దీపావళి 2022: ఇంట్లోనే చాలా ఈజీగా తయారుచేసుకునే టేస్టీ టేస్టీ దీపావళి వంటకాలు ఇవే..

By Mahesh Rajamoni  |  First Published Oct 20, 2022, 4:56 PM IST

దీపావళి 2022:  దీపావళి వచ్చిందంటే చాలు రకరకాల స్వీట్లతో పాటుగా.. నోరూరించే కొన్ని రెసిపీలను చాలా ఈజీగా, తొందరగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. అవేంటంటే.. 
 


దీపాల కాంతుల్లో కేవలం ఇండ్లే కాదు.. వీధులు, గ్రామాలు, పట్టణాలు కూడా వెలిగిపోతుంటాయి. ప్రతిఏటా వచ్చే ఈ దీపావళి పండుగకు ప్రతి ఒక్కరూ రకరకాల స్వీట్లను, లడ్డూలను, మిఠాయిలను ఖచ్చితంగా తయారుచేస్తుంటారు. ఇంకొంతమంది రిస్క్ ఎందుకని షాపుల్లో వీటిని కొంటుంటారు. అయితే దీపావళి స్పెషల్ సాంప్రదాయ స్నాక్స్ కొన్నింటిని ఇంట్లోనే చాలా సులువుగా తయారుచేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం పదండి.. 

సమోసా : క్రిస్పీగా, స్పైసీగా ఉండే సమోసాలను వద్దనే వారు అస్సలు ఉండరు. ఈ పండుగకు పర్ఫెక్ట్ స్నాక్స్ ఏమైనా ఉందా అంటే అది సమోసానే. దీపావళి రోజున మీ ఇంట్లో పార్టీని ఏర్పాటు చేస్తే.. వచ్చిన వాళ్లకు చాయ్ సమోసా ను పక్కాగా ఇవ్వండి. అయితే వీటిని ఇంట్లో తయారు చేయడం చాలా సులువు కూడా. 

Latest Videos

మురుకులు: వీటిని బియ్యం పిండితో తయారుచేస్తారు. సాధారణంగా భారతదేశంలోని ఉత్తర ప్రాంతాల్లో వీటిని చక్లి అని అంటారు. వీటిని ఇంట్లోనే చాలా సులువుగా తయారుచేసుకోవచ్చు. మీకు తెలుసా.. ఇవి మూడు నుంచి నాలుగు నెలలైనా పాడవవు. 

గులాబ్ జామూన్: ఈ దీపావళి స్పెషల్ స్వీట్ ఏదైనా ఉందంటే అది గులాబ్ జామూనే. తియ్యగా, టేస్టీగా ఉండే గులాబ్ జామూన్ ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. అయితే ఈ చక్కెర సిరప్ మరీ తిక్ గా ఉండకుండా చూసుకోండి. వీటిని తయారుచేయడం చాలా ఈజీ అని అందరికీ తెలుసు.

సూజీ హల్వా:  ఏదైన స్పెషల్ సందర్భం ఉంటే సూజీ హల్వాను ఖచ్చితంగా తయారుచేస్తారు. పుట్టిన రోజుల నుంచి పెళ్లిరోజు, పండుగ రోజూ అంటూ ప్రతి స్పెషల్ మూమెంట్ లో ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రతిఒక్కరికీ బాగా ఇష్టం. కాబట్టి దీపావళి రోజున దీన్నిఖచ్చితంగా తయారుచేయండి.

మూంగ్ దాల్ కా హల్వా: దీని పేరు వింటేనే నోట్లో లాలాజలం ఊరుతుంది. ఈ రెసిపీని ప్రతేక్య సందర్భాల్లోనే తయారుచేస్తారు. దీపావళికి వచ్చిన చుట్టాలకు పెట్టడానికి దీనికి మించి స్పెషల్ వంటకం మరేదీ ఉండదేమో. దీన్ని ఇంట్లో కూడా తయారుచేసుకోవచ్చు. 

మసాలా వేరుశెనగలు:  టేస్టీ టేస్టీ స్నాక్స్ అంటే టక్కున గుర్తొచ్చేవి మసాలా వేరుశెనగలే. వీటి రుచి అద్భుత:హా అనిపిస్తుంది. దీపావళి సాయంత్రం వేళ అందరూ ఒక చోట కూర్చొని తింటే బలే ఉంటుంది. వీటిని తయారుచేయడం చాలా ఈజీ కూడా. ఇవి నచ్చని వాళ్లుండరు. 

రసగుల్లా: ఇది బెంగాలీ వంటకం. ప్రతి ఒక్కరికీ బాగా నచ్చుతుంది కూడా. అసలు ఇది లేకుండా ఏ శుభకార్యం జరగదంటే నమ్మండి. ప్రతి సంతోషకరమైన సందర్భంలో దీన్ని తప్పకుండా తింటారు. మందపాటి చక్కెర సిరప్ లో నానబెట్టే ఈ చిన్న చిన్న బంతులు ప్రతి ఒక్కరికీ ఇష్టమే.. 
 

click me!