంటే వీటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. కల్తీవి అయ్యే అవకాశం కూడా ఉంది. ఇలాంటివి డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.
డయాబెటీస్ పేషెంట్లు చక్కెర పదార్థాలకు దూరంగా ఉండాలి. కానీ పండుగ వేళ కూడా స్వీట్లను తినకుండా నోటిని కట్టేసుకుని ఉండటం చాలా కష్టం. అలాగని మార్కెట్లో దొరికే వాటిని తింటే రక్తంలో చక్కెర లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్లో ఉండే స్వీట్లలో షుగర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందులోనూ కొన్ని షాపుల్లో కల్తీ స్వీట్లను కూడా అమ్ముతుంటారు. ఈ స్వీట్లను తింటే లేని పోని రోగాలొచ్చే ప్రమాదం ఉంది. దీనికి తోడు డయాబెటీస్ పేషెంట్లకు ఈ స్వీట్లు అస్సలు మంచివి కావు. ఒకవేళ ఈ దీపావళికి ఎలాగైనా స్వీట్లను తినాలనుకుంటే మాత్రం ఇంట్లోనే తయారుచేసుకోవడం బెటర్. అది కూడా చక్కెర లేకుండా. చక్కెర వాడకుండా స్వీట్లను రుచిగా ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం పదండి..
డ్రై ఫ్రూట్స్, ఖర్జూర లడ్డూ: ఈ దీపావళికి మధుమేహులతో పాటుగా ఇతరులు కూడా ఇష్టంగా తినే స్వీట్ లడ్డూల్లో ఇదీ ఒకటి. పిస్తాలు, బాదం పప్పులు, అంజీర్, జీడిపప్పులను పిండిలా చేసి.. లడ్డూలు తయారుచేసుకోవచ్చు. ఇవి మరింత తియ్యగా అవడానికి తేనెను కూడా ఉపయోగించొచ్చు.
undefined
కస్టర్డ్ ఆపిల్ ఖీర్: ఈ పండుగ సీజన్ లో ఖీర్ ను తినే వారు చాలా మందే ఉంటారు. ఇక దీపావళి రోజు నాడు సాయంత్రం వేళ ఇంటిళ్లి పాది ఒక దగ్గర కూర్చొని వేడి వేడి ఖీర్ ను తింటుంటారు. వితౌట్ షుగరో తో ఖీర్ ను తయారుచేయాలనుకుంటే సీతాఫలాలు, బెల్లం పొడి, కొబ్బరి పాలు, గింజలను ఉపయోగించి ఖీర్ ను తయారుచేయండి. ఇది రుచిగా ఉండటమే కాదు.. ఆరోగ్యకరమైన స్వీట్ కూడా.
పైనాపిల్ రైస్ పుడ్డింగ్: పైనాపిల్ తో వడ్డించే వేడి వేడి రైస్ పుడ్డింగ్ ఎప్పుడూ రీఫ్రెష్ గానే ఉంటుంది. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. లైమ్ లీవ్స్, లెమన్ గ్రాస్, దాల్చిన చెక్క, యాలకులు, జాజికాయల, అన్నం, పాలతో తయారుచేసే ఈ స్వీట్ నోట్లో అలా వేసుకోగానే ఇలా కరిగిపోతుంది. ఈ రెసిపీలో సహజ చక్కెర ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం కూడా ఉండదు.